Brahmamudi October 20th: రాహుల్ కోసం స్వప్న రివర్స్ డ్రామా... ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి?
అప్పును తీసుకువెళ్లాడానికి కల్యాణ్ ఇంటికి వస్తాడు. ఇక కల్యాణ్ తో రావడానికి అప్పు బయలుదేరుతుంది. కారు డోరు తీయగానే అనామిక కనిపిస్తుంది. సర్ ప్రైజ్ అంటూ అనామిక అంటుంది. మధ్యలో మనం షాపింగ్ చేద్దాం... అంటూ అనామిక చెప్తుంది. ఇక కారులో ముగ్గురు బయలుదేరుతారు. మరోవైపు కావ్య... అపర్ణకి టీ ఇస్తూ సారీ చెప్తుంది. తప్పు చేయడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు అని అపర్ణ అంటుంది. దీనికి సుభాష్.. తప్పు చేసింది నీ కొడుకు అంటూ కావ్యను సమర్థిస్తాడు. ఇక రుద్రాణి ఎంటర్ అయి.. కోడాలిని ఒక్క మాట కూడా పడనియ్యవా అంటుంది. ఇక ప్రకాశ్ కలగజేసుకుని.. రుద్రాణికి పంచులు వేస్తాడు. ఇక కాసేపు ఫన్నీగా మాట్లాడుకుంటారు.
రాజ్ మెల్లిగా కిందకి వస్తాడు. కావ్య.. రాజ్ కోసం కాఫీ పెడుతుంది. అది చూసిన సీతారామయ్య, ఇందిరాదేవి.. మనవరాలు చకచకా ఇంట్లో పనంతా చేసుకుంటూపోతుంది అని మాట్లాడుకుంటారు. ఈలోపు కావ్య రాజ్ కోసం కాఫీ తీసుకువస్తుంది. మరోవైపు వంటింట్లో పనంతా చకచకా చేస్తుంది. ఇక కనకం వచ్చి హెల్ప్ చేస్తాను అంటూ కావ్యకు చెప్తుంది. దానికి అపర్ణ అడ్డుపడుతుంది. ఇంట్లో రూల్స్ ఉన్నాయి... వాటిని మీరు బ్రేక్ చెయొద్దని చెప్తుంది. ఆమెకు బాధ్యతలు తెలియాలి అని అంటుంది.

ఇక అత్తయ్య చెప్పింది నిజమే కదా అమ్మ... నువ్వు వెళ్లి అక్కకి ఏమైనా కావాలో చూడు అని కనకాన్ని పంపిస్తుంది కావ్య. మరోవైపు మైఖేల్ బెయిల్ కోసం.. రాహుల్ లాయర్ తో మాట్లాడుతాడు. పది లక్షలు ఇప్పటికిప్పుడు ఎలా అని రాహుల్ మాట్లాడుతాడు. డబ్బులు వచ్చాకే బెయిల్ అని చెప్తాడు లాయర్. మీరు ముందు బెయిల్ అప్లోడ్ చేయండి... నేను డబ్బు రెడీ చేస్తాను అని రాహుల్ అంటాడు. ఇక మరోవైపు రాహుల్ తన గదిలోకి వచ్చేసరికి స్వప్న నగలతో ముస్తాబు అవుతూ ఉంటుంది. అది చూసిన రాహుల్.. స్వప్నను ఓ పది లక్షలు కావాలి అని అడుగుతాడు.

