For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాడ్బరీ పాప గా కలర్స్ స్వాతి

    By Srikanya
    |

     Swathi
    హైదరాదాబ్ :కలర్స్ స్వాతి ఇక మన టీవీల్లో వచ్చే కాడ్బరీ యాడ్ లో కనపించనుంది. కాడ్బరీ డైరీ మిల్క్ వారి కాంపైన్...శుభ్ ఆరంభ్-టు సిస్సటర్స్ లో ఆమె నటించింది. ఈ యాడ్ ని వినైల్ మాద్యూ డైరక్ట్ చేసారు. తాసీద్ హుస్సేన్ కెమెరా అందించారు. ఈ విషయమై కలర్స్ స్వాతి మాట్లాడుతూ..నేను ఎప్పుడూ మంచి బ్రాండ్ తో అశోసియేట్ అవ్వాలనుకుంటాను..నేను చేసిన ఈ కమర్షియల్ యాడ్ వర్త్ కలిగింది. కాడ్బరీ వారి లేటెస్ట్ కమర్షియల్ యాడ్ ఇది అంది. ప్రస్తుతం కలర్స్ స్వాతి బంగారు కోడి పెట్ట, స్వామి రారా చిత్రాలలో నటిస్తోంది.

    ఇక నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొందుతున్న చిత్రం 'బంగారు కోడి పెట్ట'. బోణి ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. సుమంత్,కీర్తి కర్భందాలతో చేసిన బోణి చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. మార్కెట్లో క్రేజ్ లేని నవదీప్,కలర్స్ స్వాతిలతో చేస్తున్న ఈ చిత్రం కొత్త తరహా కాన్సెప్టు తో కథే ప్రధానంశంగా రూపొందుతుందని చెప్తున్నారు.

    ఈ చిత్రాన్ని సునీత ధాటే నిర్మిస్తోంది. ఆమె తన గురు ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాటలన్నీ రాకింగ్ స్టైల్ లోనే ఉంటాయని చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని నిర్మాతలు విడుదల చేసారు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.

    అలాగే నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా 'స్వామి రా..రా..' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలవుతుంది. వరస ప్లాపుల్లో ఉన్న నిఖిల్,కలర్స్ స్వాతి ఇద్దరూ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.

    ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''మా తొలి ప్రయత్నంగా నిఖిల్‌తో 'వీడు తేడా' నిర్మించాం. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ రెండో సినిమాని కూడా ఎక్కడా రాజీ పడకుండా లావిష్‌గా తెరకెక్కించనున్నాం. కేరళ, కర్నాటక, తమిళనాడుల్లోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.. రవిబాబు, జీవా, పూజ, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్ డిఎఫ్‌టి, సంగీతం: సన్ని, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: కృష్ణచైతన్య, సహ నిర్మాత: సందీప్ కొరటాల.

    English summary
    Swathi has acted in a national commercial of Cadbury Dairy Milk’s campaign “Shubh Aarambh - Two Sisters”. It was directed by Vinil Mathew and cinematography by Tassaduq Hussain. Speaking to idlebrain.com, Swathi said that she had always wanted to associate with the right brands and working for Cadbury commercial is worth it. This is the latest Cadbury commercial on the air now. Swathi is currently working in two Telugu films titled Bangaru Kodi Petta and Swamy Raa Raa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X