Brahmamudi September 27th: రాహుల్, రుద్రాణిలకు చుక్కలు చూపించిన కావ్య... కనకానికి దొరికేసిన కిడ్నాపర్
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో సర్‌ప్రైజ్ పేరుతో స్వప్నను కొత్త ప్లేస్‌కు తీసుకెళ్తాడు రాహుల్. ఇకపై ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా చూసుకుంటానని స్వప్నకు మాటిచ్చి... ఆమెకు రింగ్ గిఫ్ట్‌గా ఇవ్వబోతాడు. ఇంతలో రౌడీలు వచ్చి రాహుల్ ను కొట్టి స్వప్నను ఎత్తుకెళ్తారు.
మరోవైపు దుగ్గిరాల ఇంట్లో.. రాజ్ షర్ట్ ఐరన్ చేస్తుంటే బటన్ ఊడివస్తుంది. అది కుట్టేందుకు సూది కోసం వెళ్తుంది కావ్య. ఇంతలో వచ్చిన రాజ్ ఆ షర్ట్ వేసుకుంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత రాజ్ ఒంటిపైనే షర్ట్ ఉండగా.. దానికి బటన్ కుడుతుంది కావ్య. రాజ్ కళ్లలోకి రొమాంటిక్‍గా చూస్తుంది కావ్య.

అప్పటివరకు రాజ్, కావ్యల రొమాన్స్ చూసిన ఇందిరాదేవి సంతోషంగా వెళ్లి సీతారామయ్యకు చెబుతుంది. తర్వాత హాల్లో రాజ్ షర్ట్ బటన్ ఊడటం, కావ్య కుట్టడం గురించి ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటారు ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి. తర్వాత సుభాష్‍కు ఫోన్ కాల్ వస్తే.. వాట్ అంటూ అరుస్తాడు. ఏమైందని రాజ్ అడుగుతాడు.
రాహుల్ తలకు గాయం అయిందట అని చెబుతాడు సుభాష్. దీంతో రుద్రాణి కంగారు భయపడినట్లు నటిస్తుంది. సుభాష్, కావ్య, రాజ్ హాస్పిటల్‍కు బయలుదేరుతారు. మరోవైపు తాళ్లతో స్వప్నను కట్టి ఉంచుతారు. ఎందుకు తీసుకొచ్చార్రా అని స్వప్న అడుగుతుంది. పెళ్లి చేసుకోడానికి అని మైఖేల్ అంటాడు. రాహుల్ వచ్చి నిన్ను కొట్టి తీసుకెళ్తాడు అని స్వప్న అంటే అంతా నవ్వుతారు. ఆ రాహులే నిన్ను కిడ్నాప్ చేయించాడు అని ఓ రౌడీ నోరు జారుతాడు. దాన్ని మైఖేల్ కవర్ చేస్తాడు.
పెళ్లికి ఏర్పాట్లు కోసం మైఖేల్ వెళ్లిపోతాడు. మరోవైపు హాస్పిటల్‍లో నర్సుతో పులిహార కలుపుతుంటాడు రాహుల్. సినిమా హీరోయిన్లా ఉన్నావంటూ మాట్లాడతాడు. అప్పుడే మీ ఫ్యామిలీ వస్తుందని కంపౌండర్ చెబుతాడు. ఐసీయూలో ఉన్న రాహుల్‍ను చూసి రుద్రాణి ఎమోషనల్ అయినట్లు ప్రవర్తిస్తుంటుంది. రాజ్, సుభాష్ ఓదార్చుతారు. డాక్టర్‍తో మాట్లాడుతారు. ఎవరో రాడ్‍తో కొట్టారని చెబుతాడు డాక్టర్. స్వప్న గురించి కావ్య కంగారుపడుతుంది.

ఇంతలో నర్స్ వచ్చి రాహుల్‍కు స్పృహ వచ్చిందని చెబుతుంది. నన్ను కొట్టి స్వప్నను ఎత్తుకెళ్లారని రాహుల్ చెబుతాడు. రాహుల్ చెప్పే సమాధానాలకు కావ్యకు డౌట్ వచ్చిన వరుసగా క్వశ్చన్స్ వేస్తుంది. తర్వాతి ఎపిసోడ్‍లో పోలీసులు వచ్చి విచారిస్తారు. మొన్న విగ్రహాలు పోయాయి. ఇప్పుడు కిడ్నాప్ జరిగింది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అని పోలీసులు అంటారు. దీంతో రుద్రాణి భయపడిపోతుంది. మరోవైపు కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని మైఖేల్‍ని కనకం అడుగుతుంది. తను ఏంజెల్ చూడు అక్క అని స్వప్న ఫొటోను కనకంకి చూపిస్తాడు మైఖేల్.


Click it and Unblock the Notifications











