రోబో అసలు కథ 25ఏళ్ళ క్రితమే.. మెగాస్టార్‌తో అనుకున్నాం కానీ: సీనియర్ డైరెక్టర్

1990ల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన వారిలో ఎస్వీ.కృష్ణా రెడ్డి ఒకరు. ఆయన చేసిన సినిమాలు చాలా వరకు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఒక రికార్డ్ క్రియేట్ చేశాయి. సరికొత్త కథలలో కామెడీ సెంటిమెంట్ ను జోడించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఎస్వీ.కృష్ణా రెడ్డి ఇటీవల అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో తన కెరీర్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్

బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్

కేవలం దర్శకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా చాలా అద్భుతమైన పాటలను అందించిన ఎస్వీ.కృష్ణా అభిమానుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. 1993లో మాయలోడు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ తో అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆయన అమితంగా ఆకట్టుకునేవారు.

రోబో కథను ఎప్పుడో చెప్పారు

రోబో కథను ఎప్పుడో చెప్పారు

రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, శుభలగ్నం, టాప్ హీరో, ఘటోత్కచుడు వంటి సినిమాలతో కెరీర్ మొదట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేశారు. మొన్న వచ్చిన రోబో సినిమా మెయిన్ కథను ఘటోత్కచుడు(1995) సినిమాలో ఎప్పుడో చూపించారు. అందులో కూడా ఒక రోబో హీరోయిన్ కోసం ఎంతగానో మారిపోతుంది.ముఖ్యంగా యమలీల సినిమా అప్పట్లో ఒక న్యూ వండర్ అనే చెప్పాలి. ఒక చిన్నపాటి కమెడియన్ గా ఉన్న అలీని హీరోగా చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఆ సినిమా గురించి ఆయన స్పందించారు.

సౌందర్య భయపడి చేయనంది

సౌందర్య భయపడి చేయనంది

ఎస్వీ.కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఆ సినిమా కథ గురించి తెలుసుకొని చాలా మంది పెద్ద హీరోలు పోటీ పడ్డారు. కానీ ఆ కథకు స్టార్ డమ్ ఉన్న కమర్షియల్ హీరోలు సెట్టవ్వరు. ఆ హీరో ఏమి చేతకాని అసమర్దుడిలా ఉండాలి. అందుకే అలీని సెలెక్ట్ చేసుకున్నా. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌందర్య చేయాల్సింది. కానీ ఆమె అప్పుడు పెద్ద హీరోలతో బిజీగా ఉన్నందున చేయడానికి భయపడి డ్రాప్ అయ్యింది.

Recommended Video

Keerthy Suresh's Telugu Debut Aina Ishtam Nuvvu Teaser
మెగాస్టార్ తో సినిమా అనుకున్నా..

మెగాస్టార్ తో సినిమా అనుకున్నా..

ఆ సినిమా తరువాత శుభలగ్నం సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఇక అశ్వినీదత్ వైజయంతి ప్రొడక్షన్ లోనే మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. లాంచ్ కూడా చేశాను. కానీ ఆ సినిమా అప్పట్లోనే హై టెక్నాలజీ అవసరం పడింది. వర్కౌట్ కాదేమో అని చర్చల దశలోనే ఎండ్ కార్డ్ పడింది. ఇప్పుడైతే చేయవచ్చు. ఇక మెగాస్టార్ సినిమాకు ఒకసారి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. కె.రాఘవేంద్రరావు అడిగారు కూడా. కానీ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను.. అని ఎస్వీ.కృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X