Brahmamudi September 29th: స్వప్నను తీసుకువచ్చిన రాజ్, కావ్య... బయటపడ్డ రుద్రాణి, రాహుల్ కుట్ర

బ్రహ్మముడి సీరియల్ ఈ వారం ఆసక్తిగా సాగుతోంది. స్వప్న కిడ్నాప్ తో కావ్య కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు కనకం పంతులు వేషంలో కిడ్నాపర్స్ దగ్గరకు వెళ్తుంది. మరి అక్కడికి వెళ్లిన కనకం... స్వప్నను చూసి ఏం చేసింది.. వారి బారినుంచి స్వప్నను విడిపించిందా... రుద్రాణి, రాహుల్ కుట్ర బయట పడిందా అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

స్వప్నను కిడ్నాప్ చేసిన మైఖేల్... ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక పంతులు, పూల దండల కోసం బయకు వస్తాడు. అక్కడ ఉన్న కనకానికి స్వప్నను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫోటోను చూపిస్తాడు. అది చూసిన కనకం కూతురు కిడ్నాప్ అయినట్లు తెలుసుకుంటుంది. ఇక కావ్యకు ఫోన్ చేసి కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఇక స్వప్నను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో కనకం... పంతులు కోసం చూస్తున్న మైఖేల్ కు పంతులు గెటప్ లో కనిపిస్తుంది.

Swapna Rescued in September 29th 2023 Episode number 214 in Brahmamudi Telugu Serial

ఇక పురోహితుడు కావాలని మైఖేల్ అడుగుతాడు. అప్పుడు కనకం మా ఆయన వేరే పూజకు పోయారు... నీ మొహానికి నేను ఎక్కువ అంటూ కాసేపు వాదించుకుంటారు. చివరకు కనకం మైఖెేల్ తో కలిసి... కారులో వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్లి మైఖేల్ తో పెళ్లి మండపం లేదు.. ముత్తాయిదులు లేరు.. ఏంటి ఇది దొంగ పెళ్లా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు. ఇక అమ్మాయిని తీసుకువస్తాడు మైఖేల్.

ఇక అయిష్టంగా స్వప్న వస్తుంది. ఇక సైగలు చేసి నేను అమ్మను అని చెప్తుంది కనకం. ఇక స్వప్న కనకాన్ని గుర్తు పట్టి.. సైలెంటుగా కూర్చుంటుంది. తన ఒక్కరి వల్ల స్వప్నను కాపాడటం కాదు అనుకుంటుంది. అక్కడి జనాల్ని చూసి.. కావ్య వాళ్లకు చెప్పాలని డిసైడ్ చేస్తుంది. కానీ ఫోన్ చేద్దాం అంటే... చిన్న ఫోన్ అని అనుకుంటుంది. ఇక స్వప్నను ఫోన్ అడిగితే.. లేదు అని చెప్తుంది.

Swapna Rescued in September 29th 2023 Episode number 214 in Brahmamudi Telugu Serial

ఇక మైఖేల్ దగ్గరే ఫోన్ తీసుకుని కావ్యకు లోకేషన్ పంపుతుంది. అంతే కాదు.. వీడియోల్ కాల్ చేసి మైఖేల్ ను స్వప్నను చూపిస్తుంది. అది చూసిన రాజ్, కావ్య షాక్ అవుతారు. ఇక వెంటనే బయలు లోకేషన్ కు బయలు దేరుతారు. తనకు మంత్రాలు రావని కనకం అనకుంటుంది. ఏదో ఒకటి మ్యానేజ్ చేయాలని ఓం క్లీం అంటూ పూజలు చేస్తుంది. క్షుద్ర పూజలు పూజలు చేస్తున్నావా అంటూ మైఖేల్ అంటాడు.

Swapna Rescued in September 29th 2023 Episode number 214 in Brahmamudi Telugu Serial

ఇది దెయ్యాల కొంపలాగా ఉంది. అందుకే వాటిని వదిలిస్తున్నా అంటుంది కనకం. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‍లో స్వప్న లేకపోతే నేను కూడా బతకను మమ్మీ అంటాడు రాహుల్. స్వప్న దూరం అయ్యాకే నాకు విలువ తెలిసింది చెప్తుండగా... దూరం కాలేదు అని స్వప్నను తీసుకొస్తాడు రాజ్. ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసింది అని రాజ్ అనడంతో రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X