twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను హౌలాగాడినా? మోనాల్ కోసం కత్తులు దూసుకొన్న సోహెల్, అఖిల్

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 13వ వారం నామినేషన్ ప్రక్రియ తర్వాత హౌజ్‌లో ఇంటి సభ్యుల మధ్య వాతావరణం గంభీరంగా మారింది. తనను నామినేట్ చేయడంపై మోనాల్‌పై అఖిల్ భగ్గుమన్నాడు. ఈ సందర్భంగా జోక్యం చేసుకొన్న సోహెల్‌పై ధ్వజమెత్తడంతో ఇళ్లంతా గందరగోళంగా మారింది. 86వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

    మోనాల్ గజ్జర్ తీవ్ర మనస్తాపం

    మోనాల్ గజ్జర్ తీవ్ర మనస్తాపం

    నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో మోనాల్‌ తీవ్ర మనస్తాపానికి గురైంది. హారికతో తన బాధను చెప్పుకొని తీవ్రంగా కలత చెందింది. ఈ పరిస్థితిలో అఖిల్ తీవ్ర ఆందోళనకు గురై కంట తడి పెట్టుకొన్నాడు. తాను ఇష్టపడిన వారే నన్ను అర్ధం చేసుకోవడం లేదనే విధంగా మనస్తాపానికి గురయ్యాడు.

     మోనాల్, అఖిల్ మధ్య సోహెల్ సయోధ్య

    మోనాల్, అఖిల్ మధ్య సోహెల్ సయోధ్య

    అయితే మోనాల్, అఖిల్ పరిస్థితి చూసి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సోహెల్ ప్రయత్నించాడు. కూర్చోని మాట్లాడుకొందామని సూచిస్తే తనకు ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. అయితే నేను చెప్పేది వినవా అంటూ సోహెల్ అంటే.. మధ్యలో నీవు రాకు అంటూ అఖిల్ మండిపడ్డాడు.

     నన్ను అంత మాట అంటుందా?

    నన్ను అంత మాట అంటుందా?

    నామినేషన్ ప్రక్రియలో మైండ్‌తో ఆడుతున్నావని మోనాల్ కామెంట్ చేసింది. ఆమె మాత్రం హార్ట్‌తో ఆడుతున్నట్టు చెప్పాడు. అంటే ఇంకా ఆమెతో మాట్లాడటానికి నేను హౌలాగాడినా అంటూ అఖిల్ ఊగిపోయాడు. అయితే కూర్చొని మాట్లాడుకొందాం అంటూ సోహెల్ సముదాయించేందుకు ప్రయత్నం చేయడంతో అఖిల్ మరింత రెచ్చిపోయాడు.

    Recommended Video

    Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    నేను హౌలా గాడినా.. అఖిల్ ఫైర్

    నేను హౌలా గాడినా.. అఖిల్ ఫైర్

    ఇక మోనాల్‌తో కూర్చొని మాట్లాడమంటూ ఒత్తిడి చేయడంతో సోహెల్, అఖిల్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. అయితే నేనే హౌలా గాడినా? అని అంటే.. నేను హౌలాగాడినా అంటూ సోహెల్, అఖిల్ ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. అయితే తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మోనాల్‌తో మాట్లాడలేను అంటూ అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    English summary
    Bigg Boss Telugu 4s 13 week nominations list: As per Latest report, Abijeet, Akhil, Monal, Harika, Avinash has been nominated for elimination. In this occassion, Heat Arguments went between contestants. Monal Gajjar bursts over Akhil Sarthak and Mukku Avinash amid 13th nomination process
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X