Brahmamudi September 26th: పెళ్లాం చేతిలో ఓడిపోయినా రాజ్.. అప్పుకు ప్రపోజ్ చేసిన కల్యాణ్.. స్వప్న కిడ్నాప్
బ్రహ్మముడి ఎపిసోడ్ గతవారం ట్విస్టులతో సాగిపోయింది. ఇక ఈ వారం కూడా అంతే ఆసక్తిగా ప్రారంభం అయింది. ఇక వినాయక విగ్రహాలను రాజ్ కాపాడుతాడు. ఇక ఇంట్లో లేట్ అయిందని అపర్ణ పంచాయితీ పెడుతుంది. ఇక రాజ్ సర్ది చెబుతాడు. ఇక రాజ్.. బొద్దింకకు భయపడుతాడు. అది చూసిన కావ్య ఆటపట్టిస్తుంది. మరోవైపు అప్పుకు కల్యాణ్ ఐ లవ్ యూ అని చెప్తాడు. ఆ వివరాల్లోకి వెళితే...
బొద్దింకను చూసి రాజ్ భయపడటాన్ని చూసి కావ్య ఆటపట్టిస్తుంది. ఇక ఆ తర్వాత తనను పదినిమిషాల పాటు ఎత్తుకోండి చూద్దా అంటుంది కావ్య. ఇక సరదాగా అన్న మాటను సీరియస్ గా తీసుకున్న రాజ్.. కావ్యను ఎత్తుకుంటాడు. కాస్త అక్కడ లవ్ ఫీల్ కలిగించేలా సాంగ్ వేస్తారు. ఇక పది నిమిషాల తర్వాత కావ్యను కిందకి దించుతాడు రాజ్. మీరు మొండివారు అనుకున్నది సాధించే వరకు వదలరు అంటుంది కావ్య. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అని చెప్పి రాజ్ పడుకుంటాడు.

ఇక కావ్య.. మనసులో రాజ్ ప్రేమను బయటకు తీసుకు వస్తానని అనుకుంటుంది. ఇక మరోవైపు అప్ప.. కల్యాణ్ మీద పీకల లోతు కోపంగా ఉంటుంది. కాల్ చేస్తే... కల్యాణ్ అనామికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పు కాల్ చేసిందని చూసి కట్ చేస్తాడు. ఇక చెప్తా వీడి సంగతి అని అప్పు అనుకుంటుంది. ఇక కావ్య.. సీతరామయ్య, ఇందిరా దేవిలకు కాఫీ తీసుకు వస్తుంది. ఇక బయట రాజ్ స్కిప్పింగ్ చేస్తూ ఉంటాడు.
అది చూసిన కావ్య ఏంటి.. చాలా రోజుల తర్వాత ఎక్సైజ్ చేస్తున్నారు అంటుంది. ఏ చేయకూడదా అంటాడు రాజ్. నువ్వు పెట్టే ఆయిల్ ఫుడ్ తిని తిని నాలుగు కేజీల బరువు పెరిగాను అంటాడు. అది కాదులే అండి... నిన్న రాత్రి నన్ను మోసినప్పుడు ఆయసపడ్డారని అంటుంది కావ్య. ఆగకుండా 100 చేశాను అని చెప్తాడు. ఇక నాతో పోటీ పడండి అంటుంది కావ్య. నీతో నాకు పోటీ ఏంటి అని రాజ్ అంటాడు. అప్పుడు సీతారామయ్య ఇందిరాదేవి కల్పించుకుని కావ్యతో పోటీకి దిగమని ప్రోత్సహిస్తారు.

ఇక రాజ్, కావ్య కలిసి స్కిప్పింగ్ చేస్తూ ఉంటారు. ఇక అది చూసిన అపర్ణ రగిలిపోతుంది. మరోవైపు రుద్రాణి కూడా జలసీ ఫీల్ అవుతుంది. ఇక ఈ ఆటలో కావ్య రాజ్ పై గెలుస్తుంది. ఇక గెలిచాను అంటూ సంతోషపడిపోతుంది కావ్య. అది చూసిన అపర్ణ చిరగ్గా ఫీల్ అవుతుంది. మరోవైపు కల్యాణ్ ను కొట్టడానికి అప్పు వస్తుంది. ఓ కర్ర తీసుకుని వచ్చి కల్యాణ్ ను చితకబాదుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఐ లవ్ యూ అంటాడు. అది విన్న అప్పు ఏంది ఏం అన్నావ్.

ఐ లవ్ యూ అని చెప్తుంది అనుకుంటే... నేరుగా పెళ్లి కార్డుతో వచ్చి పెళ్లి చేసుకుంటావా అంది అని అనామిక గురించి అప్పుకు చెప్తాడు. నేను చేసిందా తప్పా అంటే.. తప్పే అని అంటుంది అప్పు. కనీసం ఫోన్ లిప్ట్ చేశావా అని ప్రశ్నిస్తుంది. ఎప్పుడు చూసిన కాల్ వెయిటింగ్.. నిన్ను కొట్టడంలో తప్పు లేదు అంటుంది అప్పు. నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.. నేను నీతో మాట్లాడను అంటూ వెళ్లిపోతుంది. ఇక సేటు ఇంటి డబ్బుల కోసం వస్తే... కనకం ఫైర్ అవుతుంది.

మరోవైపు స్వప్న, రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావ్ రాహుల్ అంటుంది. ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టాను స్వప్న. ఇకపై నీకు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా చూసుకుంటాను అని మాటిస్తాడు రాహుల్. ఒక రింగ్ తీసుకువచ్చి ప్రపోజ్ చేస్తాడు రాహుల్. సర్ ప్రైజ్ గా ఫీల్ అుతున్నా అని చెప్తుండగా.. వెనకనుంచి స్వప్న హెడ్ కు గన్ పెడతారు. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో రాహుల్ ను కొట్టి స్వప్నను కిడ్నాప్ చేస్తారు.


Click it and Unblock the Notifications











