Brahmamudi September 8th: శోభనం గదిలో రెచ్చిపోయిన కావ్య.. భార్య కోసం నెక్లెస్ తెచ్చిన రాజ్

ఇక సీతారామయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక సీతరామయ్య ఇబ్బంది పడుతుంటే రాజ్ చూసి.. ఆసుపత్రికి వెళ్దాం అని చెబుతాడు. అంతా బాగానే ఉందని సీతారామయ్య అని చెబుతాడు. మనం బెటర్ ట్రీట్ మెంట్ కోసం వేరే చోటుకు వెళ్దాం అని చెప్తాడు రాజ్... పెంచగలరేమో కానీ.. ప్రాణం అయితే నిలపలేరు కదా అంటాడు సీతారామయ్య. సరే నా సంగతి తర్వాత చెప్తా... ముందు నీ గురించి చెప్పు? నిన్నో మాట అడుగుతాను నిజం చెప్తావా? అని అంటాడు సీతారామయ్య. దేని గురించి తాతయ్యా.. కళావతి గురించేనా? అని అంటాడు రాజ్.

లేని ప్రేమను బలవంతంగా కావ్యపై చూపిస్తున్నావ్ అని అడుగుతాడా రాజ్ ను. అదేం లేదు తాతయ్యా.. మొదట్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు కావ్యకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.. మీరు కోరుకున్నట్టే కావ్యని సంతోషంగా ఉంచుతాను.. ఆమెతో ఆనందంగా కాపురం చేస్తాను' అని అంటాడు రాజ్. 'ఆ క్షణాలు ఈమూడు నెలలలోపే వస్తాయని ఆశపడుతున్నాను' అని అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు సీతారామయ్య. మరోవైపు స్వప్నకు కనకం ఫోన్ చేస్తే కలవదు. అది మనకు చెప్పకపోయినా పర్లేదు.. కావ్యకు అయినా చెప్పి పోవాలి అని మూర్తి అంటాడు.

Swapna Missing in September 8th 2023 Episode number 196 in Brahmamudi Telugu Serial

అవకాయ పచ్చడి వేసుకుని సీతారామయ్య తింటుంటే... రాజ్ చూసి తాతయ్యా అని అరుస్తాడు. దీంతో సుభాష్.. కల్పించుకుని.. 'అమ్మా ఇన్నిరోజులూ నడిచిపోయింది కానీ.. ఇప్పుడు అలా కాదు.. నాన్న పడిపోయినప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండాలి కదా.. అని చెబుతాడు. ఇక రాజ్.. తాతయ్యని సంతోషపెట్టడం కోసం.. వడ్డిస్తున్న కావ్యని చూసి.. 'నువ్వు కూడా మాతో కూర్చుని తినొచ్చు కదా'? అని అంటాడు. ఆ మాట వినగానే రుద్రాణి, అపర్ణలు షాక్ అయిపోయి చూస్తారు. 'ఏం పర్లేదు.. నేను వడ్డిస్తాను మీరు తినండి' అని కావ్య అనడంతో.. 'వడ్డించుకోవాల్సినవి కిలోమీటర్‌లో లేవుగా.. వచ్చి కూర్చో' అని అంటాడు.

Swapna Missing in September 8th 2023 Episode number 196 in Brahmamudi Telugu Serial

కావ్య ఆలోచిస్తుండగా.. సీతారామయ్య.. మనవడు అడుగుతున్నాడు కదా.. వచ్చి కూర్చోఅని అంటాడు. దీంతో కావ్య వచ్చి.. రాజ్ పక్కన కూర్చుంటుంది. అపర్ణ.. కావ్య, రాజ్‌లను చూసి రగిలిపోతూ ఉంటుంది. అయితే రాజ్ మాత్రం.. కావ్యకి ప్రేమగా వడ్డిస్తుంటాడు. అది చూసి సీతారామయ్య సంతోషంగా పొంగిపోతాడు. ఇక కావ్య అయితే.. రాజ్ తనకి ప్రేమగా వడ్డించడంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక కావ్యకు పొలమారుతుంది. అది చూసిన రాజ్... కావ్యకి దగ్గరుండి వాటర్ తాగిస్తుంటాడు.

Swapna Missing in September 8th 2023 Episode number 196 in Brahmamudi Telugu Serial

వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉండటం చూసి.. అపర్ణ, రుద్రాణిలు రగిలిపోతూ ఉంటారు. అయితే కావ్య మాత్రం.. రాజ్ నిజంగానే తనపై ప్రేమ చూపిస్తున్నాడనుకుని తెగ సంతోషపడిపోతుంది. కావ్య తినేసి లేస్తుండగా.. ఆమె చీర చెంగు.. రాజ్ వాచ్‌కి తగులుకుంటుంది. అది చూసిన ధాన్యలక్ష్మి.. రాజ్ కావ్య చీర చెంగుని లాగాడనుకుని.. 'రాజ్ ఇది మీ బెడ్ రూం కాదు.. ఇలాంటివి ఏమైనా ఉంటే.. మీ బెడ్ రూంలో చూసుకోండి అని అంటుంది. మరోవైపు కల్యాణ్ తో ప్రేమలో తేలిపోతుంది అనామిక. ఇక ఆమె తండ్రి వచ్చి ఆమె ప్రేమకు సపోర్ట్ చేస్తాడు.

ఇందిరా దేవి పూలు తీసుకువచ్చి కావ్యకు ఇస్తుంది. నా మనవడి గురించి కూడా ఆలోచించు... రోజూ ఆలోచిస్తున్నాను అమ్మమ్మ గారూ అని కావ్య అనడంతో.. 'ఆలోచించేదానివే అయితే.. పూలు ఎందుకు అని అడిగేదానివి కాదు.. రోజూ నా మనవడితో తెప్పించుకునేదానివి' అని అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి పాల గ్లాస్‌తో వచ్చి.. ఎలాగూ కొప్పులో మల్లెపూలు పెట్టావ్.. ఈ పాల గ్లాస్ కూడా తీసుకుని వెళ్లు అని అంటుంది. కాసేపు వాళ్లు మాట్లాడుకుంటారు.

Swapna Missing in September 8th 2023 Episode number 196 in Brahmamudi Telugu Serial

ఆ తరువాత కావ్య.. పాల గ్లాస్‌తో రూంలోకి వెళ్తుంది. రాజ్ కంగారు పడిపోతాడు. రాజ్ ను మంచం మీద కూర్చొబెట్టి.. డబుల్ మీనింగ్ వచ్చేట్లు మాట్లాడుతుంది కావ్య. కాసేపు రాజ్ తో కావ్య ఆటడేసుకుంటుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తోంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కృష్ణాష్ణమి వేడుకలో కావ్య శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంది. రాజ్ కళావతి కోసం రవ్వల నెక్లెస్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తాడు. అది చూసిన అపర్ణ రగిలిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X