Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నేను హౌలాగాడినా? మోనాల్ కోసం కత్తులు దూసుకొన్న సోహెల్, అఖిల్
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 13వ వారం నామినేషన్ ప్రక్రియ తర్వాత హౌజ్‌లో ఇంటి సభ్యుల మధ్య వాతావరణం గంభీరంగా మారింది. తనను నామినేట్ చేయడంపై మోనాల్‌పై అఖిల్ భగ్గుమన్నాడు. ఈ సందర్భంగా జోక్యం చేసుకొన్న సోహెల్‌పై ధ్వజమెత్తడంతో ఇళ్లంతా గందరగోళంగా మారింది. 86వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..
మోనాల్ గజ్జర్ తీవ్ర మనస్తాపం
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో మోనాల్ తీవ్ర మనస్తాపానికి గురైంది. హారికతో తన బాధను చెప్పుకొని తీవ్రంగా కలత చెందింది. ఈ పరిస్థితిలో అఖిల్ తీవ్ర ఆందోళనకు గురై కంట తడి పెట్టుకొన్నాడు. తాను ఇష్టపడిన వారే నన్ను అర్ధం చేసుకోవడం లేదనే విధంగా మనస్తాపానికి గురయ్యాడు.
మోనాల్, అఖిల్ మధ్య సోహెల్ సయోధ్య
అయితే మోనాల్, అఖిల్ పరిస్థితి చూసి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సోహెల్ ప్రయత్నించాడు. కూర్చోని మాట్లాడుకొందామని సూచిస్తే తనకు ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. అయితే నేను చెప్పేది వినవా అంటూ సోహెల్ అంటే.. మధ్యలో నీవు రాకు అంటూ అఖిల్ మండిపడ్డాడు.
నన్ను అంత మాట అంటుందా?
నామినేషన్ ప్రక్రియలో మైండ్‌తో ఆడుతున్నావని మోనాల్ కామెంట్ చేసింది. ఆమె మాత్రం హార్ట్‌తో ఆడుతున్నట్టు చెప్పాడు. అంటే ఇంకా ఆమెతో మాట్లాడటానికి నేను హౌలాగాడినా అంటూ అఖిల్ ఊగిపోయాడు. అయితే కూర్చొని మాట్లాడుకొందాం అంటూ సోహెల్ సముదాయించేందుకు ప్రయత్నం చేయడంతో అఖిల్ మరింత రెచ్చిపోయాడు.
Recommended Video
నేను హౌలా గాడినా.. అఖిల్ ఫైర్
ఇక మోనాల్‌తో కూర్చొని మాట్లాడమంటూ ఒత్తిడి చేయడంతో సోహెల్, అఖిల్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. అయితే నేనే హౌలా గాడినా? అని అంటే.. నేను హౌలాగాడినా అంటూ సోహెల్, అఖిల్ ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. అయితే తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మోనాల్‌తో మాట్లాడలేను అంటూ అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.