Brahmamudi June 30th Episode: స్వప్న వేసిన ప్లాన్ రివర్స్... రాజ్ తో కలిసి ఆఫీసుకు కావ్య?

రాహుల్ ను ఆఫీసులో రాజ్ తిట్టినందుకు.. రుద్రాణి ఇంట్లో పంచాయతీ పెడుతోంది. రాజ్ ఇంటికి వచ్చేసరికి అందరూ సీరియస్ గా ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా స్టార్ట్ అవుతుంది. అయితే రుద్రాణి మాటలకు కావ్య కౌంటర్ ఇస్తుంది. రాహుల్ నా కొడుకు వాడిని అందరి ముందు అవమానించేలా మాట్లాడితే అని.. రాజ్ ను రుద్రాణి ప్రశ్నించగా... తప్పు చేశాడు అందుకే మందలించానని చెప్తాడు రాజ్.

ఇదిలా ఉంటే.. రుద్రాణి మళ్లీ మధ్యలోకి కల్యాణ్ ను తీసుుకువస్తుంది. కల్యాణ్ ఏం చేస్తున్నాడు తిని తిరుగుతాడు ఏం చేస్తాడు అని అంటుంది. దానికి ప్రకాశం, ధాన్యలక్ష్మి.. రుద్రాణి మాటలకు ఫైర్ అవుతారు. నీ కొడుకు లెక్క జల్సాలు చేసాడా కల్యాణ్.. జల్సాలు చేసి రాహుల్ తిరిగిపోయాడు. రాజ్ కలగజేసుకుని.. ఇన్ని రోజులు వేరు.. ఇప్పుడు వేరు.. రాహుల్ కు ఇప్పుడు పెళ్లి అయింది.. బాధ్యతగా ఉండాలి అని అంటాడు. ఇంకా అలాగే ఉంటానని అంటే అసమర్థులకి స్వరాజ్ గ్రూపులో అడుగుపెట్టే అవకాశమే ఉండదు, తీసి పడేస్తాను.. అని చెబుతాడు. ఇంకొక విషయం కళ్యాణ్ జోలికి వెళ్తే అసలు ఊరుకోను. వాడు నాతో సమానమని రుద్రాణికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

Brahmamudi June 30th Episode

మరోవైపు ఈ ఇంట్లో కూతురిగా స్థానం ఇచ్చాను. నీ కొడుకుని వారసుడిగా చూస్తున్నా. అది నిలుపుకోలేకపోతే వాడి ఖర్మ అని సరిపెట్టుకో. అంతే కానీ ఈ ఇంటి మనవళ్లను ఎత్తి చూపిస్తే దుగ్గిరాల రక్తం ఊరుకోదు అని సీతారామయ్య చెప్తాడు. మరోవైపు స్వప్న.. రాహుల్ కు ఈ ఇంట్లో ఇంతే విలువ ఉందా అని అనుకుంటుంది. ఇప్పుడు రాహుల్ ని నిలదీసి లాభం లేదు ముందు నేను కడుపు నిజం చేసుకోవాలని స్వప్న మనసులో అనుకుంటుంది.

Brahmamudi June 30th Episode

రాజ్ రుద్రాణి మాటల గురించి ఆలోచిస్తుంటే అపర్ణ వస్తుంది. నేను కళ్యాణ్ ని ఎలా చూస్తానో రాహుల్ ని అలాగే చూస్తాను కదా మామ్ అంటాడు. కానీ రాహుల్ తప్పులు చేసి దొరికిపోయాడు. వాడు తప్పు చేశాడని వదిలేయలేదు పెడదారిన పడ్డాడని మందలించాను. అందులో తప్పేముందని రాజ్ బాధపడతాడు. నువ్వు నీలాగే ఉండమని అపర్ణ సర్ది చెప్తుంది. రేపు నీ స్థానం కోరుకోడని నమ్మకం ఏంటని అడుగుతుంది. ఇంత జరిగినా కూడా అతన్ని ఎలా దగ్గరకి రానిస్తున్నావని అంటుంది. మేము ముగ్గురం కలిసి పెరిగాము. ఒక మనిషిని అభిమానించినప్పుడు తన తప్పులు కూడా క్షమించాలని చెప్తాడు. అది విని ఒక మనిషి ఇంతగా అభిమానిస్తారా? తప్పులు చేసినా కూడా ఒప్పుకుంటారా? ఎంత మంచి వాళ్లని కావ్య మురిసిపోతుంది.

Brahmamudi June 30th Episode

స్వప్న రాహుల్ ని ట్రాప్ లో పడేసేందుకు ఏదో పొడి తీసుకొచ్చి పాలలో కలిపి తాగించాలని అనుకుంటుంది. అది తాగితే భర్త వసమవుతాడని మూలిక ఇచ్చిన అమ్మాయి చెప్పినట్టు చూపిస్తారు. రాజ్ డల్ గా ఉండటం చూసి పాలు తీసుకొద్దామని అనుకుంటుంది. కిచెన్ లో స్వప్న కూడా పాలు కలపడం కోసం వస్తుంది. కావ్య చూడకుండా పాలలో పొడి కలుపుతుండగా ఫోన్ రావడంతో స్వప్న ఆ గ్లాసు అక్కడే పెట్టి పక్కకి వెళ్తుంది. సరిగ్గా అదే టైమ్ కి కావ్య కూడా పాలు తీసుకొచ్చి ఆ గ్లాసు పక్కనే పెడుతుంది. కాసేపటికి స్వప్న వచ్చి కావ్య కలిపిన పాలు తీసుకుని వెళ్తుంది. పొడి కలిపిన పాలు కావ్య తీసుకుని పని మనిషికి ఇచ్చి పంపిస్తుంది.

Brahmamudi June 30th Episode

స్వప్న పాలు తీసుకుని రావడం చూసి ఎలాగోకలా తప్పించుకోవాలని రాహుల్ అనుకుంటాడు. రాజ్ కావ్య పంపిన పాలు తాగేస్తాడు. అటు రాహుల్ కూడా స్వప్న తెచ్చిన పాలు తాగేస్తాడు. అవి మందు కలిపినవి అనుకుని భ్రమ పడుతూ రాహుల్ తన దగ్గరకి వస్తాడని మురిసిపోతుంది. కానీ రాహుల్ మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతాడు. అటు పొడి కలిపిన పాలు తాగి రాజ్ మైకంతో గదిలోకి వచ్చేసరికి కావ్య మల్లెపూలు పెట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళాం వైపు ఓరగా చూస్తూ మీద మీదకి వెళ్లబోతు పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. మత్తు మత్తుగా మాట్లాడతాడు. తాగేసి వచ్చారా అంటే అవును అమృతం తాగానని తిక్క తిక్కగా సమాధానాలు చెప్తాడు. ఈరోజుతో ఎపిసోడ్ ముగుస్తోంది.

Brahmamudi June 30th Episode

ఇక రేపటి ప్రోమోలో.. రాజ్ ఆఫీసుకు బయలు దేరుతూ ఉంటాడు. కావ్య నేను వస్తాను అంటుంది. దానికి రాజ్ మంచి చీర కట్టుకుని రా అంటాడు. అప్పుడు కావ్య.. మంచి చీరలో అందంగా రెడీ అయి వస్తోంది. రాజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X