చమ్మక్ చంద్రపై స్వాతి నాయుడు తీవ్ర ఆరోపణలు.. అవకాశం ఇస్తానని రూమ్‌కి తీసుకెళ్లాడంటూ!

తెలుగులో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే షో ద్వారా అనేక మంది కమెడియన్లు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. చాలామంది సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా టీవీ పరిశ్రమలో ఇంకా ఆ షో పేరు చెప్పుకొని గడిపేస్తున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర అప్పట్లో తనను ప్రేమించి మోసం చేశాడని, తనను వాడుకున్నాడు అంటూ యూట్యూబ్ నటి స్వాతి నాయుడు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మరోసారి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

లవ్ అనే పేరుతో

లవ్ అనే పేరుతో

జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్నప్పుడు చమ్మక్ చంద్ర నాకు ఆఫర్స్ ఇస్తానని అన్నాడు అని లవ్ అనే పేరుతో రకరకాలుగా వాడుకున్నాడని స్వాతి నాయుడు ఆరోపించింది. కొన్ని రోజుల తర్వాత తిరిగాడని అయితే అప్పట్లో జబర్దస్త్ లో అమ్మాయిలకు అవకాశాలు లేవు కాబట్టి నేను మా తమ్ముడికి అవకాశం ఇవ్వమని అడిగాను అని చెప్పుకొచ్చింది అప్పట్లో అబ్బాయిలు అమ్మాయి వేషం వేసుకునేవారని దీంతో అలాంటి అవకాశం ఏదైనా తన తమ్ముడుకి ఇస్తే అతని కెరీర్ కి ఉపయోగపడుతుందని తాను కోరానని ఆమె చెప్పుకొచ్చింది.

ఫోన్ నెంబర్ తీసుకున్నాడు

ఫోన్ నెంబర్ తీసుకున్నాడు

అయితే ఎన్ని రోజులైనా వాడుకుంటున్నాడు తప్ప ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని ఒక రోజు గట్టిగా అడిగితే అతను తనతో చాలా రాష్ గా మాట్లాడి ఏం చేస్తావో చేసుకో అని అన్నాడని తనను మాత్రమే కాక ఇలా అవకాశాలు ఇస్తానని అనేక మంది అమ్మాయిలను మోసం చేశాడు అని చెప్పుకొచ్చింది. ఒక రోజు తాను కుటుంబంతో కలిసి జబర్దస్త్ షూటింగ్ చూడడానికి వెళ్లాను అని అందరితో పాటు చంద్రను కూడా కలిశానని అయితే అప్పుడు తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు అని స్వాతి నాయుడు చెప్పుకొచ్చింది.

పెద్ద వెధవ అని

పెద్ద వెధవ అని


ఇక అప్పటికి తనకింకా పెళ్లి కాలేదని బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కావడంతో కాస్త డిప్రెషన్ లో ఉండగా చమ్మక్ చంద్ర దగ్గర అయ్యాడని తన కారులో కూడా తిప్పేవాడు అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కు కూడా తీసుకు వెళ్ళాడు అంటూ ఆమె కామెంట్ చేసింది. నువ్వంటే చాలా ఇష్టం అని ఆయన చెబితే నమ్మానని, మొదట్లో మా మధ్య అంత క్లోజ్ నెస్ ఏర్పడలేదని అది ఏర్పడే లోపల వాడో పెద్ద వెధవ అనే విషయం తెలిసి పోయిందని అన్నారు.

అతని వెంట పడి

అతని వెంట పడి

అతని బండారం బయటపెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లు అంటూ చాలా నడిచాయని, తనను చంపడానికి కూడా అతను ప్రయత్నించాడని ఆమె చెప్పుకొచ్చింది. పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో కూడా తను చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు అని నేనే అతని వెంట పడి ప్రేమ అంటూ ఇబ్బంది పెట్టాను అన్నట్లుగా మాట్లాడాడు అని పేర్కొంది.

ముందుకు వచ్చా

ముందుకు వచ్చా

అలా నేనే చేయాలి అనుకుంటే జబర్దస్త్ లో చాలామంది ఉన్నారు కదా అతని మీద ఎందుకు ఆరోపణలు చేశాను అనే విషయం ఆలోచించాలని ఆమె కోరింది. అలాగే మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్లు భయపడి ముందుకు రావడం లేదు నాకైతే భయం లేదు కాబట్టి నేను ముందుకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X