ఆ కంటెస్టెంట్ల మధ్య పెద్ద గొడవ: బూతులు తిడితూ సీరియస్.. కొడతానని బెదిరించడంతో తట్టుకోలేక!

గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, ఊహించని పరిణామాలు ఇలా రకరకాల సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్ నాలుగో సీజన్. దాదాపు మూడు నెలలుగా మజాను పంచుతోన్న ఈ సీజన్.. చివరి దశకు చేరుకుంది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో క్లోజ్‌గా ఉండే అఖిల్ సార్థక్ - సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఓ అమ్మాయి కారణంగా ఇది ప్రారంభం అయింది. అసలేం జరిగింది? ఎందుకు వాళ్లు గొడవ పడ్డారు? పూర్తి వివరాలు మీకోసం!

ఓట్ల కోసం పాట్లు పడుతున్న ఐదుగురు

ఓట్ల కోసం పాట్లు పడుతున్న ఐదుగురు

ఫైనల్ వీక్‌కు ముందు చివరి వారం కావడంతో ఈ సారి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరినీ (ఫినాలే మెడల్ దక్కడంతో అఖిల్‌ను మినహాయించి) నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలోనే అందరూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా టాస్కులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. వాటిలో మంచిగా ఆడి నేరుగా ఓట్లను అభ్యర్ధించవచ్చని చెప్పడంతో అందరూ శ్రమిస్తున్నారు.

ఓపిక టాస్కులో సహనం కోల్పోవడంతో

ఓపిక టాస్కులో సహనం కోల్పోవడంతో

ఈ వారం ప్రారంభంలో ‘కింగ్ ఆర్ క్వీన్' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో చిన్న గొడవ జరిగినా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అయితే, ఆ తర్వాత జరిగిన ఓపిక టాస్కులో మాత్రం పెద్ద యుద్ధాలే జరిగాయి. మొదట మోనాల్ గజ్జర్‌ - ఆరియానా మధ్య గొడవ జరగగా, ఆ తర్వాత సోహెల్ - ఆరియానా మధ్య పెద్ద రచ్చే అయింది. ఇది పెద్ద యుద్ధాన్ని తలపించింది.

 బిగ్ బాస్ షోలోనే పెద్ద గొడవ కావడంతో

బిగ్ బాస్ షోలోనే పెద్ద గొడవ కావడంతో

బిగ్ బాస్ షోలో ఎన్నో గొడవలు జరిగాయి. కానీ, ఈ వారం సోహెల్ - ఆరియానా గ్లోరీ మధ్య జరిగినది వాటన్నింటినీ మించి పోయింది. మానవత్వం గురించి వీళ్లిద్దరికీ వాగ్వాదం జరిగింది. తన బొమ్మను పడేశాడని సోహెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆరియానా. ఆ తర్వాత మోనాల్‌తో క్రూరంగా ప్రవర్తించావని ఆమెను తిట్టాడతను. దీంతో ఇది కొట్టుకునేంత వరకూ వెళ్లింది.

పంచాయితీ క్లియర్ చేసుకునే ప్రయత్నం

పంచాయితీ క్లియర్ చేసుకునే ప్రయత్నం

సోహెల్‌తో గొడవ పడుతోన్న సమయంలో ఆరియానా కింద పడిపోయి మరీ ఏడ్చేసింది. ఆ తర్వాత అతడు కూడా కన్‌ఫెషన్ రూమ్‌లో కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆ తర్వాత కూడా తనకిష్టమైన బొమ్మను బాత్‌రూంలోనే పెట్టిందని ఆరియానాను నిందిస్తూ ప్రేక్షకులకు చెప్పాడు సోహెల్. ఈ నేపథ్యంలోనే ఆమెతో పంచాయితీ క్లియర్ చేసుకోవాలని తాజా ఎపిసోడ్‌లో ప్రయత్నించాడాతను.

ఆ ప్రస్టేషన్ అతడి దగ్గర చూపించడంతో

ఆ ప్రస్టేషన్ అతడి దగ్గర చూపించడంతో

ఆరియానాతో గొడవకు పుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో సోహెల్.. ఆమెను సోఫా వద్దకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు డిస్కర్షన్ జరిగింది. నువ్వు అలా చేసుండకూడదు అంటూ ఇద్దరూ తమ తమ అభిప్రాయాలు చెప్పుకున్నారు. మొత్తానికి దీనికి పరీష్కారం రాక ముందే ఆరియానా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రస్టేషన్ అఖిల్ ముందు చూపించాడు సోహెల్.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
కొడతానని బెదిరించడంతో తట్టుకోలేక

కొడతానని బెదిరించడంతో తట్టుకోలేక

ఆ సమయంలో అనవసరంగా గొడవల్లో ఎందుకు దూరతావని అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏవో బూతులు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సోహెల్. అప్పుడు అతడి వెనకాలే వెళ్లగా దయచేసి నా దగ్గరకు రావొద్దు అని అన్నాడు. దీంతో మూతి పగలకొడతా అంటూ అఖిల్ వచ్చేశాడు. దీనికి బాగా ఫీల్ అయ్యాడు సోహెల్. ఇక, రాత్రి ఎమోషనల్ మూమెంట్ మధ్య మళ్లీ కలిశారీ ఇద్దరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X