‘బిగ్ బాస్-6’లో నిత్యానంద?

By Bojja Kumar

Swami Nithyananda in Bigg Boss 6?
ముంబై : వివాదాస్పద స్వామిజీ నిత్యానంద గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సెక్సీ వ్యవహారాలు, భక్తులను మోసం చేసాడనే ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ స్వామిజీ త్వరలో ఇండియాలోనే బిగ్ రియాల్టీ షో అయిన 'బిగ్ బాస్' 6వ సీజన్లో పాల్గొన బోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ నటి రంజితతో సెక్స్ వ్యవహారం తర్వాత నిత్యానంద బండారం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలం ఎవరికీ కనిపించకుండా రహస్య ప్రదేశంలో తలదాచుకున్న నిత్యానంద ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. కోర్టులో తనకు సెక్స్ చేసే మగతం లేదని లేదని సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్యర్య పరిచాడు నిత్యానంద. మరి 'బిగ్ బాస్ ' రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా నిత్యానంద తన భక్తులకు ఏం చెప్పబోతున్నాడు? అనేది ఆసక్తి కరంగా మారింది.

ఆ సంగతి పక్కన పెడితే...నిత్యానంద సినీ నటి రంజితతో కలిసి విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని గత నెల మొదటి వారంలో వార్తలు వచ్చాయి. నిత్యానంద శిష్యుడు కౌషిక్‌ను పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. అతని నుండి 32 పాసుపోర్టులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని నుండి పలు విషయాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.

రంజితతో కలిసి నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే ఆయన అందరినీ ఆశ్చర్య పరుస్తూ...కొన్ని రోజుల క్రితం తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రత్యక్షమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X