పాత లెక్కలు తోడుతున్న సోహెల్ ఫ్యాన్స్: ఆ సెంటిమెంట్ ప్రకారం అతడే గెలుస్తాడట.!
బిగ్ బాస్ షో పుణ్యమా అని తెలుగులో ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్ల ద్వారా చాలా మంది ఈ రీతిలో హైలైట్ అయ్యారు. అందులో ప్రస్తుతం ప్రసారం అవుతోన్న దానిలో చాలా మందే ఉన్నారు. వారిలో సయ్యద్ సోహెల్ రియాన్ ఒకడు. సాదాసీదా ఆర్టిస్టుగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు. బయట అందరూ అభిజీతే గెలుస్తాడని అంటుంటే.. ఓ సెంటిమెంట్ ప్రకారం సోహెల్ విజయం సాధిస్తాడని చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం!

సీరియల్స్.. సినిమాలు.. సోహెల్ కెరీర్ ఇలా
‘కొత్త బంగారు లోకం' అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సయ్యద్ సోహెల్ రియాన్. ఆ సినిమాలో చిన్న పాత్రలోనే కనిపించిన అతడు.. ఆ తర్వాత ‘యూరేకా', ‘పిచ్చిగా నచ్చావ్' అనే మూవీల్లో లీడ్ రోల్ చేశాడు. అనంతరం ‘జనతా గ్యారేజ్', ‘సరైనోడు' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇక, బుల్లితెరపైన ‘పసుపు కుంకుమ', ‘నాతిచరామీ' వంటి సీరియల్స్ చేస్తున్నాడు.

ఆమెతో కలిసి సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాడు
సినిమాలు, సీరియళ్లతో బిజీ బిజీగా గడుపుతోన్న సోహెల్... ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు. షో ఆరంభంలో ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన అతడు.. కొద్ది రోజుల తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి తన మార్క్ చూపించేందుకు తెగ శ్రమపడిపోతున్నాడు. ఫలితంగా హైలైట్ అవుతున్నాడు.

‘కథ వేరే ఉంటది' అని ఫైర్ అవడంతో ఫేమస్
సోహెల్ చూడడానికి నవ్వుతూ నవ్విస్తూ ఎంత కామ్‌గా కనిపిస్తాడో.. టాస్కులు వస్తే మాత్రం విభిన్నంగా దర్శనమిస్తుంటాడు. ఇక, ఫిజికల్ టాస్కుల్లో రెచ్చిపోయి ఆడుతుంటాడు. ఫలితంగా పలు గొడవల్లోనూ భాగమయ్యాడు. మరీ ముఖ్యంగా షో ఆరంభంలో జరిగిన మర మనుషులు టాస్కులో ‘కథ వేరే ఉంటది' అంటూ అభిజీత్‌పై అతడు ఫైర్ అయిన విధానం హాట్ టాపిక్ అయింది.

నాగ్‌కు ప్రామిస్ చేసినా అతడు మారడంలేదు
తరచూ కోపం తెచ్చుకోవడం.. ఎవరో ఒక కంటెస్టెంట్‌తో గొడవకు దిగుతుండడం వంటివి చేయడం వల్ల సోహెల్‌పై హోస్ట్ అక్కినేని నాగార్జున ఫైర్ అయ్యాడు. ఆ సమయంలో ఇకపై కోప్పడను అని ప్రామిస్ చేశాడీ కుర్రాడు. అందుకు అనుగుణంగానే కొన్ని వారాలు కామ్‌గా కనిపించాడు. కానీ, ఈ మధ్య మళ్లీ అదే తరహా వివాదాస్పద ప్రవర్తనతో గొడవలకు దిగుతున్నాడు.

పాత లెక్కలు తోడుతున్న సోహెల్ ఫ్యాన్స్
బిగ్ బాస్ నాలుగో సీజన్ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఫైనల్‌కు చేరుకునే ఐదుగురు కంటెస్టెంట్లు ఎవరు.? టైటిల్ గెలిచేది ఎవరు.? అన్న దానిపై బయట బాగా చర్చలు జరుగుతున్నాయి. ఈ దశలో ఎక్కువగా అభిజీత్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రేక్షకులు. అతడే విజయం సాధిస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్ అభిమానులు పాత లెక్కలను తోడుతున్నారు.
Recommended Video

ఆ సెంటిమెంట్ ప్రకారం అతడే గెలుస్తాడట
షో ఫినాలేకు చేరువైన నేపథ్యంలో సోహెల్ ఫ్యాన్స్ ఓ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో గెలిచిన ముగ్గురు కంటెస్టెంట్లు కోపం ఉన్నవాళ్లేనట. అంతేకాదు, వాళ్లంతా వివాదాస్పద ప్రవర్తనతో విమర్శలకు గురైన వాళ్లే అంటున్నారు. అందుకే ఈ సీజన్‌లోనూ అలాంటి ప్రవర్తన ఉన్న సోహెల్ గెలుస్తాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











