Brahmamudi October 13th:కావ్య కొత్త డ్రామా, రాజ్ షాక్... అబార్షన్ కోసం స్వప్న కొత్త స్కెచ్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పు... అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు అని పెద్దమ్మను అడుగుతుంది. ఇంతలో అక్కడికి కృష్ణమూర్తి, కనకం వస్తారు. ఎక్కడికి వెళ్లారు అని అప్పు అడుగుతుంది. పేరంటానికి వెళ్లాం అని కనకం చెప్పి కవర్ చేస్తుంది. ఇక అప్పుకు డౌట్ వచ్చి... పేరంటానికి మగవాళ్లను కూడా తీసుకెళ్తారా అని అంటుంది. నా మొగుడు నా ఇష్టం అని కనకం చెప్పుకువస్తుంది. అన్ని మాటలు అంటుంటే ఏం అనకుండా ఉంటావేంటీ అని కృష్ణమూర్తితో అప్పు అంటుంది. ఇక కృష్ణ మూర్తి నన్ను మధ్యలోకి నన్ను లాగొద్దు అని చెప్తాడు.
మరోవైపు గదిలోకి కావ్య వెళ్తుండగా.. రాజ్ పిలుస్తాడు. నువ్వు నిజంగానే మొక్కు తీర్చుకునేందుకు వెళ్లావా అని అడుగుతాడు. నా భర్తకు నా మీద ప్రేమ ఉండాలని కోరుకున్నా... అది జరిగింది.. అందుకే మొక్కు తీర్చుకున్నా.. మీరు నాకోసం ఎంత వెతికారో చెప్పారు కదా... ఇక నా కళ్లు తెరచుకున్నాయి అని అంటుంది కావ్య. దానికి రాజ్... నువ్ కనపడట్లేదన్న కంగారుతో అని అంటాడు. దానికి కావ్య... కంగారుతో వెతికారా. నేను చనిపోతే.. అది మీ మీదకు ఎక్కడికి వస్తుందన్న భయంతో వెతికారా అని అంటుంది.

ఈసారి మిస్ అవ్వు అస్సలు వెతకను అని రాజ్ అంటాడు. దీంతో కబోర్డ్ లో ఉన్న డ్రెస్సులు తీసి బయట వేస్తుంది కావ్య. ఏం చేస్తున్నావ్ అని రాజ్ అడిగితే.. మిస్ అయితే వెతకను అన్నారుగా. చూద్దామని కావ్య అంటుంది. ఇప్పటివరకు చేసింది చాలు అని దండం పెడతాడు రాజ్. నువ్వు ఆడుకుంటే ఆటబొమ్మనయ్యే ఓపిక కూడా లేదు అని రాజ్ అంటాడు. దానికి కావ్య.. రాజ్ చేస్తున్న మోసం గురించి మనసులో బాధ పడుతుంది.
ఇక మరోవైపు... స్వప్న సీమంతం గురించి ఇంట్లో మాట్లాడుకుంటారు. రుద్రాణికి ఇంట్లో వాళ్లు మీ కోడలికి సీమంతం చేయాలని చెప్తారు. దానికి రుద్రాణి అవసరం లేదు అని చెప్తుంది. రాహుల్ స్వప్నలు పెళ్లి ఎలా జరిగిందో తెలిసిందే కదా... పెళ్లికి ముందే కడుపు అయిందనే విషయం బయటపడుతుంది.. అందుకే వద్దు అని చెప్తుంది. ఇక ఇందీరాదేవి ప్రతి ఆడపిల్ల కోరుకునే వేడుక ఇది. పంతులును పిలిచి ముహుర్తం పెట్టిస్తాను అని ఇందిరాదేవి అంటుంది.

నేను కడుపు ఎలా పోగట్టాలో ఆలోచిస్తుంటే... వీళ్లు సీమంతం అంటారేంటి అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు స్వప్న కూడా కంగారు పడుతుంది. వీళ్లేంటి సీమంతం అంటారు. ఇక అబార్షన్ కోసం కొత్త ప్లాన్ వేస్తుంది మెట్లపై నుంచి కింద పడితే.. అంతా చూస్తారు. డాక్టర్ ఎలాగు మన ఫ్రెండే కాబట్టి అబార్షన్ అని చెప్పి నమ్మిద్దాం అని అనుకుంటుంది. ఇక మరోవైపు అప్పుకి కాల్ చేసి కల్యాణ్ కలవమని రమ్మంటాడు. రానని గట్టిగా చెబుతుంది అప్పు. లేదు వస్తున్నావ్. నీకోసం ఎదురుచూస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు కల్యాణ్. అదంతా విన్న కనకం నోరు మూసుకుని వెళ్లమని అప్పుకు చెప్తుంది.
మరోవైపు కిచెన్ లో కావ్య పని చేసుకుంటుంటే రాజ్ వస్తాడు. ఇక కావ్య కావాలనే కాల్ వచ్చినట్లు మాట్లాడుతుంది. అంత మోసం చేసినవాడిని చెప్పుతో కొట్టాలి. అయినా భయం లేకపోతే చంపేయ్. మా ఆయనకు పలుకుబడి ఉంది. బెయిల్ ఇప్పిస్తారు అని కావ్య చెబుతుంది. అదంతా విన్న ఒసెయ్ అని ఏంటే ఇలా అంటున్నావ్ అని రాజ్ అంటాడు. నా ఫ్రెండ్‌ని తన హస్బండ్ చీటింగ్ చేశాడు అని కావ్య చెబుతుంది.

దీని ఫ్రెండ్ కు హెల్ప్ చేసి ఇంప్రెషన్ చేద్దామని రాజ్ అనుకుంటాడు. వాడు ఏం చేశాడు అని రాజ్ అడుగుతాడు. ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేశాడు అని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. లేని ప్రేమ ఉందని నటించడం ఎంత పెద్ద తప్పు అండి. అలాంటి వాన్ని చంపేసిన పాపం లేదు అని కావ్య అంటుంది. అలా చేయడానికి వాడికి ఏ కారణాలు ఉన్నాయో. మనం ఆ యాంగిల్‌లో ఆలోచించాలి కదా అని రాజ్ అంటాడు. నన్ను తిట్టడానికే నన్నే అడుగుతుంది అని రాజ్ అనకుంటాడు. వాన్ని చంపేసేయ్ అని కావ్య ఫోన్ లో చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. రాజ్ తెగ భయపడిపోతాడు.
మరోవైపు ఇంట్లో మెట్లపై నుంచి స్వప్న కావాలని కింద పడిపోతుంది. అది చూసిన కావ్య వచ్చి పట్టుకుంటుంది. కావ్య లేకపోతే ఏంటీ పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలి కదా అని అంతా స్వప్నను తిడతారు. అదే జరిగితే బాగుండేది అని రుద్రాణి అనుకుంటుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య కాలు బెణికితే రాజ్ సేవలు చేస్తుంటాడు. వారి మధ్య ప్రేమ చిగురించినట్లు అనిపిస్తుంటుంది.


Click it and Unblock the Notifications











