నిఖిల్, స్వాతి అక్కడ ప్రత్యక్షమయ్యారు.. పెళ్లయ్యాక తొలిసారి!
యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి వెండి తెరపై సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ రానా హోస్ట్ గా వ్యవహరిస్తున నెం 1 యారీ షోలో జంటగా ప్రత్యక్షమయ్యారు. రానా హోస్ట్ గా వ్యవహరిస్తున ఈ షో ప్రస్తుతం రెండవ సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ సెలెబ్రిటీలంతా ఈ షోకు గెస్ట్స్ గా హాజరవుతుండడంతో బుల్లి తెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇప్పటికే ఈ షోకు కీర్తి సురేష్, నాని, సమంత, నాగచైతన్య హాజరయ్యారు. త్వరలో నిఖిల్, స్వాతి పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుంది.

కొన్ని నెలల క్రితమే
స్వాతికి ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గాయి. ఇటీవలే స్వాతి రెడ్డి తన ప్రియుడిని వివాహం చేసుకుంది. వివాహం జరిగాక తొలిసారి స్వాతి ఆడియన్స్ ముందుకు వచ్చింది. నెం 1 యారి షోలో స్వాతి భర్త గురించి అడుగుతూ.. నీ భర్తలో నీకు నచ్చని మూడు గుణాలు ఇతని అడగగా.. మరీ మంచోడు అంటూ క్యూట్ గా సమాధానం ఇచ్చింది. నిఖిల్ కూడా రావడంతో షో చాలా సందడిగా మారింది.

నిఖిల్ ఇప్పుడు ఎంతమందితో
రానా నిఖిల్ ని అడుగుతూ.. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నావు అని ప్రశ్నించాడు. దీనికి స్వాతి ఆశ్చర్యంగా స్పందించింది. అంటే ఒకరికంటే ఎక్కువమందిని కూడా మైంటైన్ చేస్తారా అని అడగడంతో రానా, నిఖిల్ పగలబడి నవ్వేశారు. నిఖిల్, స్వాతి అల్లరి చేష్టలతో షో చాలా సరదాగా గడచినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ని ప్రసారం చేయనున్నారు.
సూపర్ హిట్ జోడి
నిఖిల్, స్వాతి వెండి తెరపై సూపర్ హిట్ జోడి. స్వామిరారా, కార్తికేయ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. నిఖిల్, స్వాతి కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్వాతి చివరగా నటించిన చిత్రం లండన్ బాబులు. ప్రస్తుతం స్వాతి ఎలాంటి చిత్రంలోనూ నటించడం లేదు. స్వాతి భర్త పైలెట్ గా పనిచేస్తున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.

విభిన్న చిత్రాలతో
ఇక హీరో నిఖిల్ వరుసగా విభిన్న చిత్రాలు చేస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ముద్ర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











