Brahmamudi August 3rd: తప్పించుకున్న స్వప్న.. ఆఖరికి కావ్య‌ను ఇరికించేసిందిగా!

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు కూడా మరింత ఆసక్తి కలిగించింది. ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. ఇక రాజ్ ఇచ్చిన డ‌బ్బును త‌న తండ్రికి ఇవ్వాల‌ని అనుకుంటుంది కావ్య‌. ఈ విష‌యాన్ని రాజ్‌కు చెబుతుంది. అది నీ డ‌బ్బు, నీ ఇష్టం అని కావ్య‌తో అంటాడు రాజ్‌. మరోవైపు కల్యాణ్ ప్రేమలేఖ చదవాలని అనుకుంటుంది కావ్య. ఇక స్వప్న టాబ్లెట్లు వేసుకోవడం రుద్రాణి చూస్తుంది. ఇక ఈరోజు పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే....

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో క‌ల్యాణ్‌కు అజ్ఞాత అభిమాని నుంచి ఫ్ల‌వ‌ర్ పాట్‌తో పాటు ఓ లెట‌ర్ వ‌స్తుంది. ఆ లెట‌ర్‌ను ఓపెన్ చేయ‌డానికి కావ్య ప్ర‌య‌త్నిస్తుంది. కానీ క‌ళ్యాణ్ మాత్రం ఓపెన్ చేయ‌వ‌ద్ద‌ని కావ్య‌ను బ‌తిమిలాడుతాడు. అత‌డికి దొర‌క్కుండా కావ్య పారిపోతుంది. క‌ళ్యాణ్ బ‌తిమిలాడుతూ కావ్య వెంట‌ప‌డ‌తాడు. అలా కల్యాణ్.. కావ్య నుంచి లెటర్ లాక్కొని గదిలోకి వెళ్లి చదువుతాడు. అజ్ఞాత అభిమాని రాసిన‌ లెట‌ర్‌లోని అక్ష‌రాలు చూసి ప‌ర‌వ‌శించిపోతాడు క‌ళ్యాణ్‌. అందులో ఆ అమ్మాయి త‌న పేరు తెలుసుకోవ‌డానికి క్లూ ఇస్తుంది.

Swapna Escapes From deep Trouble with Kavya Help in August 3rd 2023 Episode number 163 in Brahmamudi Telugu Serial

వ‌డ్డీ డ‌బ్బుల కోసం రంగ‌మ్మ అనే మ‌హిళ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది క‌న‌కం. చిట్టి వేస్తాన‌ని, కానీ మొద‌టి నెల త‌న‌కు ఇవ్వాల‌ని కోరుకుంది. నీ బ‌తుకు గురించి నాకు తెలియ‌దా? మోసం చేసి ఇద్ద‌రు కూతుళ్ల‌కు పెళ్లి చేశావు? తిండికి నీళ్ల‌కు దిక్కులేద‌ని క‌న‌కాన్ని అవ‌మానిస్తుంది రంగ‌మ్మ‌. త‌మ‌ను అవ‌మానించిన రంగ‌మ్మ‌కు అప్పు షాక్ ఇస్తుంది. మరోవైపు క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతోన్న స్వ‌ప్న ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ ఆర్డ‌ర్ పెడుతుంది. డెలివ‌రీ బాయ్ ఇంట్లోకి వ‌స్తే తాను ప్రెగ్నెంట్ కాద‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని అనుకుంటుంది. తానే బ‌య‌ట‌కు వెళ్లి మెడిసిన్స్ తీసుకుంటుంది.

Swapna Escapes From deep Trouble with Kavya Help in August 3rd 2023 Episode number 163 in Brahmamudi Telugu Serial

డెలివ‌రీ బాయ్ నుంచి స్వ‌ప్న మెడిసిన్స్ తీసుకోవ‌డం రుద్రాణి కంట ప‌డుతుంది. స్వ‌ప్న కంగారుప‌డ‌టం రుద్రాణి గ‌మ‌నిస్తుంది. ఆమె ఏదో త‌ప్పు చేస్తుంద‌ని, అదేమిటో తెలుసుకొని స్వ‌ప్న బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్న స్వ‌ప్న వాటిని ఎవ‌రి కంట ప‌డ‌కుండా త‌న బెడ్‌రూమ్‌లో దాచేస్తుంది. కానీ చాటునుంచి రుద్రాణి ఆ సీన్ మొత్తం చూసేస్తుంది. ఇక త‌న పుట్టింటివారికి డ‌బ్బు ఇస్తున్న సంగ‌తి రాజ్‌కు చెప్పాల‌ని అనుకుంటుంది కావ్య‌. అత‌డికి థాంక్స్ చెబుతూ మెసేజ్ చేస్తుంది. ఈ డ‌బ్బును త‌న తండ్రికి ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతుంది. అది నీ డ‌బ్బు నీ ఇష్టం. ఎవ‌రికైనా ఇవ్వొచ్చు. నీ థాంక్స్ నాకు వ‌ద్దు. నేను నీకు హెల్ప్ చేయ‌లేదు. నువ్వు చేసిన ప‌నికి రెమ్యున‌రేష‌న్ ఇచ్చాన‌ని కావ్య‌కు తిరిగి మెసేజ్ పంపిస్తాడు రాజ్‌.

Swapna Escapes From deep Trouble with Kavya Help in August 3rd 2023 Episode number 163 in Brahmamudi Telugu Serial

బెడ్‌రూమ్‌లో సీక్రెట్‌గా స్వ‌ప్న దాచిన మెడిసిన్స్‌ను రుద్రాణి క‌నిపెడుతుంది. స్వ‌ప్న‌ప్రెగ్నెన్సీ పేరుతో నాట‌కం ఆడుతుంద‌ని అర్థం చేసుకుంటుంది. ఈ ట్యాబ్లెట్స్ నీ ద‌గ్గ‌ర ఎందుకున్నాయి? వాటితో నీకు ఏం ప‌ని? అని రాహుల్‌, రుద్రాణి క‌లిసి స్వ‌ప్న‌ను నిల‌దీస్తారు. వారికి ఏం స‌మాధానం చెప్పాలా అని స్వ‌ప్న ఆలోచిస్తుంటుంది. పెళ్లి కోస‌మే క‌డుపు పేరుతో నాట‌కం ఆడావా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారు. ఇది నీ ప్లానా? నీ చెల్లెలి ప్లానా? అని
కోప‌గించుకుంటారు. అప్పుడే అక్క‌డ‌కు వ‌చ్చిన కావ్య‌పై అబ‌ద్ధాన్ని నెట్టి వేస్తుంది స్వ‌ప్న.
Swapna Escapes From deep Trouble with Kavya Help in August 3rd 2023 Episode number 163 in Brahmamudi Telugu Serial

కావ్య‌ కోస‌మే ఈ ట్యాబ్లెట్స్ తెప్పించిన‌ట్లు నాట‌కం ఆడి త‌ప్పించుకుంటుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది. స్వ‌ప్న ప్రెగ్నెన్సీ నాట‌కానికి ముగింపు ప‌ల‌కాల‌ని కావ్య అనుకుంటుంది. స్వ‌ప్న ప్రెగ్నెంట్ కాద‌నే నిజం అంద‌రికి చెప్పాల‌నుకుంటుంది. కానీ స్వ‌ప్న వేసిన ఎత్తు వ‌ల్ల కావ్య‌నే దుగ్గిరాల ఫ్యామిలీ ముందు దోషిగా మారుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది రేప‌టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X