తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్: రేపటి నుంచి కథ వేరే ఉంటదంటూ పోస్ట్.. శుభాకాంక్షల వెల్లువ

చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలు సీరియళ్లలో నటించాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా అతడికి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవడం వల్ల అతడి కెరీర్ మొత్తం మారిపోయింది. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో పాటు వరుస ఆఫర్లు కూడా అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన తండ్రితో కలిసి ఓ శుభవార్త చెప్పాడు సోహెల్. అంతేకాదు, రేపటి నుంచి కథ వేరే ఉంటదంటూ పోస్ట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

కొత్త బంగారు లోకం టు తెలుగు సీరియల్స్

కొత్త బంగారు లోకం టు తెలుగు సీరియల్స్

వరుణ్ సందేశ్ హీరోగా చేసిన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం 'సరైనోడు' వంటి బడా మూవీలలో పాటు చిన్న సినిమాల్లోనూ నటించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో పేరు వచ్చింది.

ఆమెతో కలిసి అలా.. గొడవలతోనే మొదలు

ఆమెతో కలిసి అలా.. గొడవలతోనే మొదలు

వరుసగా సినిమాలు, సీరియళ్లతో బిజీగా గడుపుతోన్న సోహెల్‌కు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే, అందరిలా కాకుండా ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ రెండు రోజుల పాటు రచ్చ రచ్చ చేసిన అతడు.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. వెళ్లడమే గొడవ మొదలెట్టాడు. అలానే ప్రేక్షకుల దృష్టిలో పడిపోయాడు.

అందులో మాత్రం రాజీలేదు... ఫినాలే ఎంట్రీ

అందులో మాత్రం రాజీలేదు... ఫినాలే ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు సోహెల్. ఇందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏ టాస్క్ అయినా తానే నెంబర్ వన్ అనేలా ఆడుతూ వచ్చాడు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్లతో గొడవలు పడుతూ విమర్శల పాలయ్యాడు. మొత్తానికి ప్రేక్షకుల మద్దతులో ఫినాలేలో అడుగు పెట్టాడతను.

బిగ్ బాస్‌తో మారింది... చరిత్రలో అతనొక్కడే

బిగ్ బాస్‌తో మారింది... చరిత్రలో అతనొక్కడే

గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. తద్వారా ఇలా షో చరిత్రలో డబ్బులు తీసుకుని వచ్చిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అంతేకాదు, రోజు వారి రెమ్యూనరేషన్‌తో కలిపి దాదాపు రూ. 50 లక్షల వరకూ సంపాదించాడట సోహెల్. అంటే విన్నర్ ఫ్రైజ్‌మనీతో సమానంగా.

టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం సోహెల్‌దే అనేలా

టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం సోహెల్‌దే అనేలా

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వెంటనే 'జార్జిరెడ్డి' టీమ్‌తో కలిసి ఓ సినిమాను ప్రారంభించాడు సోహెల్. దానితో పాటు పలు చిత్రాలను కూడా ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. దీంతో ఈ యంగ్ సెన్సేషన్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్

తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్

బిగ్ బాస్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన రీతిలో పాపులర్ అయిపోయిన సయ్యద్ సోహల్ రియాన్.. తాజాగా తన తండ్రి, సోదరుడితో కలిసి ఓ శుభవార్త చెప్పాడు. అదే.. అతడు కొత్త కారును కొనుగోలు చేశాడు. MG కంపెనీకి చెందిన దాని ధర దాదాపు రూ. 30 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

రేపటి నుంచి కథ వేరే ఉంటదంటూ పోస్ట్

రేపటి నుంచి కథ వేరే ఉంటదంటూ పోస్ట్

కారు కొన్న విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసిన సయ్యద్ సోహెల్ రియాన్.. 'ఇగో.. ఇప్పుడే కొత్త కారు కొన్నా.. రేపటి నుంచి కథ వేరే ఉంటది' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్లైన ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోహెల్‌కు విసెష్ చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X