సర్‌ప్రైజ్ చేసిన ఆరియానా సోహెల్: అర్ధరాత్రి అందులో రచ్చ రచ్చ.. బిగ్ బాస్ తర్వాత తొలిసారి ఇలా అంటూ!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు అన్నింటిలోనూ బిగ్ బాస్‌ది ప్రత్యేకమైన స్థానం అనే చెప్పాలి. దీనికి కారణం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ ఈ షో క్రియేట్ చేసిన రికార్డులే. కేవలం నాలుగేళ్ల ప్రయాణంలోనే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అలా.. నాలుగో సీజన్ ద్వారా ఫేమస్ అయ్యారు ఆరియానా గ్లోరీ.. సయ్యద్ సోహెల్ రియాన్. హౌస్‌లో నిత్యం గొడవలు పెట్టుకుంటూ వార్తల్లో నిలిచిన ఈ టామ్ అండ్ జెర్రీ.. తాజాగా అర్ధారాత్రి సమయంలో రచ్చ చేస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆరియానా సోహెల్
సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే కంటెస్టెంట్లు నేరుగా అడుగు పెడుతుంటారు. కానీ, నాలుగో సీజన్‌లో మొదటి రోజు మొత్తం 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మాత్రమే జంటగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి రెండు రోజుల పాటు మిగిలిన కంటెస్టెంట్లను ఆడుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లోకి ప్రవేశించారు.
దీపికా పదుకోన్ లేటేస్ట్ ఫోటోలు వైరల్

ఇద్దరూ ఇద్దరే... గొడవలతోనే ఎంట్రీ ఇస్తూ
సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే గొడవలను ప్రారంభించారు ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం.. వీళ్లిద్దరూ మిగిలిన హౌస్‌మేట్స్‌తో కఠువుగా ప్రవర్తించారు. తద్వారా వాళ్లందరి దృష్టిలో విలన్లుగా మారారు. ఆరంభంలో వీళ్లిద్దరినీ మిగిలిన వాళ్లంతా దూరం పెట్టారు. కానీ, క్రమక్రమంగా అందరూ కలిసిపోయి చక్కగా ఆడారు.

అదిరిపోయే ఆట.. పోటీగా గ్రాండ్ ఫినాలేకు
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బెస్ట్ ప్లేయర్లుగా చెప్పుకునే వాళ్లలో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ పేర్లు ముందుగా చెప్పుకోవచ్చు. అంతలా వీళ్లిద్దరూ గేమ్ ఆడారు. ఏ టాస్క్ అయినా సరే పోటాపోటీగా ఆడుతూ ఎన్నో సార్లు తమ జట్లను విజేతలుగా నిలిపారు. తద్వారా గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టారు. ఇందులో ఆరియానా నాలుగో స్థానం, సోహెల్ మూడో స్థానంలో నిలిచారు.

మొదటి నుంచి ఫినాలే వరకూ గొడవలతో
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ప్రతి విషయంలోనూ వీళ్లిద్దరికీ అస్సలు పడకపోవడంతో పాటు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉండడంతో బేదాభిప్రాయాలు వచ్చేవి. ఒకానొక సమయంలో క్యారెక్టర్లపై కామెంట్లు కూడా చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరికీ టామ్ అండ్ జెర్రీ అనే పేరు వచ్చేసింది.

ఆ షోలో రొమాన్స్ చేసిన టామ్ అండ్ జెర్రీ
బిగ్ బాస్ షో తర్వాత అటు ఆరియానా గ్లోరీ, ఇటు సోహెల్ ఫుల్ బిజీ అయిపోయారు. ఇద్దరూ వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బోల్డ్ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో ముక్కు అవినాష్‌తో కలిసి కొన్ని స్కిట్లు చేస్తోంది. తాజాగా ఈ షోకు సయ్యద్ సోహెల్ రియాన్ కూడా వచ్చాడు. దీంతో వీళ్లిద్దరూ కలిసి తొలిసారి రొమాన్స్ చేసి షాకిచ్చారు.

అర్ధరాత్రి అందులో రచ్చ.. సర్‌ప్రైజ్ చేశారు
కొద్ది రోజులుగా ఆరియానా గ్లోరీ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఇటీవలే ఆమె కోలుకుంది. ఈ విషయాన్ని అటు సోహెల్.. ఇటు ఆరియానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వీళ్లిద్దరూ ఓ చోట కలిసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో సోహెల్ కారులో ఆరియానా రైడ్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Recommended Video

బిగ్ బాస్ తర్వాత తొలిసారి ఇలా అంటూ
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియోను వదలిన సోహెల్ 'ఆరియానాకు హెల్త్ బాలేదని వెళ్దాం అంటే కుదరలేదు. అందుకే దాన్నే రమ్మాన్నాను. ఈరోజు లొకేషన్‌కు వచ్చింది' అని చెప్పాడు. ఆ తర్వాత ఆరియానా మాట్లాడుతూ.. 'ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ తర్వాత మేము తొలిసారి పర్సనల్‌గా కలిశాం' అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











