Brahmamudi November 1st: బహుబలి రేంజ్ ట్విస్ట్ బయటకు... తప్పులన్నీ కావ్యపై తోసేసిన స్వప్న

బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న ఫ్రెండుకి కాల్ చేసి... రుద్రాణి బెదిరిస్తుంది. ప్రగ్నెన్సీ లేకపోయినా ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చావ్..బయటకు వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అంటుంది. దానికి ఆమె మీకు ఏం కావాలని అని అడుగుతుంది. ఇంటికి వచ్చి అందరి ముందు స్వప్నకు కడుపులేదని చెప్పు.. అని రుద్రాణి అంటుంది. మీ గొడవల్లోకి లాగొద్దు.. నేను వద్దని చాలా సార్లు స్వప్నకు చెప్పాను అంటూ డాక్టర్ వేడుకుంటుంది. అదే వచ్చి చెప్పు... అందరి ముందు నిజం బయటపెడితే.. నీ పని నువ్వు చేసుకోవచ్చు. లేదంటే నీ విషయం బయటపెడితే.. డాక్టర్ వృత్తికే ప్రమాదం అంటూ రుద్రాణి బెదిరిస్తుంది.

మరోవైపు స్వప్నకు సీమంత ఘనంగా జరుపుతుంటారు. కనకం మురిసిపోతూ ఉంటుంది. ఇక అనామిక వెళ్తాను అని అందరికి చెప్పి వెళ్తుంది. మరోవైపు స్వప్నకు దిస్టి తీయమని ఇందిరాదేవి.. కనకానికి చెప్తుంది. ఇక అప్పుడే వచ్చిన రుద్రాణి.. ఇప్పుడే ఏం చూశారు.. రాబోయే గిఫ్ట్ చూస్తే కళ్లుతిరిగిపడిపోతారు అని అంటుంది. ఏం గిఫ్టు ఇస్తున్నారు అని రాజ్, ధాన్య లక్ష్మి అడిగితే... వెయిట్ అండ్ సీ అని అంటారు.

in November 1st 2023 Episode number 242 in Brahmamudi Telugu Serial

ఇక అప్పుడే స్వప్న ఫ్రెండు డాక్టర్ వస్తుంది. అది చూసి స్వప్న షాక్ అవుతుంది. డాక్టర్ ను నిజం చెప్పమని రుద్రాణి అంటుంది. కోడాలా కోడాలా కొడుకు పెళ్లామా.. మహారాణిలా కూర్చుంది చాలు అంటూ స్వప్నను రుద్రాణి అంటుంది. ఇక అందరి ముందు స్వప్న కడుపున పెట్టుకున్న ప్యాడ్ ను బయటకు తీస్తుంది. అది చూసి అక్కడి వారంతా షాక్ అవుతారు. అందరూ నోరెళ్ల బెడుతారు. ఇది నిజం... ఇంతకు ముందుది అబద్ధం అంటూ చెప్తుంది రుద్రాణి.

అందరూ చూడండి.. కడుపు ఉందని చెప్పి.. నన్ను, నా కొడుకుని మోసం చేసిందని అందరి ముందు స్వప్న బాగోతాన్ని రుద్రాణి బయటపెడుతుంది. ఇక కనకం ఫైర్ అవుతుంది. రాహుల్.. స్వప్నను తీసుకువచ్చి ఫైర్ అవుతాడు. నేను తండ్రి అవుతున్నాను అనే సంతోషం లేకుండా చేశావ్.. మా తాతాయ్య, అమ్మమ్మ ఆశలను కొల్లగొట్టవ్ అంటూ రాహుల్ ఆవేశపడుతాడు. ఇక అపర్ణ కూడా వాళ్ల కుటుంబమే ఇంతా అంటూ మాట్లాడుతుంది.

