Brahmamudi July22nd: కావ్య మనసుకు గాయం చేసిన రాజ్.. పొట్టి డ్రెస్‌లో స్వప్న.. ధాన్యలక్ష్మికి వార్నింగ్..

బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కూడా ఆసక్తిగా సాగింది. ఇక కావ్య డిజైన్స్ వేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజ్.. ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. కావ్య పుట్టింటికి వెళ్తానని చెబుతుంది. మరోవైపు రాజ్ కావ్యను దారుణంగా హార్ట్ చేస్తాడు. ఈ రోజు పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కావ్య డిజైన్స్ వేస్తుంటే.. రాజ్ పట్టుకుంటాడు. ఎందుకు ఇలా దొంగతనంగా వేయడం..నేను కళను గుర్తించనను కున్నావా.. అని రాజ్ అంటాడు. దానకిి కావ్య మీ దృష్టిలో నేను ముగ్గులు వేయడానికి తప్ప ఎందుకు పనికి రాను కదా అని సమాధానం ఇస్తుంది. ఆరోజు ఫారిన్ నుంచి క్లయింట్స్ వస్తే.. నేను మీతో ఆఫీసుకి వచ్చి డిజైన్స్ గీసి ఇచ్చాను. ఇదేమన్న ఇంటి ముందు ముగ్గు అనుకున్నావా అని చించి పారేశారు అని కావ్య గుర్తు చేస్తుంది. అవే డిజైన్స్ ల్యాప్ టాప్ లో శృతి చూపిస్తే ఆమె వేసిందని మెచ్చుకుని నమ్మారు అని చెబుతుంది కావ్య.

Swapna Humiliates Dhanya in July 22nd 2023 Episode number 155 in Brahmamudi Telugu Serial

ఆరోజు మాత్రమే కాదు అంతకముందు ఆఫీసుకి వచ్చినప్పుడు మీరు ఆ అమ్మాయిని కొప్పడుతుంటే నేనే డిజైన్ వేసి ఇచ్చాను అని కావ్య చెబుతుంది. పెళ్ళాం వేస్తే ఇంటి ముందు ముగ్గుతో సమానం, అదే ఎంప్లాయ్ వేస్తే మాత్రం మెచ్చుకుంటారు. అందుకే కావ్య శిరీష అయ్యింది అంటూ చెప్పుకొస్తుంది. అజ్ఞాతంలో ఉండి గియాల్సి వచ్చింది. ఏదో దొంగను పట్టుకున్నట్టు నిద్ర నటించి నన్ను పట్టుకోవడం ఎందుకు. డౌట్ వస్తే నన్నే డైరెక్ట్ గా అడగవచ్చు కదా.. నేనేం నేరం చేయడం లేదు సాయం చేస్తున్నా అని చెప్తాడు.

డబ్బులు ఇచ్చి.. ఇది నీ కష్టానికి ప్రతి ఫలం. ఇది నీకు కాదు శిరీషకి కళని గుర్తించలేని మూర్ఖులు ఎవరూ లేరు అని చెబుతాడు రాజ్. ఈ డబ్బు నేను తీసుకునేది నాకోసం కాదు అని చెబుతుంది కావ్య. నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ డబ్బు నీ ఇష్టం శిరీష అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. ఇక పొద్దున్నే కావ్య కాఫీ తీసుకొచ్చి రాజ్ బెడ్ పక్కన పెట్టి ఫోన్లో అలారం పెట్టి నిద్రలేపుతుంది.

Swapna Humiliates Dhanya in July 22nd 2023 Episode number 155 in Brahmamudi Telugu Serial

నిద్రలేచిన రాజ్ అలారం ఎవరు పెట్టారని అనుకుంటాడు. రాజ్ పనులన్నీ ప్రేమగా చేస్తుంది. తనకి డ్రెస్ కి సెలెక్ట్ కూడా చేస్తుంది. పొద్దున్నే కాఫీ, బ్రష్, ఇప్పుడు డ్రెస్ ఈ కళావతిలో ఇంత మార్పా అనుకుంటాడు. కావ్య రాజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కళావతి సెలెక్ట్ చేసిన డ్రెస్ కాకుండా వేరేది వేసుకొని వచ్చేసరికి కావ్య బాధపడుతుంది.

రాజ్ ఆఫీసుకు వెళ్తుంటే.. కావ్య వచ్చి మా అమ్మ వాళ్లింటికి వెళ్తాను అని చెబుతుంది. కాసేపు వాదనలు జరుగుతాయి. కన్నవాళ్ళని చూడటానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వాలా పంపిద్దాం మామ్ అని రాజ్ అంటాడు. మీ ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మీ అత్తకి అత్తని నేను కూడా పర్మిషన్ ఇస్తున్నా వెళ్లు అని ఇంద్రా దేవి అంటుంది. వెళ్ళి రమ్మనండి వారాలు వారాలు ఉండటానికి వీల్లేదు అని అపర్ణ చెబుతుంది.

Swapna Humiliates Dhanya in July 22nd 2023 Episode number 155 in Brahmamudi Telugu Serial

స్వప్న పొట్టి డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంటే రాహుల్ చూసి షాక్ అవుతాడు. ఏంటి ఈ డ్రెస్ ఇది వేసుకుని ఇప్పుడు బయటకి వెళ్తావా అని అడిగితే.. యాడ్ షూట్ కి వేరే డ్రెస్ వేసుకుని వెళ్తారా? అని చెబుతుంది స్వప్న. స్వప్న అవాతరం చూసి ధాన్యలక్ష్మి చూసి కోపంతో ఊగిపోతుంది. ఇక ధాన్య లక్ష్మిని దారుణంగా హార్ట్ చేసి వెళ్లిపోతుంది స్వప్న. ఇదంతా రుద్రాణి వాళ్ళు చూస్తూ ఉంటారు. షూటింగ్ లో స్వప్న ఏం చేస్తే దుగ్గిరాల ఇంటి పరువు పోతుందో ఆ పని చేయమని కొడుక్కి చెప్తుంది.

ఇక మరోవైపు రాజ్ తనని పుట్టింటికి తీసుకెళ్తున్నాడని కావ్య మురిసిపోతుంది. కారు ట్రాఫిక్ లో ఆగిపోతే పూలు అమ్మే ఆమె వచ్చి రాజ్ ని చూసి మీరా పొద్దున్నే మీతో ఎందుకులే అనేసి వెళ్లిపోతుంటే తన దగ్గర పూలు తీసుకుంటాడు. భార్యే కాదన్న మనిషి పూలు కొన్నాడంటే అని పూలు అమ్మే ఆమె నవ్వుకుంటూ వెళ్తుంది. రాజ్ పూలు కావ్య చేతికి ఇస్తాడు.

వాటిని కావ్య తలలో పెట్టుకుని సంతోషపడుతుంది. కాసేపు మాట్లాడుకుంటారు టామ్ అండ్ జెర్రిలా. కావ్యను రాజ్ వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ప్రొమోలో అపర్ణ.. రాజ్ తో నీలో ఈ ప్రేమ చిగురించిందా అని అడిగితే.. కావ్యను నేను ఎప్పటికే భార్యగా ఒప్పుకోను. సాటి మనిషిగా చూస్తున్నా అని చెబుతాడు. ఈ మాటలు విన్న కావ్య బాధపడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X