twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా హీరో చేతగాని వాడై ఉండాలి.. ‘యమలీల’పై ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్

    |

    దర్శకుడి, సంగీత దర్శకుడి, హీరోగా, నటుడిగా ఇలా ఎన్నో రకాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎమోషన్స్ ఉంటూనే సున్నితమైన, ఎంతో ఆహ్లాదకరంగా అనిపించే కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేయడే ఎస్వీ కృష్టారెడ్డి ప్రత్యేకత. ఇండస్ట్రీలోకి హీరోగా అవుదామని ఎంట్రీ ఇచ్చి ఎన్నో గడపలు తొక్కి చివరకు దర్శకుడిగా మారారా. ఆపై అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. తాజాగా ఆయన అలీతో సరదాగా షోలో పాల్గొని అనేక విషయాలు వెల్లడించారు.

     అలీతో ప్రత్యేక బంధం..

    అలీతో ప్రత్యేక బంధం..

    అలీ సినీ కెరీర్‌ను మలుపు తిప్పి హీరోగా పీక్స్ స్టేజ్‌కి తీసుకెళ్లిన చిత్రం యమలీల. ఈ సినిమా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇదో క్లాసిక్. ఈ సినిమాను తెరకెక్కించిన కృష్ణారెడ్డి తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మొదటగా ఈ కథ పెద్ద హీరోకు అనుకునే చేశారు. కానీ అవేవీ కుదరలేదు. మహేష్ బాబు కోసం అడిగితే.. ఇంకా చిన్న పిల్లవాడు అని కృష్ణ సున్నితంగా వద్దన్నాడట.

    ఫిట్ ఫర్ నథింగ్..

    ఫిట్ ఫర్ నథింగ్..

    అయితే తాజాగా అలీ యమలీలకు సంబంధించిన ప్రశ్న అడిగారు. అది ఎవరి కోసం రాశారు? ఎవరిని అనుకున్నారు? అని అలీ అడిగాడు. అయితే మేం చేస్తాం కదా అని పెద్ద పెద్ద హీరోలు అడిగారట. కానీ తన హీరో అలాగే ఉండాలి.. చేతగాని వాడై ఉండాలి.. ఫిట్ ఫర్ నథింగే అనేలా ఉండాలి అనుకున్నాను అని తెలిపారు.

    హీరో అవుదామనే వచ్చాను..

    హీరో అవుదామనే వచ్చాను..

    అసలు హీరో అవుదామనే ఆలోచన ఎందుకు వచ్చింది? అని అలీ అడిగాడు. ఇండస్ట్రీకి వచ్చిందే హీరో అవుదామని, ఫోటోలు పట్టుకుని తిరిగాను.. గానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వరని అర్థమైంది. ఆపై అచ్చి రెడ్డి గారి మాటతో డైరెక్టర్‌గా మారాను. కానీ కచ్చితంగా హీరో అవుతావని ఆయన ఆన్నాడు. అలాగే జరిగింది అని తెలిపారు.

    ఇంట్లో వాళ్లు అలా అన్నారు...

    ఇంట్లో వాళ్లు అలా అన్నారు...

    యమలీల తరువాత మీ రియాక్షన్ ఏంటి? మీ పేరెంట్స్ ఏమన్నారు? అని అలీని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అప్పటి వరకు ఇంట్లో మా నాన్న అరేయ్ అది తీసుకురారా.. ఇది అక్కడ పెట్టురా అని అనేవాడు.. ఈ సినిమా రిలీజయ్యాక.. ఫాలోయింగ్ పెరిగాక.. రా అనడం మానేసి అలీ గారు అని పిలవడం ప్రారంభించారు అని అలీ తెలిపాడు.

    English summary
    SV Krishna Reddy About Yamaleela And Hero Ali, SV Krishna Reddy recently Came As Guset In Ali Tho saradaga Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X