Brahmamudi August 4th: ఇంటిని కాపాడుకున్న కావ్య.. అపర్ణ ముందు చెల్లిని ఇరికించిన స్వప్న

బ్రహ్మ ముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే... మెడిసిన్ విషయాన్ని కావ్యపైకి నెట్టేస్తుంది స్వప్న. కడుపులేదనే విషయాన్ని ఇంట్లో చెప్పాలని వార్నింగ్ ఇచ్చి డబ్బులతో పుట్టింటికి వెళ్తుంది కావ్య. చెల్లెను ఇరికించేందుకు కావ్య ప్లాన్ చేస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే....

స్వప్న తెప్పించుకున్న మెడిసిన్ రుద్రాణి చూస్తుంది. ఈ విషయం బయటపడితే.. తనకు ఇబ్బందులు అని.. కావ్య కోసం మెడిసిన్ తెప్పించానని రుద్రాణికి చెబుతుంది. అప్పుడు రుద్రాణి.. అడగ్గా సైలెంటుగా ఉంటారు. మీ అక్కాచెల్లెల్లు ఒక్కసారి అడిగితే.. చెప్పరా అని రుద్రాణి ప్రశ్నించగా.. అవును నా కోసమే తెప్పించానని కావ్య చెబుతుంది. నన్ను అనుమానించడం ఆపండి.. భార్య ఎప్పుడూ నిజాలే చెబుతుందని రాహుల్ వైపు చూసి చెబుతుంది స్వప్న. అక్కడ నుంచి రాహుల్, రుద్రాణి వెళ్లిపోతారు.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

కొంచెం అయితే దొరికేదాన్ని అని, అలా సైలెంట్ గా నిల్చుంటావేంటని కావ్యను స్వప్న ప్రశ్నిస్తుంది. గదిలోకి స్వప్నను లాక్కొస్తుంది కావ్య. మళ్లీ నువ్ నాకు క్లాస్ పీకడం స్టార్ట్ చేయకని స్వప్న అంటుంది. టైమ్ కి వచ్చి.. హెల్ప్ చేశావ్, థాంక్స్ చెబుతానని అంటుంది. ఇంట్లో నిజం చెప్పమని కావ్య సలహా కావ్య ఇవ్వగా.. నన్ను ఇంట్లో నుంచి పంపించి.. నువ్ రాజ్యమేలుదామని అనుకుంటున్నావా అని స్వప్న అంటుంది. అలా చేయాలనుకుంటే.. ఇందాక మీ అత్తయ్య అడిగినప్పుడు నిజం చెప్పేసేదాన్ననని చెబుతుంది. నేను అమ్మవాళ్ల కోసం డబ్బులు తీసుకెళ్లి కడుతున్నా.. సాయంత్రం ఇంటికి వచ్చేలోపు నిజం చెప్పాలి. లేకపోతే నేనే చెబుతాను అని వార్నింగ్ ఇస్తుంది.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

కనకం ఇంటికి సేటు వస్తాడు. మీకు డబ్బు అర్జంట్ గా కావాలని అనుకుంటున్నారు కాబట్టి.. 22 లక్షలు ఇస్తానని చెప్పానని అంతకుముందు ఇల్లు కొనేందుకు వచ్చిన సీతారామ్ చెబుతాడు. కాగితాలు తీసి.. ఇక్కడ ఉన్న అందరూ సంతకాలు పెట్టి ఆ పదిలక్షలు తీసుకొండని సీతారామ్ అంటాడు. అందరూ బాధగా చూస్తారు. సంతకాలు చేసేందుకు రెడీ అవుతాడు మూర్తి. కనకం వైపు చూడగా ..ఆమె వద్దని అంటుంది. కానీ మూర్తి సంతకం చేసేందుకు సిద్ధమవుతాడు. అప్పుడే వస్తుంది కావ్య. ఆగండి నాన్న అంటుంది. ఏంటి నాన్న ఇది ఇల్లు అమ్ముతున్నావా అని కావ్య అడుగుతుంది. తప్పడం లేదమ్మా.. అని మూర్తి అంటాడు. అప్పు కట్టేందుకు ఇంకా ఎంత గడువు ఉందని కావ్య అడగ్గా.. ఆరు నెలలు ఉందని సేటు అంటాడు. ఆ అప్పు నేను తీరుస్తానని చెబుతుంది కావ్య. పది లక్షలు ఎక్కడ నుంచి తెస్తావ్ అని మూర్తి, కనకం అడుగుతారు. వడ్డీ 50 వేలు తీసి ఇస్తుంది కావ్య. ఈ ఇల్లు అమ్మే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేస్తుంది. పది లక్షలు తీసుకుని వెళ్లమని చెబుతుంది.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

