తొలిసారి రొమాన్స్‌తో రెచ్చిపోయిన ఆరియానా, సోహెల్: బిగ్ బాస్‌లో అలా.. బయట ఇలా.. షాకిచ్చిన జంట!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. మరీ ముఖ్యంగా గత ఏడాది వచ్చిన నాలుగో సీజన్ వల్ల చాలా మంది కంటెస్టెంట్లు ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో సయ్యద్ సోహెల్ రియాన్.. ఆరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో తరచూ గొడవలకు దిగుతూ వార్తల్లో నిలుస్తుండేవారు. దీంతో వీళ్లకు టామ్ అండ్ జెర్రీ అనే పేరొచ్చింది. అలాంటి వీళ్లు.. తాజాగా రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ఆ వివరాలు మీకోసం!

జంటగా ఎంట్రీ ఇచ్చిన ఆరియానా సోహెల్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మొదటి రోజు మొత్తం 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మాత్రమే జంటగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి రెండు రోజుల పాటు మిగిలిన కంటెస్టెంట్లను ఆడుకున్నారు. అది చేయండి.. ఇది చేయండి అంటూ ముప్పతిప్పలు పెట్టారు. ఆ తర్వాత హౌస్‌లోకి ప్రవేశించారు.

వెళ్లడం వెళ్లడమే.. ఆమె అలా... అతడిలా
సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే గొడవలను ప్రారంభించారు ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం.. వీళ్లిద్దరూ మిగిలిన హౌస్‌మేట్స్‌తో కఠువుగా ప్రవర్తించారు. తద్వారా వాళ్లందరి దృష్టిలో విలన్లుగా మారారు. ఆరంభంలో వీళ్లిద్దరినీ మిగిలిన వాళ్లంతా దూరం పెట్టారు. కానీ, క్రమక్రమంగా అందరూ కలిసిపోయి చక్కగా ఆడారు.

ఇద్దరూ ఆడారు... ఫినాలేలో అడుగెట్టారు
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బెస్ట్ ప్లేయర్లుగా చెప్పుకునే వాళ్లలో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ పేర్లు ముందుగా చెప్పుకోవచ్చు. అంతలా వీళ్లిద్దరూ గేమ్ ఆడారు. ఏ టాస్క్ అయినా సరే పోటాపోటీగా ఆడుతూ ఎన్నో సార్లు తమ జట్లను విజేతలుగా నిలిపారు. తద్వారా గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టారు. ఇందులో ఆరియానా నాలుగో స్థానం, సోహెల్ మూడో స్థానంలో నిలిచారు.

ఎప్పుడూ గొడవలే.. టామ్ అండ్ జెర్రీ పేరు
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ప్రతి విషయంలోనూ వీళ్లిద్దరికీ అస్సలు పడకపోవడంతో పాటు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉండడంతో బేదాభిప్రాయాలు వచ్చేవి. ఒకానొక సమయంలో క్యారెక్టర్లపై కామెంట్లు కూడా చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరికీ టామ్ అండ్ జెర్రీ అనే పేరు వచ్చేసింది.

తొలిసారి రొమాన్స్‌తో రెచ్చిపోయిన జంట
బిగ్ బాస్ షో తర్వాత అటు ఆరియానా గ్లోరీ, ఇటు సోహెల్ ఫుల్ బిజీ అయిపోయారు. ఇద్దరూ వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బోల్డ్ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో ముక్కు అవినాష్‌తో కలిసి కొన్ని స్కిట్లు చేస్తోంది. తాజాగా ఈ షోకు సయ్యద్ సోహెల్ రియాన్ కూడా వచ్చాడు. దీంతో వీళ్లిద్దరూ కలిసి తొలిసారి రొమాన్స్ చేసి షాకిచ్చారు.

బిగ్ బాస్‌లో అలా.. బయట ఇలా కనిపించి
బిగ్ బాస్ హౌస్‌తో నిత్యం గొడవలతో రచ్చ చేసిన ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్.. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌లో మాత్రం 'జనవరి మాసం' అంటూ సాగే పాటకు రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ క్లోజ్‌గా కనిపించారు. దీంతో పక్కనే ఉన్న అవినాష్ నిరాశగా కనిపించినట్లు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











