మరోసారి బయటపడిన బిగ్ బాస్ కుట్ర: ఆ కంటెస్టెంట్‌ను బ్యాడ్ చేసేందుకే చూపించలేదా!

కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. కొట్లాటలు.. కోల్డ్ వార్స్ ఇలా తరచూ ఏదో ఒక సంఘటనతో హాట్ టాపిక్ అవుతోంది బిగ్ బాస్ షో. అలాంటి ఉంటేనే ఎక్కువ రేటింగ్ వస్తుందన్న కారణంతో షో నిర్వహకులు సైతం వాటినే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్‌లోనూ ఈ తరహా సన్నివేశాలు కనిపించాయి. ఇక, ప్రస్తుత సీజన్‌లోనూ ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ టాప్ కంటెస్టెంట్‌ను బ్యాడ్ చేసేందుకు బిగ్ బాస్ యూనిట్ కుట్ర చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.? వివరాల్లోకి వెళితే...

ఎవరిని అలా చూపిస్తే వాళ్లే ఔట్

ఎవరిని అలా చూపిస్తే వాళ్లే ఔట్

బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తుందని అందరికీ తెలుసు. అయితే, కొన్ని కొన్ని పరిణామాల కారణంగా ఈ షోపై సందేహాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరో ముందే చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్లబోయే కంటెస్టెంట్‌పైనే షో నిర్వహకులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

రేటింగ్ కోసం కష్టమైన ఉంచారు

రేటింగ్ కోసం కష్టమైన ఉంచారు

ఎంత చెడ్డగా గేమ్ ఆడుతున్నా.. ప్రేక్షకులు, హౌస్‌మేట్ల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. కొంత మంది కంటెస్టెంట్లను షోలో కొనసాగిస్తున్నారు బిగ్ బాస్ వాళ్లు. ప్రైవేటు సైట్లలో తక్కువ ఓటింగ్ చూపించిన వాళ్లు కూడా ముందే సేవ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కేవలం షో రేటింగ్‌ను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

వాళ్లిద్దరి గొడవనే హైలైట్ చేశారు

వాళ్లిద్దరి గొడవనే హైలైట్ చేశారు

ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎంత రచ్చ అయిందో అందరూ చూశారు. మరీ ముఖ్యంగా అభిజీత్ - అఖిల్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇది ఎప్పుడూ ఉండేదే కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు. కానీ, మరో ఎండ్‌లో దేత్తడి హారిక - సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య జరిగిన గొడవ అయితే మామూలుగా జరగలేదు. ఇది చూశాక అందరూ షాక్‌కు గురయ్యారు.

ఆ వ్యాఖ్యలతో సోహెల్‌కు కష్టాలు

ఆ వ్యాఖ్యలతో సోహెల్‌కు కష్టాలు

నామినేషన్ ప్రక్రియలో సోహెల్, హారిక ఇద్దరూ తగ్గకుండా గొడవ పడ్డారు. తనను వేస్ట్ గాడు, ఎవరూ దేకరు అన్నదన్న కారణంతో ఆమెపై ఫైర్ అయిన సోహెల్.. సహనం కోల్పోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక అమ్మాయిపై గొడవకు దిగాడంతో పాటు బాడీ షేమింగ్ కామెంట్లు చేశాడన్న కారణంతో సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.

మళ్లీ బయటపడ్డ బిగ్ బాస్ కుట్ర

మళ్లీ బయటపడ్డ బిగ్ బాస్ కుట్ర

హౌస్‌లో ఎవరిని ఉంచాలి.. ఎవరిని పంపించాలి అన్నది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. కానీ, ఈ సీజన్‌లో మాత్రం బిగ్ బాసే ఆ పనులు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్లలో చాలా వరకు ఫేక్ అనిపించడమే దీనికి కారణం. ఈ ఆరోపణలు రోజురోజుకూ ఎక్కువవుతోన్న సమయంలోనే బిగ్ బాస్ చేసిన మరో కుట్ర బయటకు వచ్చింది.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
ఆ కంటెస్టెంట్‌ను బ్యాడ్ చేసేందుకేనా!

ఆ కంటెస్టెంట్‌ను బ్యాడ్ చేసేందుకేనా!

వాస్తవానికి హారికతో గొడవ జరిగిన తర్వాతి రోజే సోహెల్ ఆమెకు సారీ చెప్పాడట. అప్పటి నుంచి ఇద్దరూ క్లోజ్ కూడా అయ్యారట. కానీ, వీటిని షోలో చూపించలేదు. ఈ విషయాలను సోహెల్.. అఖిల్‌తో చెప్పడంతో ఇది బయటకు వచ్చింది. దీంతో అతడిని కావాలనే బ్యాడ్ చేస్తున్నారని షో నిర్వహకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు హారిక - సోహెల్ ఎంతో క్లోజ్‌ అవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X