Brahmamudi July 26th: రాజ్‌పై కావ్య రివేంజ్.. స్వప్న దిక్కుమాలిన యాడ్ వైరల్.. ఇంట్లోంచి ఇక గెట్​ ఔటే?

బ్రహ్మముడి సీరియల్ కు రోజు రోజుకు మంచి ఆదరణతో పాటు.. రేటింగ్ కూడా వస్తోంది. ఇక మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో టాప్ సీరియల్ గా బ్రహ్మముడి నిలిచింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తిగా సాగింది. రాజ్.. కావ్యను సాటి మనిషిగా చూస్తుండటం.. ఆ విషయం కావ్యకు తెలిసి బాధపడుతోంది. దానికి తగ్గట్లుగానే రాజ్ పై రివేంజ్ తీర్చుకుంటుంది. మరోవైపు స్పప్న యాడ్ వైరల్ గా మారుతోంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ధాన్యలక్ష్మి హ్యాపీ:ఎపిసోడ్ ప్రారంభంలో ధాన్యలక్ష్మి కావ్య దగ్గరకి వచ్చి.. మా రాజ్ నిన్ను అందరి ముందు అంతగా వెనకేసుకురావడం అంటే మామూలు విషయమా అని సంతోషపడుతుంది. చూసిన నాకే అంత సంతోషంగా ఉంది, ఇక నువ్వు ఎంత సంబరపడుతున్నావో అని చూద్దామని వచ్చానని చెప్తుంది. కావ్య బాధగా మాట్లాడుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి.. దీని కోసమే ఇన్ని రోజులు ఎదురుచూశావు. నీ అణుకువ ఈ ఇంట్లో ఎవరూ గుర్తించలేదు. కానీ ఇన్నాళ్లకి రాజ్ నీ మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు. రాజ్ లో మంచి మార్పు వచ్చింది అంటూ చెప్తుంది.

Swapna ad viral and duggirala family shocked in July 26th 2023 Episode number 158 in Brahmamudi Telugu Serial

రాజ్ లో మార్పు...:అంత మార్పు ఆయనలో రాలేదు.. అంత త్వరగా వస్తుందని నేను అనుకోవడం లేదని కావ్య చెబుతుంది. అప్పుడే ఇంద్రాదేవి వచ్చి... నీ ఆలోచన తప్పు రాజ్ లో మార్పు మొదలైంది. మాట, ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూసుకుంటున్న విధానానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నువ్వు పడిన కష్టానికి ఫలితం రాబోతుంది. నువ్వు కోరుకున్న రోజు దగ్గర్లోనే ఉంది. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.. అని చెబుతుంది.

Swapna ad viral and duggirala family shocked in July 26th 2023 Episode number 158 in Brahmamudi Telugu Serial

రాజ్ డౌట్...:మరోవైపు సీన్ కట్ చేస్తే... సాటి మనిషిగా సాయం చేశానని అన్నారు కదా ఆయన చుట్టు తిరుగుతూ సాటి మనిషికి భార్యకి ఉన్న తేడా చూపించాలని కావ్య డిసైడ్ అవుతుంది. రాజ్ తినడానికి వస్తాడు. తింటుంటే రాజ్ కి పొలమారుతుంది. ఎవరు తలుచుకున్నారని కళ్యాణ్ అంటాడు. ఎవరో సాటి మనిషి తలుచుకుని ఉంటారని కావ్య సెటైర్ వేస్తాడు. మీరు సాటి మనిషి అనే మాట అనడం కరెక్ట్ గా లేదు వదిన అంటాడు కల్యాణ్. ఎవరో ఎవరినో అన్నారు అని కావ్య అంటుంది. ఇద్దరూ కాసేపు సాటి మనిషి గురించి కాసేపు సోది పెడతారు. దీని మీద కవిత చెప్పొచ్చు కదా కావ్య అంటే కళ్యాణ్ కవిత్వం ఎత్తుకుంటాడు. అది వినలేక రాజ్, ప్రకాశం అల్లాడిపోతారు. ఈ కళావతి సాటి మనిషి అనే పదాన్ని ఇన్ని సార్లు ఎందుకు నొక్కిందని రాజ్ డౌట్ పడతాడు.

Swapna ad viral and duggirala family shocked in July 26th 2023 Episode number 158 in Brahmamudi Telugu Serial

స్వప్న ప్లాన్...:మరోవైపు స్పప్న డల్ గా ఉండటం చూసి ఇంట్లో వాళ్లు తింటారు కదా ఓదార్చుదాం భర్తగా బాధ్యత అనుకుంటూ వెళ్లి స్పప్నకు సారీ చెప్తాడు. నీకు ముందే చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారని నువ్వే వినలేదు అంటాడు. నవ్వుతూ.. ఏడుస్తున్నాను అనుకున్నావా? వాళ్లకు నిజం తెలిశాక తిట్టిన నోటితోనే పొగుడుతారు అంటూ చెప్తుంది. అంటే నువ్వు మళ్ళీ యాడ్స్ చేయాలని అనుకున్నావా? అంటాడు రాహుల్. అవును చిన్నప్పటి నుంచి మోడల్ అవాలని కలలు కన్నా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినను యాడ్ షూట్స్ చేసి తీరతాను. రేపు నా యాడ్ సోషల్ మీడియాలో వస్తే నన్ను అందరూ గ్రేట్ అంటారు చూస్తూ ఉండు అంటుంది స్పప్న.

సాటి మనిషి...:సీన్ కట్ చేస్తే... మళ్లీ సాటి మనిషి డిస్కర్షన్ మొదలవుతుంది రాజ్, కావ్య మధ్య. కాసేపు వాదించుకుంటారు. ఇక ఇద్దరూ కాసేపు పొట్లాడుకుని.. రాజ్ పడుకుంటాడు. నిద్రలో రాజ్ కు ఎక్కిళ్లువస్తాయి. వెంటనే కావ్య లేచి వాటర్ అందిస్తుంది. సాటి మనిషిగా జాలి వేసి ఇస్తున్నావా అంటాడు. భార్యని సాటి మనిషి అనుకున్నంత తేలికగా భర్తని సాటి మనిషి అనుకోలేను తాగండి. ముందు మీరు మనిషిని మనిషిగా చూడండి. రుద్రాణిని పట్టుకుని ఇది మీ పుట్టిల్లా అత్తిల్లా అని అడిగారు అవసరమా? అంటుంది.

Swapna ad viral and duggirala family shocked in July 26th 2023 Episode number 158 in Brahmamudi Telugu Serial

యాడ్ వైరల్:మరోవైపు స్వప్న యాడ్ రాహుల్ సోషల్ మీడియాలో చూసి తెగ మెచ్చుకుంటాడు.ఈ యాడ్ సోషల్ మీడియాలో వస్తే వైరల్ గా మారుతుందని అంటాడు. వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి అంటే వద్దు.. వాళ్లే చూసి మెచ్చుకోవాలి అంటుంది. కాసేపు సోది చెప్పుకుంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఫ్యామిలీ ఆ యాడ్ చూసి షాక్ అవుతారు. స్వప్నను ఇంట్లో నుంచి గెంటెయాలి అంటుంది రుద్రాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X