సోహెల్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్: వాళ్ల కంటే ఎక్కువే.. మూడు విధాలుగా లాభపడ్డాడు!

సయ్యద్ సోహెల్ రియాన్.. బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్న కంటెస్టెంట్. అంతకు ముందే కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించినప్పటికీ.. పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఈ షోలో వ్యవహరించిన తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. గొడవలు పడడం.. త్యాగాలు చేయడం.. ఎమోషనల్ అవడం వంటి వాటితో బాగా హైలైట్ అయ్యాడు. ఇక, ఫినాలేలో నాగార్జున ఇచ్చిన ఆఫర్ ఒప్పుకుని రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో మొత్తంలో అతడు రెమ్యూనరేషన్‌గా అందుకున్న మనీ ఎంతో లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం!

అన్నింట్లో ముందుంటూ సత్తా చాటాడు

అన్నింట్లో ముందుంటూ సత్తా చాటాడు

సీక్రెట్ రూమ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన సయ్యద్ సోహెల్ రియాన్.. ఆ తర్వాత గొడవతోనే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నింట్లో ముందుంటూ తన మార్క్ చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగడం అతడికి మైనస్‌గా మారినా.. తర్వాత దాన్ని అధిగమించాడు.

టైటిల్ ఫేవరెట్.. ఆఫర్‌కు ఓకే చెప్పాడు

టైటిల్ ఫేవరెట్.. ఆఫర్‌కు ఓకే చెప్పాడు

బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లలో ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువగా విలువ ఇచ్చేవాడు సోహెల్. తన స్నేహితుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అతడు.. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేవాడు. ఇలా అన్ని రకాలుగా ఆకట్టుకుని ప్రజాదరణను పొందాడు. ఈ కారణంగానే టాప్-5లోకి వచ్చాడు. అయితే, ఫినాలేలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

చీటింగ్ వీడియోతో సోహెల్‌పై విమర్శలు

చీటింగ్ వీడియోతో సోహెల్‌పై విమర్శలు

రీయూనియన్ పార్టీ కోసం మెహబూబ్ హౌస్‌లోకి వెళ్లాడు. అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోహెల్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో అని సైగలు చేశాడతను. అప్పుడే మూడు వేళ్లు కూడా చూపించాడు. అంటే మూడో స్థానంలో ఉన్నావు.. ఆఫర్‌కు ఒప్పుకో అన్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని వాళ్లపై విమర్శలు వస్తున్నాయి.

 ఎవరికీ సాధ్యం కాని రీతిలో మొదలెట్టి

ఎవరికీ సాధ్యం కాని రీతిలో మొదలెట్టి

సినిమా హీరోగా సత్తా చాటాలన్న లక్ష్యాన్ని బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే నిజం చేసుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్. గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి ముందు ఇదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ‘జార్జ్‌రెడ్డి' టీమ్‌తో సినిమా చేస్తున్నాడు. మూడుడు రోజుల క్రితం దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వివరాలు ఇవే

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వివరాలు ఇవే

సయ్యద్ సోహెల్ రియాన్ బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగాడు. అతడు రోజుకు రూ. 25 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. దీనికి బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షలు కలుపుకుంటే రూ. 51 లక్షల 25 వేలు మనీ తీసుకున్నాడు. దీనికితోడు ఫేమ్ కూడా అందుకున్నాడు.

మూడు విధాలుగా.. వాళ్ల కంటే ఎక్కువ

మూడు విధాలుగా.. వాళ్ల కంటే ఎక్కువ

షోలో కొనసాగినందుకు గానూ రెమ్యూనరేషన్, బిగ్ బాస్ ఆఫర్‌తో ఫ్రైజ్ మనీ తీసుకున్న సోహెల్.. హోస్ట్ అక్కినేని నాగార్జున ఇచ్చిన రూ. 10 లక్షలతో మొత్తం రూ. 61 లక్షల పైచిలుకు అమౌంట్ అందుకున్నాడు. తద్వారా టాప్- 5కి చేరిన అఖిల్ సార్థక్, ఆరియానా గ్లోరీ, దేత్తడి హారికల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్‌గా నిలిచాడీ యాంగ్రీ యంగ్ మ్యాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X