వదిన పంపిన ఫుడ్‌ను ఎవరెవరూ తిన్నామంటే.. చిరంజీవి సతీమణి సురేఖ పంపిన బిర్యాని గురించి సోహెల్!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4లో మూడో స్థానంలో నిలిచిన సయ్యద్ సోహెల్ ర్యాన్ ఆనందంలో మునిగిపోయాడు. తన అభిమానులు, సన్నిహితులతో కలిసి ఊరేగింపుగా ఇంటికి చేరుకొన్నారు. ఈ సందర్బంగా సోహెల్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. మీడియాకు సోహెల్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

సోహెల్‌తోపాటు మెహబూబ్, అలీ రెజా
బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సయ్యద్ సోహెల్ ర్యాన్ తన మద్దతుదారులతో భారీ ఊరేగింపుగా ఇంటికి చేరుకొన్నారు. సోహెల్‌తో అలీ రెజా, మెహబూబ్ దిల్ సే, రామారావు తదితరులు ఉన్నారు. తనను అభిమానించే వారిని అభిమానులుగా కాకుండా స్నేహితులుగానే చూస్తాను అని సోహెల్ చెప్పారు.

బిర్యానిని నాతోపాటు
తనకు మటన్, చికెన్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికి తెలుసు. నా ఇష్టాన్ని, కష్టాన్ని గ్రహించిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గారు మాకు బిర్యాని వండి పంపించారు. ఆ బిర్యానిని నేను ఇంటి నుంచి బయటకు రాగానే తిన్నాను. అలీ రెజా, మెహబూబ్, ఇతర ఇంటి సభ్యులు, యూనిట్ సభ్యులు తిన్నారు అని సోహెల్ చెప్పారు.

చిరంజీవి గొప్పతనానికి నిదర్శనం
కథ వేరే ఉంటుందనే డైలాగ్ చిరంజీవికి నచ్చడం చాలా సంతోషం. ఆ డైలాగ్‌ను తన సినిమాలో పెట్టుకొంటానని అడగడం, అనుమతి కావడం ఆయన పెద్ద మనసుకు, ఆయన గొప్పతనానికి నిదర్శనం. అలాగే నా సినిమాకు చిరంజీవి సపోర్ట్ చెబుతానని అనడం నా జీవితంలో మరిచిపోలేని విషయం అని సోహెల్ చెప్పారు.

అభిజిత్ కూల్.. గేమ్ అలా ఆడారంటూ
అభిజిత్ చాలా కూల్. తన గేమ్ తాను ఆడారు. నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. యాక్సిడెంట్ కారణంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఫిజికల్ టాస్కులు ఆడలేదు. విజేతగా నిలిచిన ఆయనకు నాకు శుభాకాంక్షలు. నాతో ఇంటిలో సమానంగా ఉన్నారు. నాకు బాగా కనెక్ట్ అయ్యాడు అని సోహెల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