ఇక స్వప్నను రుద్రాణి తిడుతుంది. నా ముందే ఇంత నాటకం ఆడింది అంటూ ఫైర్ అవుతుంది. తల్లికాని తల్లి ఎప్పటికి కోడలు కాలేదు అంటూ రుద్రాణి అంటుంది. ఇక రాహుల్ కూడా నాకు ఈ భార్య వద్దే వద్దు అంటాడు. మమ్మీ బయటకు పంపిచేద్దామని అంటుంది. అప్పుడే కనకం వచ్చి... దండం పెడుతా అని అంటుంది. మధ్యలో ఎవరు రాకండి అంటూ స్వప్నను గుంజుకుపోతుంది రుద్రాణి. ఇక స్వప్న ఆలోచనలో పడుతుంది. నా తప్పు లేదని ఫ్రూవ్ చేసుకోవాలి ఎలా... అంటూ ఆలోచన చేస్తుంటుంది.

ఇక స్వప్న వదలండి అంటూ అరుస్తుంది. కావ్య అని అరుస్తుంది... ఇంత జరుగుతుంటే.. నోరువిప్పకుండా చూస్తావ్ ఏంటే అంటుంది స్వప్న. నా భర్త, నా అత్త గెంటెస్తుంటే.. చూస్తూ ఊరుకుంటావు అని కావ్యపై నింద వేస్తుంది. నీ మాట నమ్మి నేను ఇంత చేస్తే.. ఏం మాట్లాడవు అంటూ కావ్యపై నెట్టివేస్తుంది. నిజం బయటపెట్టు నీకు దండం పెడుతా అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక రాజ్ వచ్చి.. కొత్త నాటకం ఏంటి.. నీ తప్పుకు కళవతికి సంబంధం ఏంటి అంటూ అడుగుతాడు.

నేను కనకం వచ్చి కావ్యపై ఇంత పెద్ద నింద వేస్తావా అంటూ కొట్ట బోతుంది. అది ఆపి కనకం అంటూ పేరు పెట్టి పిలుస్తుంది స్వప్న. అందరూ షాక్ అవుతారు. ఇక కృష్ణ మూర్తి కూడా స్వప్న అంటూ వచ్చి మాట్లాడుతాడు. తల్లినే పేరు పెట్టి పిలిచేంతగా దిగజారిపోయావ్.. నువ్వు కచ్చితంగా తప్పు చేసే ఉంటావ్ అని కృష్ణమూర్తి అంటాడు. దీంతో ఆగవయ్య పెద్దమనిషి అని స్వప్న అంటుంది. ఇక అందరూ నోరేళ్లబెట్టి చూస్తారు. కూతుళ్లను సరిగ్గా పోషించడం చేతగాదు కానీ నువ్వు కూడా మాట్లాడుతావా అంటూ స్వప్న రెచ్చిపోతుంది.

ఇక కావ్య సలహా ఇవ్వడం వల్లే నేను తప్పు చేశాను అంటూ కావ్యపై నిందవేస్తుంది. ఇక ఇదేదో కలిసి వచ్చేలా ఉందని రుద్రాణి అనుకుంటుంది. ఇక కావ్య వచ్చి నన్ను దోషిని చేస్తావ్ ఏంటి అని అడుగుతుంది. ఇక రాజ్ కూడా కలగజేసుకుని కళవతికి తప్పు చేయాల్సిన అవసరం లేదు అని స్వప్న అంటుంది. నేను సూసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సలహా ఇచ్చిందని కావ్యపై నిందను వేస్తుంది స్వప్న.

ఇక రుద్రాణి కూడా అక్క చెళ్లెళ్లు కలిసే ఈ నాటకం ఆడుతున్నారా అంటూ రుద్రాణి అంటుంది. ఇక కృష్ణమూర్తి నా పెద్ద కూతురు స్వార్థపరురాలు.. కావ్య అలాంటిది కాదు ఎప్పటికి అబద్దం చెప్పదు.. ఎన్నటికి ఎవరిని మోసం చేయదు అంటూ బతిమిలాడుతాడు. ఇక్కడికి సీరియల్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో ఈ పిచ్చిది గెంటేసే దాకా వచ్చేసరికి తప్పు నామీదకు తోస్తుందని కావ్య ఏడుస్తుంది. కావ్య ఎందుకే అబద్ధాలు ఆడుతావ్ అంటూ స్వప్న అంటుంది. నాకు కడుపు లేదనే సంగతి నీకు లేదా అంటూ అడుగుతుంది. అమ్మ మీద ఒట్టేసి చెప్పు అంటూ స్వప్న ప్లేట్ ఫిరాయిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X