ఆ కంటెస్టెంట్లతో ఇప్పటికీ విభేదాలు నిజమే.. వాళ్లందరికీ ఇచ్చి పడేయాల్సిందే: సోహెల్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలో మొదలైన ఈ షో.. ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 7న 'బిగ్ బాస్ ఉత్సవం' పేరిట ఓ స్పెషల్ ఈవెంట్ చేస్తోంది. ఎంతో సందడిగా సాగిన ఈ వేడుకలో నాలుగో సీజన్ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ రియాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే....

నాలుగో సీజన్ ప్రత్యేకంగా.. రికార్డులు బ్రేక్

నాలుగో సీజన్ ప్రత్యేకంగా.. రికార్డులు బ్రేక్

తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక దానికి మించి ఒకటి ప్రేక్షకాదరణను అందుకుంటూ ముందుకు సాగాయి. మరీ ముఖ్యంగా ఇటీవల ముగిసిన నాలుగో సీజన్ మాత్రం ప్రత్యేకతను చాటుకుంది. టాస్కులు పరంగానే కాకుండా రికార్డుల విషయంలోనూ ఇది బెస్ట్ అని నిరూపించుకుంది. అందుకే దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది.

ఆ ఐదుగురు వీళ్లే.. నాలుగో విజేతగా అభి

ఆ ఐదుగురు వీళ్లే.. నాలుగో విజేతగా అభి

నాలుగో సీజన్ మొదటి నుంచీ ఒకే రకమైన స్పందన వచ్చింది. తద్వారా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫినాలే వరకు ఆసక్తికరంగా సాగింది. ఇక, ఈ సీజన్‌లో అభిజీత్, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, దేత్తడి హారికలు టాప్ -5లో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. అందరూ అద్భుతమైన ఆటతీరు కనబరచగా.. యంగ్ హీరో అభిజీత్ ఈ సీజన్‌లో విన్నర్ అయ్యాడు.

బిగ్ బాస్ చరిత్రను తిరగరాసిని ముద్దుబిడ్డ

బిగ్ బాస్ చరిత్రను తిరగరాసిని ముద్దుబిడ్డ

మొదటి నుంచీ అన్ని టాస్కుల్లోనూ అదరగొడుతూ మంచి ఆటగాడిగా పేరొందాడు సయ్యద్ సోహెల్ రియాన్. తోటి కంటెస్టెంట్లతో గొడవలకు దిగినప్పటికీ.. స్నేహానికి విలువనిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అయితే, గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. దీంతో ఇలా చేసిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు.

బిగ్ బాస్ ఉత్సవం అంటూ స్టార్ మా ప్లాన్

బిగ్ బాస్ ఉత్సవం అంటూ స్టార్ మా ప్లాన్

తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ షో.. ఎంతో మందిని స్టార్లుగా మార్చేసింది. దీంతో తెలుగు షోకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ కారణంగానే ఇప్పటి వరకూ జరిగిన సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్లు అందరితో 'బిగ్ బాస్ ఉత్సవం' పేరిట ప్రత్యేకమైన ఈవెంట్‌ను ప్లాన్ చేసింది స్టార్ మా.

ఎంతో సందడిగా.. వాళ్లందరూ వచ్చేశారుగా

ఎంతో సందడిగా.. వాళ్లందరూ వచ్చేశారుగా

ఎంతో సందడిగా సాగిన 'బిగ్ బాస్ ఉత్సవం' కార్యక్రమానికి కంటెస్టెంట్లు అందరూ హాజరయ్యారు. అందరూ స్టేజ్‌పై ఆట పాటలతో సందడి చేశారు. అదే సమయంలో హౌస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన అనుభూతులను పంచుకున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్‌కు హాట్ యాంకర్ శ్రీముఖి హోస్టింగ్ చేసింది. ఫిబ్రవరి 7 ఆదివారం జరగనున్న ఈ ప్రోగ్రాం ప్రోమో తాజాగా విడుదలైంది.

ఆ కంటెస్టెంట్లతో ఇప్పటికీ విభేదాలు నిజమే

ఆ కంటెస్టెంట్లతో ఇప్పటికీ విభేదాలు నిజమే

ఈవెంట్ ప్రారంభంలో హోస్ట్ శ్రీముఖి.. 'మనస్పర్థలు ఏమీ లేకుండా ఈరోజు ఉత్సవం' అని చెబుతుండగా.. మధ్యలో ఎంటరైన సోహెల్.. 'మా మధ్య మనస్పర్థలు లేవని ఎవరు చెప్పారు? ఇక్కడ మస్తు మందికి ఉన్నాయి' అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఇది కేవలం షో కోసమే కాబట్టి.. చివర్లో ప్రేక్షకులందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి పడేయాల్సిందే అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X