మెహబూబ్ గుట్టు విప్పిన సోహెల్: అందుకే పైకి అలా కనిపిస్తున్నాడంటూ మేటర్ రివీల్ చేశాడు

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్. అస్సలు సంబంధమే లేని కొంత మంది కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి.. గేమ్స్ ఆడిస్తూ.. ప్రేక్షకుల ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించడమే ఈ షో విధానం. ఇది ముగిసే సరికి హౌస్‌మేట్స్ శత్రువులుగా, స్నేహితులుగా, ప్రేమికులుగా మారుతుంటారు. ఇలా నాలుగో సీజన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌ అయ్యారు సయ్యద్ సోహెల్ రియాన్.. మెహబూబ్ దిల్‌సే. వీళ్లిద్దరూ బయటకొచ్చాక కూడా రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడి గుట్టు విప్పాడు సోహెల్. ఆ వివరాలు మీకోసం!

మరింత గ్లామర్‌గా శృతి హాసన్.. క్రాక్ విజయంతో మరింత జోష్‌గా

ఇద్దరి కెరీర్‌లు అలా... ఎంట్రీ ఇలా

ఇద్దరి కెరీర్‌లు అలా... ఎంట్రీ ఇలా

పలు సీరియళ్లలో, సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. మరోవైపు, సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్నాడు మెహబూబ్ దిల్‌సే. ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకున్న అతడు బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ పట్టేశాడు.

అదిరిపోయే ఆట.. ఇద్దరే తోపులు

అదిరిపోయే ఆట.. ఇద్దరే తోపులు

బిగ్ బాస్ హౌస్‌లో సోహెల్.. మెహబూబ్.. ఇద్దరూ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడేవారు. దీంతో ఎక్కడ చూసినా వీళ్లిద్దరే కనిపించేవారు. అలాగే, కెప్టెన్సీ టాస్క్, నామినేషన్స్ టాస్కుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగేవారు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగింది.

ఒకరు ఎలిమినేట్.. ఒకరు ఫైనలిస్ట్

ఒకరు ఎలిమినేట్.. ఒకరు ఫైనలిస్ట్

గేమ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. మెహబూబ్ దిల్‌సే చాలా రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగలేకపోయాడు. మధ్యలోనే అతడు షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితుడు సోహెల్ కోసం అతడు చాలా ప్రచారమే చేశాడు. అలాగే, అతడికి మద్దతుగా పోస్టులూ పెట్టాడు. సోహెల్ మాత్రం అన్ని రకాలుగా రాణించడంతో ఫినాలేకు చేరుకున్నాడు.

చీటింగ్ వీడియోతో ఇద్దరిపై డౌట్లు

చీటింగ్ వీడియోతో ఇద్దరిపై డౌట్లు

రీయూనియన్ పార్టీ కోసం మెహబూబ్ హౌస్‌లోకి వెళ్లాడు. లోపల అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోహెల్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో అని సైగలు చేశాడతను. అప్పుడే మూడు వేళ్లు కూడా చూపించాడు. అంటే మూడో స్థానంలో ఉన్నావు.. ఆఫర్‌కు ఒప్పుకో అన్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని వాళ్లపై డౌట్లు వచ్చాయి.

మెహబూబ్ గుట్టు విప్పిన సోహెల్

మెహబూబ్ గుట్టు విప్పిన సోహెల్

బిగ్ బాస్ షో తర్వాత ఫుల్ బిజీ అయిపోయాడు సోహెల్. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా మారాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మెహబూబ్, అఖిల్ సార్థక్‌ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇందులో తన స్నేహితుల ఇద్దరి అసలు రహస్యాన్ని బయట పెట్టి షాకిచ్చాడీ సింగరేణి ముద్దుబిడ్డ.

Recommended Video

Boney Kapoor Slams SS Rajamouli Over RRR-Maidaan Clash
అందుకే అలా కనిపిస్తున్నాడంటూ

అందుకే అలా కనిపిస్తున్నాడంటూ

సోహెల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'అఖిల్, మెహబూబ్ సోషల్ మీడియాలో వీడియోలు రూపొందించే సమయంలో ఫిల్టర్లు వాడతారు. అందుకే కర్రిగా ఉన్న వాళ్లిద్దరూ అందులో తెల్లగా కనిపిస్తున్నారు. మనకి గవన్నీ తెలియదు. అందుకే అరే మెహూగా, అఖిల్.. అవి ఎలా వాడాలో నాక్కూడా చెప్పండి. నేను కూడా మీలాగే తెల్లగా కనిపించాలి' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X