బిగ్ బాస్ అసలు గుట్టు బయటపెట్టిన శ్వేతా రెడ్డి.. 40 మంది అమ్మాయిలతో

Recommended Video

Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Reveals Dark Side Of Bigg Boss Telugu || Filmibeat Telugu

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారు బిగ్ బాస్ యాజమాన్యంపై లైంగిక ఆరోపణలు గుప్పించడం, బిగ్ బాస్ షో నిషేధించాలంటూ పోలీస్ స్టేషన్, కోర్టులో ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొందరు మాత్రం బిగ్ బాస్ పేరు చెప్పుకొని, వివాదాలు సృష్టిస్తూ ఫేమస్ కావాలని శ్వేతా రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న సిల్లీ వ్యవహారం ఇది అని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయమై శ్వేతా రెడ్డి మరోసారి నోరు విప్పి బిగ్ బాస్ అసలు గుట్టు బయటపెట్టింది. వివరాల్లోకి పోతే..

కొన్ని రోజులుగా బిగ్ బాస్ పై ఆరోపణలు

కొన్ని రోజులుగా బిగ్ బాస్ పై ఆరోపణలు

శ్వేతా రెడ్డి గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ పై ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. పలు డిబేట్స్ లో పాల్గొంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై విరుచుకు పడుతోంది. తనను బిగ్ బాస్ లోకి తీసుకున్నామని చెప్పి సంతకాలు కూడా అయ్యాక.. బాస్ ని తృప్తి పరచాలంటే మీరు ఏం చేస్తారు? ఎలా తృప్తి పరుస్తారు? లాంటి ప్రశ్నలు వేశారని శ్వేతా రెడ్డి చెప్పింది. ఈ మేరకు బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారా? అని ప్రశ్నించింది శ్వేతా రెడ్డి.

నేనొక్కదాన్నే కాదు.. 40 మంది అమ్మాయిలతో!

నేనొక్కదాన్నే కాదు.. 40 మంది అమ్మాయిలతో!

బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్న శ్వేతా రెడ్డి తాజాగా మరో బాంబ్ పేల్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు బిగ్ ట్రాప్ అనేదే ఓ ట్రాప్ అని, నేనొక్కదాన్నే కాదు.. ఈ ట్రాప్‌లో నా లాంటి అమ్మాయిలు 40 మందికి పైగానే ఉన్నారంటూ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది శ్వేతారెడ్డి. తాను ఫేం కావడానికి ఇలా మాట్లాడటం లేదని, అది నిజమని శ్వేతా పేర్కొంది.

అందుకే నన్నలా చూస్తున్నారు

అందుకే నన్నలా చూస్తున్నారు

తప్పు జరిగితే తాను అస్సలు సహించనని, చొక్కా పట్టుకొని నిలదీస్తానని అంటోంది శ్వేతా రెడ్డి. అందుకే తాను ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోవలసి వస్తోందని చెప్పింది. ఆ రకంగా తనపై వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేశారని అంటోంది శ్వేతారెడ్డి. కొందరైతే నీకు ఏ అర్హత ఉందని బిగ్ బాస్ వాళ్ళు సంప్రదించారని అడుగుతున్నారని, అంటే బిగ్ బాస్ కి వెళ్లాలంటే కేవలం సెలెబ్రిటీలకే అవకాశమా? అని ప్రశ్నించింది శ్వేతా.

అందుకే ఆ సమయంలో డౌట్ రాలేదు

అందుకే ఆ సమయంలో డౌట్ రాలేదు

మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా! బిగ్ బాస్ అగ్రిమెంట్ పేపర్స్ మీకు జిరాక్స్ ఇవ్వలేదా? అదే విధంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు రికార్డ్ చేయలేదా? అని కూడా అడుగుతున్నారు. దానికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. అగ్రిమెంట్ జిరాక్స్ కాపీలు తరువాత ఇస్తాం అన్నారు, ఫోన్ కాల్స్ రికార్డ్ చేయాలనే ఆలోచన నాకు అస్సలు రాలేదు. ఎందుకంటే ఇంతకు ముందు
నేను పనిచేసిన సంస్థ 'మా' నే.. అందుకే ఎలాంటి డౌట్ రాలేదు. అని తెలిపింది శ్వేతారెడ్డి.

సపోర్ట్ పెరుగుతోంది.. చూడాలి మరి

సపోర్ట్ పెరుగుతోంది.. చూడాలి మరి

బిగ్ బాస్ నిర్వాహకులపై శ్వేతా రెడ్డి చేసిన ఆరోపణలపై గాయత్రి గుప్తా, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లాంటి ఎవరి సపోర్ట్ లభిస్తోంది. వీళ్లంతా హైకోర్టు దాకా వెళ్లారు కాబట్టి ఈ షో గురించిన మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయా? లేక వీరి ఆరోపణలు బుల్లితెర ఆడియన్స్ మదిలో సందేహాలుగానే మిగిలిపోతాయా? అనేది చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X