ముక్కు అవినాష్ బాగోతం బయటపడింది: అమ్మాయిల పేర్లు బయట పెట్టి లైవ్‌లోనే పరువు తీశారు
ముక్కు అవినాష్... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడీ కమెడియన్. జబర్ధస్త్ అనే షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అత్యంత తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అతడి క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో లైవ్ షోలో అవినాష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ కార్యక్రమానికి కాల్ చేసి మరీ అతడి బాగోతం బయటపెట్టారిద్దరు. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్ రియాలిటీ షోకు
జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు ముక్కు అవినాష్. ఈ క్రమంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి తన హవాను చూపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షోకు బైబై చెప్పేశాడు అవినాష్. ఈ నేపథ్యంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

మార్క్‌ను చూపిస్తూ.. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు ప్రముఖ కమెడియన్ అవినాష్. ఇందులో భాగంగానే హౌస్‌మేట్స్ అందరితో కలివిడిగా ఉంటూ అందరివాడు అనిపించుకున్నాడు. అదే సమయంలో నవ్వుతూ నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. అంతేకాదు, తనదైన కామెడీతో బిగ్ బాస్ చరిత్రలోనే బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు.

లవ్ ట్రాకుతో మరింత పెరిగిన పాపులారిటీ
బిగ్ బాస్ హౌస్‌లో ఎంతగానో కామెడీని పండించి అవినాష్.. తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను సైతం బయట పెట్టాడు. తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో అతడు నడిపిన ట్రాక్ ఎంతో ఫేమస్ అయింది. ఆమెను పడేయడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆరియానా కూడా అవినాష్‌తో కలిసిమెలసి ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది.

ఊహించని విధంగా బయటకు వచ్చాడు
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అవినాష్.. నామినేషన్స్ సమయంలో మాత్రం సహనం కోల్పోతూ ఉండేవాడు. తద్వారా పలువురితో గొడవలకు దిగేవాడు. అంతేకాదు, జబర్ధస్త్ షోపై కామెంట్లు చేసి సింపతీ గేమ్ ఆడినట్లు కనిపించాడు. దీంతో తరచూ నామినేట్ అవుతుండేవాడు. ఈ క్రమంలోనే 13వ వారంలో ఊహించని విధంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేశాడు.

ముక్కు అవినాష్ బాగోతం బయటపడింది
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆఫర్లు అందుకుంటూ హల్‌చల్ చేస్తున్నాడు అవినాష్. అంతేకాదు, వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో అవినాష్ బాగోతాన్ని తోటి కంటెస్టెంట్లు సయ్యద్ సోహెల్ రియాన్, అఖిల్ సార్థక్ సరదాగా బయట పెట్టారు.

అమ్మాయిల పేర్లు బయట పెట్టి లైవ్‌లోనే
ముందుగా ఆ షోకి కాల్ చేసిన సోహెల్ గొంతు మార్చి ఏడిపించాడు. ఆ తర్వాత అవినాష్ గురించి మాట్లాడుతూ.. ‘రవళి మేటర్ ఏమైంది' అని అడిగాడు. అంతేకాదు, మందు తాగుతావని కంగారు పెట్టాడు. అనంతరం అఖిల్ కాల్ చేసి.. కూకట్‌పల్లి మౌనిక, స్వాతి అంటూ కొన్ని పేర్లు లీక్ చేశాడు. అంతేకాదు, ‘గ్యాస్ కనెక్షన్ కోసం మా అమ్మతో మాట్లాడాడు' అనడంతో అంతా షాకైపోయారు.


Click it and Unblock the Notifications











