ఆరియానా గ్లోరీ బండారం బయటపెట్టిన సోహెల్: ఒక్క ఫొటోను లీక్ చేసి.. కింద అస్సలు చూడకండి అంటూ!
తెలుగులోకి పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే ఎనలేని ఆదరణను అందుకుని నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ.. ఇక్కడి ప్రేక్షకులు దీనిపై మక్కువ చూపారు. దీంతో విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో ఆరియానా గ్లోరీ.. సయ్యద్ సోహెల్ రియాన్ కూడా ఉన్నారు. హౌస్‌లో కొట్టుకున్న వీళ్లు.. బయట మాత్రం కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోహెల్.. ఆరియానా సీక్రెట్ లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరూ కలిసి రహస్యంగా వెళ్లి రచ్చ చేశారు
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే కంటెస్టెంట్లు నేరుగా అడుగు పెడుతుంటారు. కానీ, నాలుగో సీజన్‌లో మొదటి రోజు మొత్తం 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మాత్రమే జంటగా సీక్రెట్ రూమ్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి రెండు రోజుల పాటు మిగిలిన కంటెస్టెంట్లను ఆడుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లి హడావిడి చేసేశారు.

అందులో ఇద్దరూ ఇద్దరే అన్నట్లు వ్యవహారం
కొద్ది రోజుల తర్వాత సీక్రెట్ రూమ్‌ను వీడిన ఆరియానా గ్లోరీ.. సయ్యద్ సోహెల్ రియాన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. అప్పుడు పెద్దాయన ఆదేశాల ప్రకారం.. వీళ్లిద్దరూ మిగిలిన హౌస్‌మేట్స్ అందరితో గొడవలు పెట్టుకున్నారు. ఇందుకోసం కోపంగా ఉన్నట్లు ప్రవర్తించారు. ఇందులో ఎవరూ తీసిపోని విధంగా యాక్టింగ్ చేశారు. తద్వారా వాళ్లందరి దృష్టిలో విలన్లుగా మారారు.

ఆటలో అదరగొట్టేశారు.. ఫినాలేకు వెళ్లి ఇలా
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బెస్ట్ ప్లేయర్లుగా చెప్పుకునే వాళ్లలో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ పేర్లు ముందుగా చెప్పుకోవచ్చు. అంతలా వీళ్లిద్దరూ గేమ్ ఆడారు. ఏ టాస్క్ అయినా సరే పోటాపోటీగా ఆడుతూ ఎన్నో సార్లు తమ జట్లను విజేతలుగా నిలిపారు. తద్వారా గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టారు. ఇందులో ఆరియానా నాలుగో స్థానం, సోహెల్ మూడో స్థానంలో నిలిచారు.

టామ్ అండ్ జెర్రీ అనే పేరు సంపాదించుకుని
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ప్రతి విషయంలోనూ వీళ్లిద్దరికీ అస్సలు పడకపోవడంతో పాటు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉండడంతో బేదాభిప్రాయాలు వచ్చేవి. ఒకానొక సమయంలో క్యారెక్టర్లపై కామెంట్లు కూడా చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరికీ టామ్ అండ్ జెర్రీ అనే పేరు వచ్చేసింది.

బయట మాత్రం ఇద్దరూ అలా ఉంటున్నారు
బిగ్ బాస్ షోలో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ.. తిట్టుకుంటూ కనిపించిన ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్.. బయట మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నారు. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అనిపించుకుంటున్నారు ఇందులో భాగంగానే తరచూ కలుస్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఓ కార్యక్రమంలో రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేసి షాకిచ్చారు.

ఆరియానా బండారం బయటపెట్టిన సోహెల్
సయ్యద్ సోహెల్ రియాన్ ఓ సినిమాలో చేస్తున్నాడు. అదే సమయంలో ఆరియానా కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకుంది. వాటికి సంబంధించిన షూటింగులు కూడా జరుగుతున్నాయి. ఇక, ప్రస్తుతం చిత్రీకరణలు ఆగిపోవడంతో వాళ్లిద్దరూ మరోసారి కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సోహెల్.. ఆరియానా బండారం బయటపెట్టేసి పరువు తీసేశాడు.
Recommended Video

ఒక్క ఫొటోను లీక్.. కింద అస్సలు చూడకండి
ఆరియానా గ్లోరీతో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన సోహెల్.. 'కింద హైట్ కోసం లెగ్స్‌తో కష్టపడుతోంది. అస్సలు చూడకండి. ఇందాకే ఇంటికి వచ్చి వెళ్లింది. మణికొండ షిఫ్ట్ అవుతుందంట. వెల్‌కం టూ మణికొండ బ్యాచ్' అంటూ అందులో రాసుకొచ్చాడు. తద్వారా ఆమె హైట్ తక్కువ అని చూపిస్తూ పరువు తీసేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











