బిగ్ బాస్ 3 బ్యాన్ చేయాలి.. శ్రీ రెడ్డి విషయంలో వేసిన కమిటీ ఎక్కడ పోయింది.. శ్వేతారెడ్డి సంచలనం

Recommended Video

Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Reveals The Dark Side Of Bigg Boss Telugu 3

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ షోపై వివాదం రాజుకుంటోంది. గత రెండు బిగ్ బాస్ సీజన్లు భారీ సక్సెస్ కావడంతో మూడో సీజన్ పై ఆసక్తిగా ఉన్నారు బుల్లితెర ఆడియన్స్. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండటం, పార్టిసిపెంట్స్‌గా పలువురు ఫేమస్ వ్యక్తుల పేర్లు బయటకు వస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. సరిగ్గా ఈ తరణంలో యాంకర్‌, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి బిగ్ బాస్ పై విరుచుకు పడుతూ, బిగ్ బాస్ బాగోతం బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. నిన్న (గురువారం) హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్వేతారెడ్డి సంచలన విషయాలను బయటపెట్టి బిగ్ బాస్ నిర్వాహకులపై ఓ రేంజ్‌లో మండిపడింది. వివారాల్లోకి పోతే..

బిగ్ బాస్ ముసుగులో జరిగేదంతా అదే..

బిగ్ బాస్ ముసుగులో జరిగేదంతా అదే..

బిగ్ బాస్ పేరుతో ఆ షో యాజమాన్యం మహిళలను లొంగదీసుకుంటోందని శ్వేతారెడ్డి ఆరోపణలు చేసింది. ఈ షో పేరిట ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని చూస్తున్నారని, అలా చేస్తే ఉరుకునేదే లేదని ఫైర్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని చెబుతూ తన ఎంపికకు సంబంధించి ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది శ్వేతారెడ్డి.

మీరు పాపులర్ యాంకర్ అంటూ

మీరు పాపులర్ యాంకర్ అంటూ

బిగ్ బాస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.. మీరు మీరు పాపులర్ యాంకర్ ఈ షో కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేశామని బిగ్ బాస్ నిర్వాహకులు తనకు కాల్ చేశారని తెలిపింది శ్వేతారెడ్డి. ఈ మేరకు రవికాంత్‌ అనే బిగ్ బాస్ నిర్వాహకుడు ఒకరు తనకు చాలా సార్లు ఫోన్ చేసి మీటింగు పెట్టాడని, అయితే ఈ మీటింగుల్లో తన వెంట వచ్చిన వాళ్ళను లోపలి రానీయకుండా తనతో మాత్రమే మాట్లాడే వాడని చెప్పింది శ్వేతారెడ్డి. మొత్తానికి కాగితాలపై సంతకాలు తీసుకొని ఇక వారి వారి పిచ్చి వేషాలు బయటపెట్టారని శ్వేతారెడ్డి పేర్కొంది.

మా బాస్‌ని ఎలా ఇంప్రెస్‌ చేస్తారు?

మా బాస్‌ని ఎలా ఇంప్రెస్‌ చేస్తారు?

మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నాము.. మరి మా బాస్‌ని ఎలా ఇంప్రెస్‌ చేస్తారు? అని బిగ్ బాస్ ప్రొడ్యూసర్ శ్యామ్ అడిగాడని చెప్పింది. నేనెందుకు ఇంప్రెస్‌ చెయ్యాలి అని నిలదీయడంతో కమిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ శ్వేతారెడ్డి మండిపడింది. బిగ్ బాస్ పేరిట ఓ బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్వేతారెడ్డి.

చాలా మందితో కమిట్‌మెంట్.. జిమ్మిక్కులు చేస్తున్నారు

చాలా మందితో కమిట్‌మెంట్.. జిమ్మిక్కులు చేస్తున్నారు

బిగ్ బాస్ నిర్వాహకుల బాగోతాలు చాలా ఉన్నాయని, గతంలో చాలా మందితో ఇలాగే కమిట్‌మెంట్ తీసుకున్నారని ఆరోపించింది శ్వేతారెడ్డి. ఆ వివారాలన్నీ తాను సేకరించానని, వాళ్లంతా త్వరలోనే బయటకు వస్తారని పేర్కొంది. తన ఆరోపణలు విని ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులైన రఘు, రవికాంత్‌, శ్యామ్‌ ఫోన్ విచ్ ఆఫ్ చేసుకున్నారని, నేను సంతకం చేసిన డాకుమెంట్లు ఇవ్వకుండా జిమ్మిక్కులు చేస్తున్నారని చెప్పింది శ్వేతారెడ్డి.

బిగ్ బాస్ 3ని బ్యాన్ చేయాలి

బిగ్ బాస్ 3ని బ్యాన్ చేయాలి

బిగ్ బాస్ పేరిట చాలా మోసం జరుగుతుందని ఆరోపించిన శ్వేతారెడ్డి బిగ్ బాస్ 3 ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. తన పోరాటం ఇంతటితో ఆగదని, తన డాకుమెంట్స్ న్యాయం కోసం పోరాడతానని తేల్చి చెప్పింది. ఈ సందర్బంగా శ్రీరెడ్డి చేసిన పోరాటం కారణంగా వేసిన కమిటీ ఎక్కడ పోయిందని ప్రశ్నించింది శ్వేతారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X