బిగ్ బాస్‌పై మరో అనుమానం, నాగార్జున తప్పు చేశారు.. ఆ విషయాన్ని బయటపెట్టిన స్వాతి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి వారం నాగార్జున ఇస్తున్న బూస్ట్ తో కంటెస్టెంట్స్ చాలా బలంగా మారుతున్నారు. పోటాపోటీగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో ఆడియెన్స్ కి మంచి కిక్కిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఎలిమినేషన్స్ ప్రక్రియ ముగిసిన తరువాత బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం బిగ్ బాస్ షోపై ఊహించని విదంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొదటిసారి హోస్ట్ నాగార్జునపై ఇటీవల బయటకు వచ్చిన స్వాతి దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Fake Voting Says Swati Dixit
ప్రతివారం అదే అనుమానం

ప్రతివారం అదే అనుమానం

బిగ్ బాస్ ఓటింగ్ పై ప్రతి వారం కూడా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. మొదట ఎలిమినెట్ అయిన సూర్య కిరణ్ నుంచి మొన్న హౌజ్ నుంచి బయటకు వచ్చిన స్వాతి వరకు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై అనుమానాలు తెరపైకి తెస్తున్నారు. ఇది ప్రజల నిర్ణయంతో జరగడం లేదని కావాలని నచ్చకుంటేనే హౌజ్ నుంచి నిర్వాహకులే పంపేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.

ఓటింగ్ నిజాయితీగా లేదని..

ఓటింగ్ నిజాయితీగా లేదని..

కరాటే కళ్యాణి, దేవి నాగావల్లి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎక్కువగా బిగ్ బాస్ ఓటింగ్ నిజాయితీగా లేదని బయటకు వచ్చిన తరువాత చాలా మంది మీరు బయటకు రావాల్సిన కంటెస్టెంట్ కాదని అంటున్నారని చెబుతున్నారు. అయితే స్వాతి దీక్షిత్ కూడా ఓటింగ్ ని తప్పుబట్టడమే కాకుండా నాగార్జున చేసిన కామెంట్స్ పై కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున మాటలకు షాక్ అయ్యా

నాగార్జున మాటలకు షాక్ అయ్యా

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ మరుసటి వారమే ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారమే జరిగిందా? లేక కావాలని బయటకు పంపేశారా? అనే అనుమానాన్ని లేవనెత్తారు. ఆమె మాట్లాడుతూ.. హౌజ్ లో గేమ్ ఆడినవాళ్లను అలాగే ఎంటర్టైన్ చేసేవాళ్లను మాత్రమే ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుందని నాగార్జున చెప్పారు. నిజంగా ఆ విషయం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. గత సీజన్ లో ఎందుకు ఈ మాట అనలేదు.

నాగార్జున గారు తప్పుగా మాట్లాడారు

నాగార్జున గారు తప్పుగా మాట్లాడారు

నిజంగా నన్ను హౌజ్ లోకి పంపాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ వారానికి ఎలిమినెట్ చేయడం ఎందుకు?.. అసలు నేను ఏమి చేయలేదని అనడం నిజంగా దారుణం. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాగార్జున గారు ఒక విధంగా తప్పుగా మాట్లాడారు. ఏమి చేయకుంటే స్వాతిలానే ఎలిమినెట్ అవుతారని అనడం కరెక్ట్ కాదు.

ఎక్కడో ఎదో మోసం జరిగింది

ఎక్కడో ఎదో మోసం జరిగింది

ఆ మాటల్ని నేను ఎంత మాత్రం ఒప్పుకొను అంటూ నేను పడిన కష్టంలో కొంచెం గుర్తించినా హ్యాపీగా ఉండేది. కానీ 5% కూడా గుర్తించలేదు. అంతా ఎడిటింగ్ లో లేపేశారని అర్ధమయ్యింది. నా ఆట మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా ఉంది. కానీ ఎక్కడో ఎదో మోసం జరిగింది. నేను ఎలిమినెట్ అయిన రోజు కూడా పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే ఇది ఓటింగ్ ద్వారా జరిగిన ఎలిమినేషన్ కాదని నాకు అర్థమైంది.వీళ్లే ఎదో చేశారు.. అంటూ స్వాతి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X