సుశాంత్ సింగ్, అంకితా లోఖండే రొమాంటిక్ వీడియో వైరల్.. ఎన్నో మధురానుభూతులతో...

దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం ఎందరినో విషాదంలో ముంచెత్తింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆయన మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొన్నది. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకొని మరణించారనే వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణించి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో సుశాంత్, ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖండేకు సంబంధించిన ఓ వీడియో మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్ సింగ్, అంకిత ఇద్దరు కలిసి పవిత్ర రిస్తా అనే హిందీ టెలివిజన్ సీరియల్‌లో నటించారు. ఈ టెలివిజన్ సీరియల్‌తో విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఈ సీరియల్ జూర్ 1 తేదీకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ సీరియల్‌లో మానవ్ (సుశాంత్), అర్చన (అంకిత) వివాహం తర్వాత వచ్చే రొమాంటిక్ పాట ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తలుచుకొని అభిమానులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.

ఈ వీడియోలో వచ్చే జైసీ హో వైసీ రహో అనే పాట ఇప్పుడు అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ పాటను సింగర్ యాసర్ దేశాయ్ పాడారు. వినయ్ రామ్ తివారీ సంగీతం అందించారు.

 Sushant Singh Rajput and Ankita Lokhandes Romantic video of Pavitra Rista goes viral

పవిత్ర రిస్తా సీరియల్‌ 12 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా 12 సంవత్సరాలు .. లక్షలాది మెమొరీస్ మదిలో మెదిలాయి. పవిత్ర రిస్తా నా కెరీర్‌ను ఉన్నత స్థితికి చేర్చింది. జీవితాంతం బాండింగ్‌ను ఏర్పరిచింది అంటూ ఏక్తా కపూర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన వీడియోను కూడా షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X