రా.. ఇంకో గుడ్డు కొట్టు.. హోళీ ఆడుదాం రా... అరియానా, మోనాల్‌పై రెచ్చిపోయిన సోహైల్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొమ్మిదో వారానికి జరిగిన నామినేషన్ల ప్రక్రియ ప్రకంపనాలు సృష్టించింది. ఇంటి సభ్యుల మధ్య అవేశకావేశాలు పెచ్చురిల్లాయి. ఒక్కరని చెప్పకుండా ప్రతీ ఇంటి సభ్యుడితో మరొకరు గొడవ పడ్డారు. ముఖ్యంగా సోహైల్, అరియానా, అభిజిత్, అమ్మా రాజశేఖర్ మధ్య జరిగిన గొడవ ఎలా ఉందంటే..

నామినేషన్లకు ముందు బిగ్‌బాస్ వార్నింగ్
నామినేషన్ల ప్రక్రియకు ముందు ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఇంటి సభ్యులందరూ అసలైన ఆటను ఆడే సమయం వచ్చిందంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కోడిగుడ్డు పంపించి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. కంటెస్టెంట్ మీద కోడిగుడ్డు కొట్టి నామినేట్ చేయాలని సూచించారు.

ఇంకో గుడ్డు ఉందా?
నామినేషన్ ప్రక్రియలో సోహైల్ సయ్యద్ ర్యాన్ మరోసారి రెచ్చిపోయారు. అరియానా గ్లోరి, మోనాల్ గజ్జర్‌పై ఒంటికాలిపై లేచారు. నీ వద్ద ఇంకో గుడ్డు ఉందా? నా తలపై కొట్టు. హోళీ ఆడుదాం రా అంటూ అరియానాపై సోహైల్ రెచ్చగొట్టాడు. సోహైల్ రెచ్చిపోవడం చూసి అరియానా నవ్వుతూ నిలబడింది.

ఏదైనా చెబితే చెవిలో ఊదుతావా?
ఇక మోనాల్‌పై సోహైల్ రచ్చిపోయాడు. నీకు ఏదైనా మ్యాటర్ చెబితే.. నువ్వు వెళ్లి ఊదేస్తావన్నమాట అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా తలపై కోడిగుడ్డు కొట్టి నామినేట్ చేశాడు. ఇలా సోహైల్ అందరిపై ఎగురుతూ కనిపించాడు. ఇదిలా ఉండగా, అభిజిత్, సోహైల్ మధ్య ఏదో భారీగానే డిస్కషన్ జరిగింది.
Recommended Video

అభిజిత్, అమ్మా రాజశేఖర్ గొడవలో జోక్యం
ఇలా రెచ్చిపోయిన సోహైల్ ప్రశాంతంగా కూడా కనిపించాడు. అభిజిత్‌కు అమ్మా రాజశేఖర్‌కు గొడవ జరుగుతుంటే ఆపుతూ కనిపించారు. వారిద్దరిని గొడవ పడకుండా సర్ధి చెప్పే ప్రయత్నం చేశాఢు. ఇలా సోహైల్ భిన్న మనస్తత్వాలతో కనిపించాడు. ఇక తాజా ప్రోమో సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచింది.


Click it and Unblock the Notifications











