For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్ బాస్ తెలుగు 3: అగ్రిమెంట్ తర్వాత శ్వేతా రెడ్డికి షాకింగ్ అనుభవం, కమిట్మెంటా?

|
Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Reveals Unknown Facts on Bigg Boss || Filmibeat Telugu

నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3పై జర్నలిస్ట్, యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ సెలక్షన్ తేడాగా ఉందని తెలిపారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ నెలలో బిగ్ బాస్ షో నిర్వాహకులు తనకు ఫోన్ చేసి తమ రియాల్టీ షోకు సెలక్ట్ చేశాం, కలవాలి మేడం అంటూ స్టార్ మా నుంచి రవికాంత్ అనే కో ఆర్టినేటర్ ఫోన్ చేశారని, నా ఆఫీసుకు వచ్చి కలిసిన తర్వాత ఈ షో చేయడానికి నేను సిద్ధమే అని చెప్పిన తర్వాత... ఊహించని, షాకింగ్ పరిణామాలు ఎదురయ్యాయని శ్వేతా రెడ్డి తెలిపారు.

అగ్రిమెంటు మీద సైన్ చేయాలన్నారు

సెలక్షన్లో భాగంగా ఫ్రీక్వెంట్‌గా మీటింగులు ఉంటాయని చెప్పారు. రెండు మూడు సిట్టింగ్స్ అయ్యాయి. ఆ సమయంలో ముంబై నుంచి లాంగ్వేజ్ హెడ్ ఫోన్ చేసినపుడు నన్ను ఎందుకు సెలక్ట్ చేశారు అని అడిగాను. మీరు ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ట్రెడింగ్ స్టార్. మా సర్వేల్లో మీ పేరు బాగా వినిపించింది, అందుకే సెలక్ట్ చేశామని తెలిపారు. సెలక్షన్లో భాగంగా అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుందని చెప్పారని... శ్వేతా రెడ్డి వెల్లడించారు.

నేను ఫైనల్ అయ్యాననే అనుకున్నా

శ్రీనగర్ కాలనీలోని మింట్ లీఫ్ రెస్టారెంటులో జరిగిన మీటింగులో బాండ్ పేపర్ మీద నాతో సంతకాలు చేయించుకున్నారు. 10 నుంచి 15 పేజీలు ఉన్నాయి. స్టార్ మా నుంచి రఘు అనే వ్యక్తితో పాటు హెచ్ ఆర్ డిపార్టుమెంట్ నుంచి మరొకరు వచ్చారు. నాకు వేరే ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉండటంతో పైపైన చదివేసి సంతకం పెట్టాను. నాకు కాపీ ఇవ్వాలని అడిగితే వారం తర్వాత పంపిస్తామన్నారు. ఇంత పెద్ద సంస్థలో చీటింగ్స్ ఉంటాయని, ట్రిక్స్ ప్లే చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయం. అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కాబట్టి నేను పైనల్ అయ్యాననే అనుకున్నాను.

ఆయన అలా అనడంతో ఆశ్చర్యపోయాను

అగ్రిమెంట్ తర్వాత మరో మీటింగులో శ్యాం అనే మరో కో-ఆర్డినేటర్ ఎంటరయ్యారు. అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి గేమ్‌కు సంబంధించిన విషయాలు చెబుతారని అనుకున్నా. కానీ ఆయన మీటింగ్ మొదలు పెట్టడమే మిమ్మల్ని మేము ఎందుకు తీసుకోవాలి అని అడిగారు. ఆయన అలా అనడంతో ఆశ్చర్యపోయాను. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోవాలని నేను ఎవరినీ అడగలేదు. మీరే నాకు ఫోన్ చేశారు. నా ఆఫీసుకు వచ్చి కలిసి మీటింగులకు రమ్మని చెప్పారు.. ఇప్పుడు ఇలా అడుగుతున్నారేంటి? అని ఎదురు ప్రశ్నించినట్లు... శ్వేతా రెడ్డి తెలిపారు.

మా బాస్‌ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు అని అడిగారు

మిమ్మల్ని తీసుకుంటే మాకేం లాభం అని అడిగారు. బిగ్ బాస్ షో హిట్ అవ్వాలంటే మీరు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఎలాంటి యాక్టివిటీ ప్లే చేస్తారు అని శ్యాం అనే వ్యక్తి అడిగారు. ఇది రియాల్టీ షో, భిన్నమైన మనస్తత్వం గల వారిని అందులోకి ప్రవేశ పెడతారు. అక్కడ ఇచ్చే టాస్కులను బట్టి మేము గేమ్ ఆడాల్సి ఉంటుంది. అంతే కానీ ముందుగానే ఎం చేస్తారు? అనేది రెడిక్యులస్ క్వశ్చన్ అని నేను మొహం మీదే చెప్పేశాను. దానికి ఆయన స్పందిస్తూ... అలా కాదండీ, మా బాస్‌ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు అన్నారు.

మీ బాస్‌ను నేనుందుకు ఇంప్రెస్ చేయాలి? కమిట్మెంట్ అడుగుతున్నారా?

మీ బాస్‌ను నేనెందుకు ఇంప్రెస్ చేయాలి? మీరు అలా అడగటంలో అర్థం ఏమిటి? మీరు నా నుంచి ఎలాంటి థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ బాస్‌ను సాటిస్పై చేయడం అంటే అర్థం ఏమిటి? కమిట్మెంట్ అడుగుతున్నారా? ఒక జర్నలిస్టుగా నేను ఎంతో మందిని సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాను. కమిట్మెంట్, కాస్టింగ్ కౌచ్ మీద డజన్ల కొద్దీ ఇంటర్వ్యూలు చేశాను.... అంటూ వారు అలాంటి ప్రశ్న అడిగిన తీరును శ్వేతా రెడ్డి తప్పుబట్టారు.

అప్పటి నుంచి నా కాల్స్ అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు

మీ బాస్‌ను ఇంప్రెస్ చేయడం అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి. శ్వేతారెడ్డి యూట్యూబ్ ట్రెడింగ్ స్టార్ అని చెప్పి మీరే నన్ను అప్రోచ్ అయ్యారు. మీరు డిసైడ్ అయిన తర్వాత మిమ్మల్ని మేము ఎందుకు తీసుకోవాలి, ఎందుకు సెలక్ట్ చేయాలి, ఎలా ఇంప్రెస్ చేస్తారు అని అడగటం మీనింగ్ లెస్. ‘హౌ విల్ యూ సాటస్పై మై బాస్' అని మీరు నన్ను అలా అడగటం వెనక అసుల కారణం ఏమిటి? అని ప్రశ్నించిన తర్వాత వారు నా కాల్స్ అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు... అని శ్వేతా రెడ్డి తెలిపారు.

English summary
Swetha Reddy Sensational Comments on Big Boss 3 Telugu Show. Bigg Boss has been making quite some buzz since a while now. The third season of the reality show will be launched soon, and it is already making headlines. Nagarjuna Akkineni was officially announced as the host of the show.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more