ఆ టీవీ షోలో...సెక్స్ ఆరోపణల స్వామి నిత్యానంద!
హైదరాబాద్: సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద స్వామీజీ నిత్యానంద త్వరలో ఆన్ స్క్రీన్‌పై దర్శనమివ్వబోతున్నారు. అయితే ఆయన ఏదైనా సినిమాలో కనిపిస్తారని మాత్రం ఊహించుకోవద్దు. కన్నడలో పాపులర్ అయిన రియాల్టీ షో 'బిగ్ బాస్ కన్నడ 2'లో ఆయన కనిపించబోతున్నారు.
రియాల్టీ షోకు మరింత పాపులారిటీ తెచ్చేందుకు వివాదాస్పద స్వామీజీని బిగ్ బాస్ హౌస్‌లో ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని కన్నడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. సువర్ణ టీవీలో ఈషో ప్రసారం కాబోతోంది. జూన్ మొదటి వారం నుండి ఈ షో ప్రారంభం కానుంది.
స్వామి నిత్యానందను ఈ రియాల్టీ షోలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు సువర్ణ టీవీ చీఫ్ అనిల్ నారంగ్ వెల్లడించారు. అయితే ఈ ఆఫర్‌కు ఇంకా నిత్యానంద నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ వారంలో ఆయన షోలోకి వచ్చేది రానిది తేలిపోతుందని అంటున్నారకు.
'బిగ్ బాస్ కన్నడ 2 రియాల్టీషోలో రావడాలని స్వామిజీని రిక్వెస్ట్ చేసాము. ఆ సమయంలో ఆయన వారణాశి ట్రిప్‌లో ఉన్నారు. తనకు ఈ ఆఫర్ లభించడం పట్ల నిత్యానంద సుముఖత వ్యక్తంచేసారని, అయితే తప్పకుండా అందుబాటులో ఉంటాననే విషయంమై ఆయన స్పష్ట ఇవ్వలేక పోతున్నారని, ఈ వారంలో ఏదో ఒక విషయం తేలి పోతుంది. ఇతర మార్గాల ద్వారా కూడా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని అనిల్ తెలిపారు.

నిత్యానంద, రంజిత కాంట్రవర్సీ
2010 సంవత్సరంలో సినీనటి రంజితతో నిత్యానంద సెక్స్ స్కాండల్ వివాదం కారణంగా వార్తల్లో వ్యక్తిగా మారారు.

ధ్యానపీఠంలో నిత్యానంద
ప్రస్తుతం నిత్యానంద కర్నాటక రామ్ నగర్ జిల్లాలోని బిదాది సమీపంలోని ధ్యానపీఠ ఆశ్రమంలో ఉంటున్నారు.

నిత్యానందపై సినిమా
నిత్యానంద సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనపై పలు సినిమాలు వచ్చాయి.

బిగ్ బాస్ షోలో 3వ స్వామి నిత్యానంద
ఇంతకు ముందు ఈ బిగ్ బాస్ షోలో స్వామీజీలు నరేంద్ర బాబు వర్మ, కాలిస్వామిలు ఎంట్రీ ఇచ్చారు. నిత్యానంద మూడో వ్యక్తి.

నరేంద్ర బాబు వర్మ
గతంలో బిగ్ బాబ్ షోలో పాల్గొన్న కన్నడ స్వామిజీ నరేంద్ర బాబు శర్మ.


Click it and Unblock the Notifications











