For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపాదన విషయంలో సోహెల్ కీలక నిర్ణయం.. మరో మెట్టు ఎక్కేసావయ్యా..

    |

    బిగ్ బాస్ సీజన్ 4 గెలుపోటములతో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ జనాల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా టాప్ 7 కంటెస్టెంట్స్ నెవర్ బిఫోర్ అనేలా సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా కూడా వారికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక టాప్ 3లో నిలిచిన సోహెల్ అయితే అభిమానులను ఆకట్టుకోవడంలో మరొక మెట్టు ఎక్కేశాడు. వరుసగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

    అతనికంటే హై రేంజ్ లో సోహెల్..

    అతనికంటే హై రేంజ్ లో సోహెల్..

    బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట్లో అలాగే మధ్యలో రేటింగ్స్ తక్కువగా వచ్చినప్పటికీ చివరలో మాత్రం షోకు భారీ స్థాయిలో రేటింగ్స్ అందాయి. ఇక అభిజిత్ విన్నర్ అయినప్పటికీ అతనికంటే హై రేంజ్ లో క్లిక్కయ్యాడు సోహెల్. ఏకంగా మెగాస్టార్ తోనే ప్రశంసలు అందుకొని ఆయన గెస్ట్ రోల్ చేస్తానని చెప్పేవారకు ఎదిగాడు.

    మరొక కీలక నిర్ణయం తీసుకున్న సోహెల్

    మరొక కీలక నిర్ణయం తీసుకున్న సోహెల్

    ఇక బిగ్ బాస్ విన్నర్ దాదాపు అభిజిత్ అని తెలిసిపోయిన క్రమంలో సోహెల్ తీసుకున్న నిర్ణయం అందరిని ఎట్రాక్ట్ చేసింది. 25లక్షల ప్రైజ్ మనీతో టాప్ 3తో సరిపెట్టుకున్నాడు. ఇక వచ్చిన ప్రైజ్ మనీని సేవా కార్యక్రమాల కోసం వినియోగించాడనికి ప్రయత్నం చేస్తానని చెప్పిన అతను ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను మరింతగా ఆకట్టుకుంది.

    వచ్చిన సంపదనలో.. పేద వాళ్ల కోసం..

    వచ్చిన సంపదనలో.. పేద వాళ్ల కోసం..

    అసలు మ్యాటర్ లోకి వస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి సోహెల్ ఇటీవల పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. బిగ్ బాస్ ప్రైజ్ మనీని సగం వరకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పిన సోహెల్ భవిష్యత్తులో వచ్చే సంపాదనలో 10 నుంచి 15 శాతం వరకు పెదవాళ్ల కోసం ఉపయోగిస్తానని చెప్పాడు.

    మరో మెట్టు ఎక్కేశాడు

    మరో మెట్టు ఎక్కేశాడు

    బిగ్ బాస్ ఫైనల్స్ రోజే తన సేవా గుణాన్ని చాటుకున్న సోహెల్ ఇప్పుడు సంపాదన విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకోవడంతో అభిమానుల ప్రేమను అందుకోవడంలో మరో మెట్టు ఎక్కేశాడు. ఇక స్పెషల్ గా కొన్ని ట్రస్టులను, సేవా సంస్థలను ఎంచుకున్న సోహెల్ వీలైనంత వరకు అందులో ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం సోహెల్ జార్జిరెడ్డి మేకర్స్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    Telugu producers Ask For 100% Theatre Occupancy | Filmibeat Telugu
    English summary
    Whether or not she received such a craze as an anchor, Ariana gave herself the title of Bold Girl. The hustle and bustle in this young girl's house, which was seen with the entry of Bigg Boss 4th season, is not normal. Trying to impress with the daily comedy task is not going to be a workout in the range as expected either. There have already been a lot of satires on her voice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X