ఎందుకు వారికి మాట ఇచ్చావ్.. డబ్బు ఎలా కడతావని ప్రశ్నిస్తాడు మూర్తి. ఆ సంగతి పక్కన పెట్టండి, నీకు ఇల్లు డబ్బుకు ప్రతిరూపంగా కనిపిస్తుందా నాన్న అంటుంది కావ్య. దీంతో మూర్తి బాధగా కావ్య వైపూ చూస్తాడు. నాకు ఈ ఇల్లు ఓ కళారూపంగా కనిపిస్తుందని, మేం ముగ్గురం ఈ ఇంటిలోనే పుట్టిపెరిగామని, నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని ఇక్కడే ఉన్నాయని వివరిస్తుంది. తిన్నా తినకపోయినా.. ఈ రంగులు, కుంచెల మధ్య అన్ని కలిసి పంచుకున్నామని అంటుంది. ఈ 50 వేలు ఎక్కడివని అప్పు అడుగుతుంది. నేను వేసిన డిజైన్స్ కు మా ఆయన ఇచ్చిన పారితోషికం ఆ డబ్బులు అని వివరిస్తుంది కావ్య. డిజైనర్ గా నేను పని చేసి, ఆ పది లక్షలు కూడా నేనే కడతానని చెబుతుంది కావ్య. నాన్న మీరేం దిగులు పడొద్దు, నేను ఉన్నానని కావ్య హామీ ఇస్తుంది. కనకాన్ని ఓదారుస్తుంది.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

మరోవైపు కావ్య ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకుంటుంది స్వప్న. నిజంగానే కావ్య నిజాన్ని బయటపెడుతుందా.. ఏం చేయాలని అనుకుంటుంది. మా అత్త నా మీద గుర్రుమంటుందని, అవకాశం దొరికితే.. నా రక్తం తాగుతుందని ఆలోచిస్తుంది. చెప్పకుండా ఉండలేను, చెబితే.. ఈ ఇంట్లో ఉండను అని అంటుంది. వడ్డీ డబ్బులు అమ్మవారి ఇంట్లో ఇచ్చే విషయంతో కావ్యను ఇరికిస్తానని అనుకుంటుంది. ఎవరి దగ్గర ఇరికించాలని ఆలోచించి, అక్కడే ఉన్న అపర్ణ దగ్గర ఇరికించాలని అనుకుంటుంది. కిందకు వచ్చి.. ఫోన్లో మాట్లాడినట్టుగా నటిస్తుంది. ఏంటమ్మా.. ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

పక్కనే ఉన్న అపర్ణ స్వప్న వైపు చూస్తుంది. నన్ను ప్రశంతంగా.. ఉండనివ్వరా.. మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే.. మా అత్తగారి ఇంట్లో నన్ను ఏమానుకుంటారు చెప్పండని నాటకాలు మాట్లాడుతుంది. ఈ ఇంట్లో వాళ్లకి తెలిస్తే.. నన్ను నిలదీస్తారని అంటుంది. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను, కావ్యను డబ్బులు అడగొద్దని, ఆ కావ్య కూడా ఆలోచించదు అని అంటుంది. ఇదంతా వింటున్న అపర్ణ సీరియస్ గా చూస్తుంది. స్వప్న మాత్రం తన నాటకాన్ని కొనసాగిస్తుంది. రాజ్ కి మాయ మాటలు చెప్పి.. డబ్బులు తీసుకుని వస్తుందని ఫోన్లో అంటుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తుందని అంటుంది. మీరు తప్పులు చేసి అత్యాశకు పోయి.. అప్పులు చేస్తారు.., ఇప్పుడు కట్టకపోతే.. మా అత్తగారి ఇంటి మీద పడితే.. ఎలా చెప్పండని స్వప్న అడుగుతుంది. ఇప్పుడు కూడా కావ్య మీ దగ్గరకు వచ్చిందట కదా.. 50 వేలు రాజ్ ను అడిగి ఒప్పించి తీసుకొచ్చిందని అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తోంది.

