అందుకే 25 లక్షల సూట్‌కేస్ తీసుకొన్నా.. అసలు గుట్టు బయటపెట్టిన సోహెల్ సయ్యద్!

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో సోహెల్ రన్నరప్‌గా నిలుస్తారనే విషయం అందరూ ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోహెల్ అనుహ్యమైన నిర్ణయం తీసుకొని షాకిచ్చారు. టాప్ 3లో ఉండగా 25 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో అందరూ షాక్ తిన్నారు. అలా ఎందుకు తీసుకొన్నాననే విషయంపై సోహెల్ వివరణ ఇస్తూ..

నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

నేనే బలహీనుడ్ని అనే ఫీలింగ్

నేనే బలహీనుడ్ని అనే ఫీలింగ్

బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో నేనే వీకెస్ట్ కంటెస్టెంట్ అనుకొన్నాను. లాస్య, అమ్మా రాజశేఖర్, సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, అభిజిత్ లాంటి వాళ్లకు ముందే పాపులారిటీ ఉంది. నేను అందరికంటే బలహీనమైన వ్యక్తి అని అనుకొన్నాను. కానీ ఆ తర్వాత ఒక్కొక్కరు అవుట్ అవుతున్న సమయంలో నామీద నాకు కాన్ఫిడెన్స్ ఏర్పడింది.

 10వ వారంలో ఎలిమినేట్ అవుతానని

10వ వారంలో ఎలిమినేట్ అవుతానని

ఇంటిలో నాకు మెహబూబ్ దిల్ సే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ప్రతీ విషయంలో నాకు అండగా నిలబడ్డాడు. ఎలిమినేషన్‌లో ఇద్దరు ఉన్న సమయంలో నేను అవుట్ అనే ఫీలింగ్ కలిగింది. కానీ 10వ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ కావడం బాధకలిగింది. అసలు టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్. దురదృష్టవశాత్తూ ఎలిమినేట్ కావడం మరింత బాధ కలిగింది అని సోహెల్ పేర్కొన్నారు.

15 రోజుల్లోనే 10 ఏళ్ల కష్టానికి ఫలితం

15 రోజుల్లోనే 10 ఏళ్ల కష్టానికి ఫలితం

పదేళ్ల క్రితం సినిమాల్లో నటించడానికి గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. పదేళ్లు చాలా కష్టపడ్డాను. గత పదేళ్లలో పడిన కష్టానికి 15 రోజుల్లో బ్రహ్మండమైన ఫలితం, మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే బయటకు వచ్చాను కాబట్టి ఇంకా ఎలాంటి ప్లాన్స్ లేవు. తప్పుకుండా మంచి సినిమా తీస్తాను అని సోహెల్ చెప్పారు.

25 లక్షల ఆఫర్‌తో ఆలోచనలో పడ్డా

25 లక్షల ఆఫర్‌తో ఆలోచనలో పడ్డా

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సమయంలో నాకు 10 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే ఆ మొత్తం వద్దనుకొన్నాను. ఆ తర్వాత 20 లక్షల అన్నారు. అది కూడా వద్దని అనుకొన్నాను. ఆ తర్వాత 25 లక్షల రూపాయలు అని చెప్పగానే బాగా ఆలోచించాను. నా సోదరుడు, తండ్రి కూడా సరే అనడంతో ఇంకా ఆలోచనలో పడ్డాను అని సోహెల్ అన్నారు.

 స్టార్ మా ఆఫర్ బయటపెట్టిన నాగ్

స్టార్ మా ఆఫర్ బయటపెట్టిన నాగ్


25 లక్షల రూపాయల సూట్‌కేస్ పట్టుకొన్న సమయంలో నాగార్జున సార్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్టార్ మా కూడా అవకాశం ఇస్తుందని చెప్పారు. దాంతో నేను నా ఆలోచనను మానుకొని డబ్బు తీసుకోవాలనుకొన్నాను. 25 లక్షల రూపాయల్లో 10 లక్షలు అనాధ శరణాలయానికి ఇవ్వాలని అనుకొన్నాను. అదే ప్లాన్‌తో నేను సూట్ కేసు తీసుకొన్నాను అని సోహెల్ తెలిపారు.

మొత్తం 45 లక్షల రూపాయలతో

మొత్తం 45 లక్షల రూపాయలతో

ఏ సమయంలో 25 లక్షల సూట్ కేసు తీసుకొన్నానో.. అది అదృష్టంగా మారింది. ఆ తర్వాత నాగ్ సార్ 10 లక్షలు ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత చిరంజీవి మెహబూబ్‌కు మరో 10 లక్షలు ఇవ్వడం మరింత ఆనందం కలిగింది. మొత్తంగా 45 లక్షల రూపాయలు రావడం, ప్రజల ప్రేమను గెలుచుకోనే అదృష్టం కలిగింది.

చెల్లెలి పెళ్లి కోసం, ఇంటి కోసం

చెల్లెలి పెళ్లి కోసం, ఇంటి కోసం

ఇక 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా వచ్చింది. వాటిలో 10 లక్షలు అనాధల కోసం ఖర్చు చేస్తాను. ఇళ్లు లేదు కాబట్టి ఓ ఫ్లాట్ కొనేందుకు ఖర్చు చేస్తాను. అలాగే నా చెల్లెలు పెళ్లి ఉంది. ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి. అలాంటి వాటి కోసం ఖర్చు చేస్తాను అని సోహెల్ చెప్పారు.

యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా గ్యాలరీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X