అది చూసి షాక్ అయిన స్వప్న.. పదివేలు అడిగిన పది నిమిషాలు ఆలోచించి ఇవ్వాలి.. అని అంటుంది స్వప్న. ఇక నగలు ఇవ్వమని అడుగుతాడు రాహుల్. అమ్మో.. తాతయ్య ఇచ్చాడు. రెండు రోజుల్లో సీమంతం ఉంది.. ఎలా ఇవ్వాలి. మళ్లీ తిరిగి తెస్తావా అంటూ స్వప్న అరుస్తుంది. కారణం చెప్పు ఇస్తాను అంటుంది. నగలన్నీ సర్దుకుని బిరువాలో పెట్టుకుంటుంది స్వప్న. రాహుల్.. దీని పర్మిషన్ తీసుకుని తీసుకోవాలా.. చెప్పకుండా తీసుకువెళ్తా అని అనుకుంటాడు. బీరువాలోని నగలను ఓ బ్యాగులో పెట్టుకుని బయలుదేరుతాడు.
మెట్లు దిగుతుంటే.. అందరూ ఇక్కడే కూర్చున్నారు అని రాహుల్ అనుకుంటాడు. రాజ్ ను చూసి రాహుల్ కంగారు పడుతాడు. ఆఫీసుకు సరిగ్గా వెళ్లడం లేదంటా... మేనజర్ కాల్ చేశాడు అని రాజ్.. రాహుల్ ను అడుగుతాడు. రేపటి నుంచి వెళ్తాను అని చెప్తాడు రాహుల్. ఇక రాహుల్ వెళ్తుంటే.. రాజ్ ఆపి చేతిలో ఏముంది అని అడుగుతాడు. ప్రకాశ్ ఎంటర్ అయి... గోల్డ్ బాక్స్ లాగా ఉంది.. ఏదో డిజైన్స్ ఏంటి అని అడుగుతాడు. ఇక ఇద్దరు లాగడంతో.. అందులోని నగలు బయటపడుతాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు.
ఇన్ని నగలు తీసుకువెళ్తున్నావ్ ఏంటి రాహుల్ అని అడుగుతాడు రాజ్. అపర్ణ.. ఇవి స్వప్న నగలు అని చెప్తుంది. ఇవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు రాజ్. కావ్య కలగజేసుకుని.. ఏముంది ఏ తాకట్టు పెట్టడానికో అయి ఉంటుంది అని చెప్తుంది. ఏంటి రాహుల్ ఇదంతా.. నువ్వు మారావు అని నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పజెప్పాను. మళ్లీ ఏ తప్పు చేయడానికి తీసుకువెళ్తున్నావ్ అని రాజ్ క్వశ్చన్ చేస్తాడు. నీ లైఫ్ ను నువ్వే నాశనం చేసుకుంటున్నావ్ అంటూ రాజ్ సిరియస్ అవుతాడు. ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు అండి అంటూ కావ్య అంటుంది. తప్పు చేస్తున్నా డబ్బు కావాలి అంటే ఇవ్వరు కదా.. అందుకే ఇలా దొంగతం చేసి దొరికిపోయాడు అంటూ కావ్య మాట్లాడుతుంది.

ఇక స్వప్న ఎంటర్ అయి... చాలు ఆపు అంటుంది. ఇక చాలు ఆపు అని చెప్తుంది స్వప్న. నా భర్తను అనే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ మాట్లాడుతుంది స్వప్న. చాటుగా తీసుకువెళ్తున్నాడా... అందరిముందు తీసుకువెళ్తున్నాడు కదా.. అని స్వప్న అంటుంది. ఇక రాహుల్ ను కాపాడేందుకు స్వప్న రివర్స్ డ్రామా ఆడుతుంది. సీమంతం ఉందని నేనే మెరుగుపెట్టమని ఆ నగలు ఇచ్చాను అని చెప్తుంది. దీంతో మళ్లీ రాహుల్ రివర్స్ డ్రామా ఆడుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను మాట్లాడనివ్వలేదని చెప్తాడు. ఇక మనదగ్గరే పెట్టించొచ్చు కదా అని అపర్ణ అంటుంది. ఇక నగలకు రేపు మనదగ్గరే పెట్టిందమని ఇందిరాదేవి చెప్తుంది. ఇక స్వప్న ఆ నగలను తీసుకుని వెళ్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో రాజ్, కావ్యకు సేవలు చేస్తూ ఉంటాడు.


Click it and Unblock the Notifications











