Bramhamudi November 25th: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న రాహుల్... చెంప పగులగొట్టిన స్వప్న

బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో (నవంబర్ 25వ తేదీ) మీరు ఎవరు చెప్పినా నేను వినను అంటూ స్వప్నని బయటికి గెంటెయ్యబోతోంది రుద్రాణి. ఇంతలో స్వప్న స్పృహ కోల్పోయి.. కిందపడిపోతుంది. మళ్లీ మరో కొత్త నాటకం మొదలుపెట్టింది. నాలుగు పీకి బయటకు నెట్టేస్తే అదే కళ్ళు తెరుస్తుందని రుద్రాణి ఆవేశంగా అంటుంది. దానికి సరే అని రాహుల్ అంటాడు.

దీంతో రాజ్... రాహుల్ ని ఆగమని చెప్పి తను చేసింది తప్పే కావచ్చు కానీ స్పృహలో లేని ఆడదాన్ని బయటకు నెట్టేయవద్దని అంటాడు. ముందు తనకి ట్రీట్మెంట్ చేయిద్దాం తర్వాత మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు రాజ్. డాక్టర్ వచ్చి స్వప్నని టెస్ట్ చేస్తుంది. షాకింగ్ న్యూస్ చెప్తుంది. స్వప్న ప్రెగ్నెంట్ అని ఇంట్లోని వాళ్లకు చెప్తుంది. రుద్రాణి నమ్మదు.. మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టిందా అయినా నువ్వు ఎంతకీ అమ్ముడు పోయావు అని డాక్టర్ని అనుమానిస్తుంది.

Swapna beaten Rahul in November 25th 2023 Episode number 263 in Brahmamudi Telugu Serial

ఇంతకుముందు ఏ డాక్టర్ అలా చేసిందో నాకు తెలియదు గానీ అందరూ డాక్టర్లు అలా ఉండరని డాక్టర్ సమాధానం చెప్తుంది. స్వప్న ప్రెగ్నెంట్ అనేది నిజం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అంటూ చెప్పి వెళ్తుంది డాక్టర్. దీంతో రాహుల్ ప్లేట్ ఫిరాయిస్తాడు. తను ప్రెగ్నెంట్ అయితే అయి ఉండవచ్చు కానీ ఆ బిడ్డకి తండ్రిని మాత్రం నేను కాదు అంటూ చెప్తాడు. అలా అనటంతో ఇంట్లోని వారంతా షాక్ అవుతారు. ఆ మాట విన్న స్వప్న... రాహుల్ చెంప పగలగొడుతుంది.

ఇంతసేపు మీరు ఏం మాట్లాడినా ఊరుకున్నాను ఎందుకంటే అందులో నా తప్పు ఉంది అంతేకానీ నా క్యారెక్టర్ మీద నిందలు వేస్తే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. నీకు ఎంత ధైర్యం, ఇన్ని తప్పులు చేసి దొరికిపోయాక కూడా ఇంకా బుకాయిస్తున్నావా? అంటూ రాహుల్ మాట్లాడుతాడు. స్వప్న దానికి నేను రిచ్ గా బతకాలి అనుకున్నాను కానీ ఎలా పడితే అలా బతకాలి అనుకోలేదు. పెళ్లికి ముందు నేను ఎవరి మీద మనసు పడలేదు పెళ్లయిన తర్వాత కూడా నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు అంటూ చెప్తుంది.

నువ్వు వాదించినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదని రుద్రాణి అంటుంది. ఎవరితోనో చేసిన పాపం నా కొడుక్కి అంటగట్టాలని చూస్తుంది... ఇలాంటి క్యారెక్టర్ లెస్ ఆడదాన్ని ఈ కుటుంబం ఎలా భరిస్తుందని అంటుంది రుద్రాణి. దీంతో భర్త వదిలేసిన మిమ్మల్ని ఈ కుటుంబం ఆదరిస్తుంది అలాంటిది నన్ను ఎందుకు ఆదరించదని స్వప్న రివర్స్ లో అంటుంది. అయినా ఇంతవరకు వచ్చారు కాబట్టి ఈ బిడ్డ మీ బిడ్డ అని నిరూపించుకోవడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తానని చెప్తుంది.

నేను అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను.... నేను రెడీ... రాహుల్ నువ్వు రెడీయా అంటూ సవాల్ విసురుతుంది స్వప్న. ఒక ఆడపిల్ల అంత గట్టిగా, అంతా కాన్ఫిడెంట్ గా తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది అంటే అందులో కూడా నిజం ఉండి ఉండవచ్చు నిజా నిజాలు తెలియకుండా నిందలు వేయవద్దని సీతారామయ్య అంటాడు. నిజం తెలిసే వరకు ఎలాంటి ముందడుగు వేయడానికి వీల్లేదు అంతవరకు ఓపిక పట్టండి అని తల్లి కొడుకులకు చెప్తాడు.

ఆ తరువాత గదిలో రాహుల్ చెంప పగలగొడుతుంది రుద్రాణి. అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి గాడిదలు కాచిందంట... నీ జీవితాన్ని ఎవరో నాశనం చేయక్కర్లేదు నువ్వే చాలు అంటూ కోప్పడుతుంది రుద్రాణి. అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు మామ్ అని రాహుల్ అంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదని చెప్తాడు. ఇక చేయటానికి ఏమీ లేదు ఇప్పుడు మనం ఏం చేసినా నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం మనమే అంటారని రుద్రాణి అంటుంది.

ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అని రుజువు అయ్యేవరకు నువ్వు తనతో ఎలాంటి గొడవ పడొద్దని చెప్తుంది. తను అంత కాన్ఫిడెంట్గా డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం అంటుంది ఏం చేద్దాం మామ్ అని రాహుల్ అంటాడు. మామూలు ఆడది తనే అంత చేయగలిగినప్పుడు ఇంత సర్కిల్ ఉన్న మనం ఏమి చేయలేమా? స్వప్న చెప్పింది అబద్ధం అని అందరి ముందు నిరూపిద్దామని కొడుక్కి దైర్యం చెప్తుంది రుద్రాణి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్, కావ్య.. ఈ సమస్యపై గొడవపడుతుంటారు. కావ్య.. పోరాటం చేసి నిరూపిస్తాను అని చెప్తుంది. ఈ పోరాటం స్వప్న కోసం కాదు.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆడవాళ్లపై వేసే నింద కోసం అని చెప్తుంది. నిజమెంటో అందరి ముందు పెడుతా అంటూ శబథం చేస్తుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X