బొగ్గు గనిలో నాన్నకు ప్రమాదం.. ఒకే కిడ్నీతో కష్టపడి పోషించాడు.. సయ్యద్ సోహైల్ కష్టాలు చెప్పుకొంటూ
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో సయ్యద్ చాలా ఆవేశపరుడిగా కనిపిస్తాడు. కానీ ఆ ఆవేశం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో తాజా ఎపిసోడ్‌లో బయటపడితే తప్ప ఆయన జీవితం ఏమిటో తెలిసి రాలేదు. అందరి మధ్య తరగతి కుటుంబాల మాదిరిగానే అనేక కష్టాలను బాల్యంలో అనుభవించామని సయ్యద్ సోహైల్ చెప్పుకొంటూ వచ్చారు. తాజాగా 39వ రోజు ఎపిసోడ్‌లో తన బాల్యం గురించి, తన తండ్రి కష్టాల గురించి చెప్పుకొంటూ..

బొగ్గు గనిలో నాన్నకు ప్రమాదం
నా గురించి చెప్పుకొనే ముందు మా నాన్న గురించి చెప్పుకోవాలి. మా నాన్న సింగరేణిలో పనిచేస్తారు. అప్పట్లో బొగ్గు బావిలోకి దిగి సుమారు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి పనిచేసే వాళ్లు. అండర్‌గ్రౌండ్‌లో మా నాన్న పనిచేసేటప్పడు తలపై బొగ్గు రాయి పడింది. దాని ఎఫెక్ట్ మూడేళ్ల క్రితం బయటపడింది అని సోహైల్ చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు.

యాక్సిడెంట్‌లో నాన్నకు కిడ్నీ దెబ్బ తిని
మా నాన్న తలకు తగిలిన పాత గాయం మళ్లీ తిరగదోడింది. అంతేకాకుండా మా నాన్నకు ఒకటే కిడ్నీ. యాక్సిడెంట్‌లో కిడ్నీ పోయింది. అయినా ఒకే కిడ్నితో మా కోసం అలానే ఉద్యోగం చేశారు. అందుకే మా నాన్న అంటే ఇష్టం. నేను ఓ సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది అని సయ్యద్ సోహైల్ ర్యాన్ అన్నారు.

సింగరేణి ముద్దు బిడ్డగా గర్వంగా
నేను బిగ్‌బాస్ చేరుకోవడంపై మా నాన్న ఎంత సంతోషంగా ఉంటారో నాకు తెలుసు. సింగరేణి ముద్దు బిడ్డ సోహైల్ బిగ్‌బాస్‌కు వచ్చాడు. మీ అందరూ చూడండి అంటూ చెబుతుంటాడు. నన్ను చూసి మా నాన్న గర్వంగా ఫీల్ అవుతాడు అని సోహైల్ భావోద్వేగానికి గురయ్యాడు.
Recommended Video

గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్‌బాస్
మా కుటుంబం గర్వపడే స్థాయికి చేరుకొన్నందుకు హ్యాపీగా ఉంది. నా కోసం మా కుటుంబం ఎంతో కష్టాలు పడింది. నాకు మరో మంచి గుర్తింపు ఇచ్చిన బిగ్‌బాస్‌కు చాలా థ్యాంక్స్. మేమంత గర్వంగా ఉంటాం. లవ్ యూ డాడ్. థ్యాంక్యూ మై ఫ్యామిలీ అంటూ సోహైల్ తన ఎమోషనల్ జీవిత ప్రయాణాన్ని బిగ్‌బాస్ ప్రేక్షకులతో పంచుకొన్నారు


Click it and Unblock the Notifications











