Brahmamudi July 27th: ఆ పాడు పని చేసి మీడియా ముందు స్వప్న రచ్చ.. సెలబ్రిటీల పోజులు కొడుతూ..!
బ్రహ్మముడి సీరియల్ రోజరోజుకు మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న యాడ్.. మీడియా వాళ్లకి లీక్ అవ్వడంతో.. పెద్ద రచ్చ అవుతుంది. వారి ముందుకు వచ్చి సెలబ్రెటీని అయిపోయా అంటూ పోజులు ఇస్తుంది. మరోవైపు ఇంట్లో వాళ్లు స్వప్నపై ఫైర్ అవుతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ పూర్తి వివరాల్లోకి వెళితే....
స్వప్న యాడ్ వైరల్...:స్వప్న యాడ్ చూసి రాహుల్ మెచ్చుకున్నట్టు నటిస్తాడు. ఇదొక్కటి చాలు దీన్ని ఇంట్లో నుంచి గెంటేయడానికని రుద్రాణి అనుకుంటుంది. ఈ వీడియో వైరల్ అయితే తప్పకుండా తనని ఇంట్లో నుంచి గెంటేస్తారని రాహుల్ అంటాడు. సెలెబ్రెటీ కావాలని స్వప్న అనుకుంటుంది కదా. నువ్వే ఈ వీడియో గురించి మీడియాకి చెప్పు వాళ్ళే మిగతాది చేస్తారు అని రుద్రాణి.. అనేసరికి వెంటనే రాహుల్ ఆ పనిలో పడతాడు. ఇక కనకం, కృష్ణమూర్తిని తీసుకుని స్వప్న ఇంటికి వెళ్లాలని అనుకుంటారు.

మీడియా ముందురచ్చ...:కావ్య, స్వప్నతో వరలక్ష్మి వ్రతం చేయించాలని పెద్దాయన్ని ఒప్పించమని కనకం అంటుంది. రాజ్ ఫోన్లో స్వప్న యాడ్ చూసి వెంటనే దాన్ని కావ్యకి చూపిస్తాడు. ఇంత జరుగుతుంటే మీ అక్క మొగుడు ఏం చేస్తున్నాడని రాజ్ ఆవేశంగా కిందకి వెళతాడు. ఇక ప్రెస్ వాళ్ళు ఇంటి ముందు రచ్చ రచ్చ చేస్తుంటే శుభాష్ ఆపుతాడు. రాజ్ వచ్చి ఏం కావాలని అంటే స్వప్నని ఇంటర్వ్యూ చేయాలని అంటారు. స్వప్న ఆత్రంగా బయటకి వెళ్తుంటే అపర్ణ, కావ్య ఆపుతారు. కానీ స్వప్న మాత్రం ఆగకుండా మీడియా ముందుకి వెళ్ళిపోతుంది.
ఇంట్లో వాళ్లు చూసి షాక్..:సీతారామయ్య వచ్చి ఏం జరుగుతుందని అడుగుతాడు. కళ్యాణ్ స్వప్న నటించిన యాడ్ ఇంట్లో అందరికీ చూపిస్తాడు. మీడియా వాళ్ళతో స్వప్న మాట్లాడుతుంటే కనకం వాళ్ళు వస్తారు. ఇక స్వప్న యాడ్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తారు. మోడల్ గా కనిపించాలని చిన్నప్పటి నుంచి నా కల. అవకాశం దొరికింది ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో నాకు పని లేదు అని చెబుతుంది స్వప్న. కావ్య బలవంతంగా స్వప్నని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందోనని కనకం దంపతులు కంగారుగా ఇంట్లోకి వస్తారు.

రాహుల్ పై రాజ్ ఫైర్..:ఫ్యామిలీ అంతా స్వప్న చేసిన పనికి ఫైర్ అవుతారు. రాజ్.. రాహుల్ పై అరుస్తాడు. ఇక ఇంట్లో వాళ్లు కూడా ప్రశ్నిస్తుండగా.. పరువు పోయేది ఏముంది ఒక సెలెబ్రెటీగా నన్ను పొగిడారు కదా అంటుంది స్వప్న. రుద్రాణి కోడలు ఇంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్. కడుపుతో ఉన్న కోడలు ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాల్సిన పని లేదా? అని అపర్ణ అంటుంది. మీరంతా దీన్ని వదిలేసి నా మీద పడతారని అనుకున్నా. ఆవిడ బజారులో బట్టలు తక్కువ వేసుకుని తైతక్కలాడుతుందని రుద్రాణి అంటుంది. గెంటిపారేయండి దరిద్రం వదిలిపోతుందని చెబుతుంది.

ఇంద్రాదేవి ఆగ్రహం..:స్వప్న చేసిన పనికి కావ్య కూడా సీరియస్ అవుతుంది. ఇప్పటికే నీ హక్కులు కాలరాసి వంటింటి కుందేలు చేశారు అది గుర్తు పెట్టుకో అని స్వప్న.. కావ్యకు చెబుతుంది. ఛీ నోర్ముయ్.. ఇది నా ఇల్లు అనే చేస్తున్నా అని చెబుతుంది. కావ్యని మాట అనే హక్కు నీకు లేదు. స్వేచ్చ గురించి మాట్లాడుతున్నావా? స్వేచ్చ అంటే ఏంటి ఇంటి గుట్టు వీధిన పెట్టడమా? కావ్య ఇంటి గుట్టు గడప దాటకుండా చూసుకుంటుంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లలో ఎంత వ్యత్యాసం ఉందని ఇంద్రాదేవి అంటుంది.

కనకం ఎంట్రీ...:అర్థం అయ్యింది మీరు ఇంత మందిలో నన్ను నిలబెట్టింది ఈ ఇంట్లో నాలుగు గోడల మధ్య బానిసలా బతకడానికి అనేసరికి కనకం గట్టిగా అరుస్తుంది స్వప్న. ఆవేశంగా వచ్చి లాగిపెట్టి కొట్టబోయి ఆగిపోతుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. ఎక్కడ ఉండాల్సిన దానివి ఎక్కడ ఉన్నావో మర్చిపోయావా? ఇక్కడికి ఎలా వచ్చావో మర్చిపోయావా? అంటుంది.


Click it and Unblock the Notifications











