బిగ్ బాస్ హౌస్‌లో అద్భుత దృశ్యం: వాళ్లిద్దరి ముద్దులు, హగ్గులు.. ఫినాలే ముందు సెట్టైపోయింది
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలేకు మరింత చేరువైంది. సోమవారం నుంచి తుది వారం ప్రారంభం కాబోతుంది. దీంతో టాప్ - 5లో ఎవరు ఉంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో సోహెల్ ఫినాలేకు చేరినట్లు నాగార్జున ప్రకటించేశాడు. మిగిలిన వారి విషయంలో బయట పలువురి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చినా.. అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఆదివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో శనివారం బిగ్ బాస్ హౌస్‌లో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఆ వివరాలు మీకోసం!

చివరి వారం బోరింగ్ టాస్కులతో
ఫినాలే వీక్‌కు ముందు జరిగిన చివరి నామినేషన్‌లో అఖిల్ సార్థక్‌ను మినహా మిగిలిన వారందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీలుగా వాళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చాడు. వారం మొత్తంలో ఒకటి రెండు రోజులు మినహా షో మొత్తం సోసోగా సాగింది. నిజానికి ఒక ఎపిసోడ్ గంట సేపు కూడా ప్రసారం చేయలేదంటే షో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాళ్లిద్దరి గొడవతో హాట్ టాపిక్‌గా
14వ వారం మొత్తంలో ఓపిక టాస్క్ ఒకటే రంజుగా సాగింది. ఇందులో మొదట మోనాల్ గజ్జర్‌తో గొడవకు దిగిన ఆరియానా గ్లోరీ.. ఆ తర్వాత సయ్యద్ సోహెల్ రియాన్‌తో ఫైటింగ్ చేసింది. ఇది మరీ పీక్స్‌కు చేరడంతో ఇద్దరూ కొట్టుకుంటారా అన్న అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో కలిగాయి. ఒకరిని మించి ఒకరు ఏడవడం కూడా ఈ గొడవను బాగా హైలైట్ చేసింది.

ఇద్దరికీ చీవాట్లు పెట్టిన నాగార్జున
శనివారం జరిగిన టాస్కులో ఈ గొడవను ప్రస్తావించాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ముందుగా గొడవ ఎలా జరిగిందని వాళ్లనే అడిగి తెలుసుకున్న ఆయన.. ఆ తర్వాత ఇద్దరికీ చీవాట్లు పెట్టాడు. అమ్మాయి మీదకు కొట్టినట్లుగా వెళ్లడం సోహెల్ చేసిన తప్పని చెప్పిన నాగ్.. మూడో వ్యక్తిని తీసుకురావడం, ఓవర్‌గా రియాక్ట్ అవడం, ఉమెన్ కార్డ్ వాడడం ఆరియానా తప్పులని చెప్పాడు.

ఫినాలే కంటెస్టెంట్‌ను రివీల్ చేసి
గత ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను సేఫ్ చేసినట్లు కాకుండా... ఫినాలేకు చేరే టాప్ -5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా రివీల్ చేస్తానని అక్కినేని నాగార్జున వెల్లడించాడు. అందులో భాగంగా మొదటి కంటెస్టెంట్ ఎవరో రివీల్ చేయాలని ఇప్పటికే ఫినాలేకు చేరిన అఖిల్ సార్థక్‌కు చెప్పాడు. ఆయన ఆదేశాల మేరకు ఓ బోర్డును తెరచి చూడగా అందులో సోహెల్ ఫొటో ఉంది.
Recommended Video

బిగ్ బాస్ హౌస్‌లో అద్భుత దృశ్యం
ఇక, ఎపిసోడ్ ముగించే ముందు ఆరియానా, సోహెల్ ఒక వారమే కలిసి ఉంటారని గుర్తు చేసిన నాగార్జున.. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించుకోవాలని సూచించాడు. అలాగే, ఆరియానాను ‘నువ్వు బోల్డుగా ఉంటేనే బాగుంటావమ్మా. ఇలా సైలెంట్‌గా ఉంటే నాకసలు నచ్చదు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక, ఎపిసోడ్ చివర్లో ఊహించని సంఘటన జరిగింది.

వాళ్లిద్దరి ముద్దులు, హగ్గుల వల్ల
గొడవను పరిష్కరించుకోడానికి సోహెల్ అద్భుతమైన పని చేశాడు. సోఫా దగ్గరే కూర్చున్న ఆరియానాకు మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పిన అతడు... ఆ వెంటనే హగ్ చేసుకుని ముద్దులు పెట్టాడు. దీనికి అదే రీతిలో రియాక్ట్ అయిందామె. దీంతో నిన్న మొన్నటి వరకూ గొడవలు పెట్టుకున్న ఆరియానా, సోహెల్ కలిసిపోయారు. సో.. వాళ్ల అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











