Brahmamudi October 26th: కావ్యతో రాజ్ రొమాన్స్... బండారం బయటపడకుండా స్వప్న కొత్త ప్లాన్!

బ్రహ్మముడి సీరియల్ లో రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్, కావ్య ఒకే బెడ్ పై పడుకుంటారు. ఇక కావ్యను పడుకోమని చెప్పి రాజ్.. అటు తిరిగి పడుకుంటాడు. ఇక కావ్యకు నిద్ర రాకపోవడంతో... ఫోన్ తీసి పాటలు పెట్టుకుంటుంది. దాంతో రాజ్ లేచి.. ఫోన్ లో పాటలు ఆపేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో కావ్య దగ్గరగా రాజ్ రావడంతో.. కావ్య మేల్కొంటుంది. దీంతో ఒక్కసారిగా కావ్య గట్టిగా అరుస్తుంది. పాటలు ఆపేందుకు దగ్గరగా వచ్చినట్లు చెప్తాడు రాజ్. మొబైల్ సాంగ్స్ ఆపితే మీరు పాడుతారా అంటూ రాజ్‌ ను అడుగుతుంది కావ్య. ఇక పాటలు ఆపేసి పడుకుంటారు.

మరోవైపు క‌ల్యాణ్ జ్ఞాప‌కాల‌తో అప్పుకు నిద్ర‌ప‌ట్ట‌దు. క‌ల్యాణ్ ను మర్చిపోవడానికి అప్పు ఇబ్బంది పడుతుంది. ఇక అప్పడే కల్యాణ్ ఫోన్ చేసి... అనామికతో దిగిన ఫోటోల్లో మంచివి సెలెక్ట్ చేయమని చెప్తాడు. దీంతో అప్పు చిరాకు మ‌రింత ఎక్కువైపోతుంది. వాళ్ల ఫోటోస్ నేను ఎందుకు సెలెక్ట్ చేయాల‌ని అనుకుంటుంది అప్పు. ఆ ఫొటోలు చూడ‌కూడ‌ద‌ని అనుకుంటూనే చూస్తుంది. క‌ల్యాణ్‌, అనామిక ఫొటోల‌ను డిలేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్క‌డికి కృష్ణ మూర్తి వ‌స్తాడు. ఫొటోలు బాగానే ఉన్నాయి కదా... ఎందుకు డిలిట్ చేస్తున్నావ‌ని అడుగుతాడు.

Swapna is Anxious in October 26th 2023 Episode number 237 in Brahmamudi Telugu Serial

ఇక తండ్రితో అప్పు కొత్తగా మాట్లాడుతుంది. అప్పు మాటలు చూసి కృష్ణ‌మూర్తి ఆశ్చ‌ర్య‌పోతాడు. ఏమైంద‌ని అడుగినా.. అప్పు.. కల్యాణ్ గురించి దాచిపెడుతుంది. డిలిట్ చేయాల్సింది ఫోన్లో ఉన్న ఫొటోలు కాదు.... నీ మ‌న‌సులో ఉన్న క‌ల్యాణ్ ఆలోచ‌న‌ల్ని అంటూ అప్పుతో చెబుతుంది అన్న‌పూర్ణ‌మ్మ‌. స్వ‌ప్న సీమంతానికి దుగ్గిరాల ఫ్యామిలీ ముహూర్తం ఫిక్స్ చేస్తారు. సీమంతం త‌ర్వాత స్వ‌ప్న వెళ్లిపోతే తాను ఆమెను ఏం చేయ‌లేన‌ని రుద్రాణి అనుకుంటుంది. సీమంతం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని మనసులో అనుకుంటుంది.

దుగ్గిరాల ఫ్యామిలీ స్వ‌ప్న‌పై చూపిస్తున్న ప్రేమ చూసి కావ్య.. అసలు విషయం చెప్పాలనుకుంటుంది. స్వ‌ప్న సీమంతాన్ని గ్రాండ్‌గా నిర్వ‌హించే బాధ్య‌త‌ల్ని కావ్య‌కు అప్ప‌గిస్తుంది ఇందిరాదేవి. ప్రెగ్నెన్సీ పేరుతో స్వ‌ప్న ఆడుతోన్న నాట‌కానికి వెంట‌నే పుల్‌స్టాప్ పెట్టాల‌ని కావ్య అనుకుంటుంది. మీకో విష‌యం చెప్పాల‌ని ఇందిరాదేవితో అంటుంది. త‌న అబ‌ద్ధ‌పు క‌డుపును కావ్య ఎక్క‌డ బ‌య‌ట‌పెడుతుందో అని కంగారు ప‌డిన స్వ‌ప్న‌.. త‌న‌కు ఓ మంచి చీర ఇప్పుడే సెలెక్ట్ చేయాలంటూ కావ్యని అక్క‌డి నుంచి తీసుకుపోతుంది.

కావ్య‌ను రూమ్‌లోకి తీసుకెళ్లి నిజం చెప్పొద్దంటూ స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నిజం బ‌య‌ట‌ప‌డితే త‌న కాపురంతో పాటు జీవితం మొత్తం నాశ‌న‌మ‌వుతుంద‌ని, తాను ఇంటి నుంచి వెళ్లిపోవాల్సివ‌స్తుంద‌ని స్వ‌ప్న అంటుంది. స్వ‌ప్న‌ను క‌న్వీన్స్ చేయ‌డానికి కావ్య చాలా ప్ర‌య‌త్నిస్తుంది. తొమ్మిది నెల‌లు నిండిన త‌ర్వాత బిడ్డ‌ను ఎలా చూపిస్తావు అని అడుగుతుంది. తొంద‌ర‌లోనే ఈ నాట‌కాన్ని ముగించ‌బోతున్న‌ట్లు స్వ‌ప్న చెబుతుంది. సీమంతానికి పుట్టింటికి వెళ్లిన త‌ర్వాత ఏదో ఒక కార‌ణంతో అబార్ష‌న్ అయ్యింద‌ని అబ‌ద్ధం చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీని న‌మ్మిస్తాన‌ని కావ్య‌తో అంటుంది స్వ‌ప్న‌.

Swapna is Anxious in October 26th 2023 Episode number 237 in Brahmamudi Telugu Serial

మరో మోసం చేస్తావా అంటూ కావ్య స్వప్నను అడుగుతుంది. ఎంత చెప్పిన కావ్య వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో స్వ‌ప్న కాళ్ల‌బేరానికి వ‌స్తుంది. ఇక నుంచి నువ్వు చెప్పిన‌ట్లే న‌డుచుకుంటాన‌ని యాక్టింగ్ చేస్తుంది. నువ్వు ఒప్పుకోక‌పోతే చావ‌డం త‌ప్ప నాకు మ‌రో దారి లేద‌ని అంటుంది. స్వ‌ప్న సెంటిమెంట్ యాక్టింగ్‌ను కావ్య నిజ‌మ‌ని న‌మ్ముతుంది. నిజం దాచిపెడుతుంది. దీంతో ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఉద‌యం నిద్ర‌లేవ‌గానే రాజ్ ఎదురుగా కావ్య ఉంటుంది. త‌ల తుడుచుకుంటున్న కావ్య అందానికి రాజ్ మైమ‌ర‌చిపోతాడు. కావ్య‌ను కౌగిలించుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X