శ్రీరెడ్డిని కూడా అడిగారు.. బిగ్ బాస్ కాదు.. బ్లూ ఫిల్మ్స్ చేసుకోండి: శ్వేతా రెడ్డి

Recommended Video

Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Sensational Comments On Bigg Boss Telugu

శ్వేతా రెడ్డి.. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరిది. కొద్ది రోజులుగా ఈమె పేరు టీవీ చానెళ్లలో మారుమ్రోగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తాననడం.. బాలయ్యను ఓడిస్తానని సవాల్ చేయడం.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలు చేయడం వంటి వాటితో ఆమె టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్ అయిపోయింది. తాజాగా తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'పైనా అదే తరహాలో విమర్శలు చేస్తోంది. దీంతో శ్వేతా రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

బ్లూ ఫిల్మ్స్ చేసుకోండి

బ్లూ ఫిల్మ్స్ చేసుకోండి

రియాలిటీ షో మాటున ‘బిగ్ బాస్' నిర్వాహకులు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారన్న శ్వేతా రెడ్డి.. ఇదే డిబెట్‌లో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘శ్రీరెడ్డిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగారు. గాయత్రిని అడగకూడనివి అడిగారు. అందుకే నేను అంటున్నా.. మీరు ‘బిగ్ బాస్' షో ముసుగులో అవేవో చేసే బదులు.. బ్లూ ఫిల్స్మ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోండి. ఎక్కువ రేటింగులతో పాటు డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి'' అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

 బాస్‌ను సంతృప్తి పరచాలంటే బట్టలిప్పాలా.?

బాస్‌ను సంతృప్తి పరచాలంటే బట్టలిప్పాలా.?

‘బిగ్ బాస్' షోకు తనను తీసుకున్నామని చెప్పిన కొందరు వ్యక్తులు తనకు పదే పదే ఫోన్లు చేసేవారని శ్వేతారెడ్డి చెప్పింది. అంతేకాదు, ‘‘మిమ్మల్ని షోకు సెలెక్ట్ చేశాము.. మరి మీరు మా బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారు అని నన్ను ఓ వ్యక్తి అడిగాడు. అంటే.. వాళ్ల బాస్‌ను ఇంప్రెస్ చేయాలంటే నేను బట్టలిప్పాలా..? న్యూడ్‌గా ఆయన ముందుకు వెళ్లాలా..?'' అంటూ శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘బిగ్ బాస్'పై ఆరోపణలు

‘బిగ్ బాస్'పై ఆరోపణలు

మీరు తెలుగు రాష్ట్రాల్లోనే పాపులర్ యాంకర్ అంటూ ‘బిగ్ బాస్' నిర్వహకులు తనను అప్రోచ్ అయ్యారని చెప్పిన శ్వేతారెడ్డి.. ఈ షో కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేశామని బిగ్ బాస్ నిర్వాహకులు తనకు కాల్ చేశారని తెలిపింది. ఈ మేరకు రవికాంత్‌ అనే బిగ్ బాస్ నిర్వాహకుడు ఒకరు తనకు చాలా సార్లు ఫోన్ చేసి మీటింగు పెట్టాడని, అయితే ఈ మీటింగుల్లో తన వెంట వచ్చిన వాళ్ళను లోపలి రానీయకుండా తనతో మాత్రమే మాట్లాడే వాడని చెప్పింది శ్వేతారెడ్డి. మొత్తానికి కాగితాలపై సంతకాలు తీసుకొని ఇక వారి వారి పిచ్చి వేషాలు బయటపెట్టారని శ్వేతారెడ్డి పేర్కొంది.

ఈ షోను నిషేదించాలి

ఈ షోను నిషేదించాలి

‘బిగ్ బాస్' సీజన్ - 3ని నిషేదించాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేస్తోంది. రియాలిటీ షో పేరిట చాలా మోసం జరుగుతుందని ఆరోపించింది. తన పోరాటం ఇంతటితో ఆగదని, తన డాకుమెంట్స్ న్యాయం కోసం పోరాడతానని తేల్చి చెప్పింది. తనలాగే చాలా మందితో ఈ షో నిర్వహకులు ఆడుకుంటున్నారని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X