నూతన్ నాయుడు, శ్యామల ఏమయ్యారు.. బిగ్ బాస్‌లో సీక్రెట్‌గా ఏం జరుగుతోంది!
Recommended Video

బిగ్ బాస్ 2 లో కొత్త కొత్త సంగతులు చోటుచేసుకుంటున్నాయి. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. మరింత రసవత్తరంగా ఈ షోని మార్చేందుకు కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శ్యామల, నూతన్ నాయుడు తిరిగి హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. హౌస్ లో జరుగుతున్న పరిణామాలు, శ్యామల, నూతన్ నాయుడు ఎంట్రీ చూస్తుంటే ఆడియన్స్ లో ఊహాగానాలు మొదలవుతున్నాయి.

సస్పెన్స్
ఆడియన్స్ ఓటింగ్ ద్వారా నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. వీరిద్దరి రీ ఎంట్రీ ఖరారయ్యింది. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు హౌస్ లోకి ప్రవేశిస్తారు అనే విషయాన్ని మాత్రం నాని సస్పెన్స్ లోకి నెట్టేశాడు.

సీక్రెట్ గా
ఆదివారం శ్యామల, నూతన్ నాయుడుని నాని స్టేజి మీదకు ఆహ్వానించాడు. ఆ తరువాత వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారనే విషయం తెలియదు. ప్రచారం జరుగుతున్న ఊహాగానాల ప్రకారం సీక్రెట్ రూమ్ లో వీరిద్దరిని ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎలిమినేషన్
ఈవారం ఎలిమినేషన్ భిన్నంగా ప్లాన్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కౌశల్, దీప్తి, బాబు, గణేష్, నందిని ఇప్పటికే నామినేట్ అయ్యారు. డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిలో ఎవరు బయటకు వెళతారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

రీ ఎంట్రీ అప్పుడేనా
ఎలిమినేషన్ విషయంలో బాబు గోగినేని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎలిమినేషన్ పూర్తయ్యాక నూతన్ నాయుడు, శ్యామల రీ ఎంట్రీ అనే అవకాశాలు లేకపోలేదు. నాని అన్నట్లు ఏమైనా జరగొచ్చు మరి.


Click it and Unblock the Notifications