కావ్యకు పెద్ద గిఫ్ట్ రెడీ చేసిన స్వప్న

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

రేపు ఈ విషయం ఇంట్లో తెలిస్తే.. నన్ను కూడా నిందిస్తారని అంటుంది స్వప్న. మీరు చేసే తప్పులు మా సంసారం పాడవుతుందని చెబుతుంది. అపర్ణ అంటీ మంచిది కాబట్టి.. కావ్యను కోడలిగా అంగీకరించి.. ఉండనిస్తుందని అంటుంది. ఇదే ఆఖరిసారి అని.. ఇంకోసారి.. రాజ్ కు మాయమాటలు చెప్పి.. డబ్బులు తీసుకెళ్తే నేను ఒప్పుకోనని చెబుతుంది. వెనక్కు తిరిగి చూసినట్టుగా చేస్తుంది. అక్కడే ఉన్న అపర్ణను చూసి షాక్ అయినట్టుగా నటిస్తుంది. అంటీ మీరా.. అని అంటుంది స్వప్న. అంటే ఫోన్లో అమ్మతో మాట్లాడుతున్నానని, టాబ్లెట్స్ వేసుకోమంటే.. వేసుకోవడం లేదని అరుస్తున్నానని చెబుతుంది. అక్కడ నుంచి వెళ్తూ.. కావ్య నీ కోసం పెద్ద గిఫ్ట్ రెడీ చేసి పెట్టానని అనుకుంటుంది. నా జీవితం గురించి కాదు, ముందు నీ జీవితం గురించి ఆలోచించుకోమని ఆలోచిస్తుంది.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

కావ్య డిజైన్స్ ఓకే చెప్పిన క్లయింట్స్:ఇంకోవైపు.. డిజైన్స్ ను క్లయింట్స్ చూస్తారు. మీరు చెప్పినదానికంటే.. డిజైన్స్ బాగా వేశారని అంటారు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మీ డిజైనర్ కావ్య.. అంత కాన్ఫిడెన్స్ గా చెబుతుంటే ఏమో అనుకున్నామని, కానీ తన కాన్ఫిడెన్స్ కు కారణం తన టాలెంట్ అని ఇప్పుడు అర్థమైందని క్లయింట్ అంటాడు. ఆ కళావతికి ఎంత టాలెంట్ ఉన్నా.. దాన్ని గుర్తుపట్టింది నేను అని రాజ్ మనసులో అనుకుంటాడు. మేం ఆఫర్ చేసిన బడ్జెట్లో ఈ డిజైన్స్ ఇవ్వడమంటే.. గ్రేట్ అని క్లయింట్స్ చెబుతారు. కావ్య లాంటి ఎంప్లాయిని మీ దగ్గర పెట్టుకోవడం కూడా మీకు ప్లస్ అయిందని అంటారు. అవును అవును అని రాజ్ వెకిలి నవ్వు నవ్వుతాడు. రేపు మా ఆడిటర్ తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుందామని, మీ డిజైనర్ ను కూడా పిలవమని రాజ్ కు కంగ్రాట్స్ చెబుతారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swapnas evil move in August 4th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

తర్వాతి ఎపిసోడ్లో కావ్య ఇంటికి వస్తుంది. ఆగు అని అరుస్తుంది అపర్ణ. నువ్ ఇంతకు ముందు.. ఈ రోజు నీ పుట్టింటికి వెళ్లి డబ్బు ఇచ్చావా లేదా అని అపర్ణ అడుగుతుంది. నేను ఇచ్చే అర్హత ఉన్నదాన్ని.. వాళ్లు తీసుకునే అవసరంలో ఉన్నారని కావ్య వివరిస్తుంది. ఆఫిషియల్ గా డిజైనర్ పోస్టులో అపాయింట్ చేస్తున్నానని రాజ్ అంటాడు. నేను ఎప్పటికీ ఆ ఉద్యోగం చేయలేనని కావ్య అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X