twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను తలుచుకొంటే.. నేనేంటో చూపిస్తా.. కథ వేరేలా ఉంటుంది.. అఖిల్‌పై భగ్గుమన్న సోహైల్

    |

    బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో అఖిల్, సోహైల్ మధ్య భేదాబిప్రాయాలు భగ్గుమన్నాయి. వారి మధ్య టాస్కులు, నామినేషన్ల విషయంలో భారీగా వాగ్వాదం జరిగింది. నామినేషన్ల విషయంలో సరిగా వ్యవహరించడం లేదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొన్నారు. సోహైల్ తీరును అఖిల్ తప్పుపడితే.. సోహైల్ కూడా అదే విధంగా స్పందించాడు. వారి మధ్య జరిగిన వాదన ఏమిటంటే..

    నీ పద్దతి బాగా లేదంటూ..

    నీ పద్దతి బాగా లేదంటూ..

    కెప్టెన్సీ టాస్క్ విషయంలో మోనాల్‌కు కీ ఇచ్చిన విషయం, అరియానాకు సపోర్ట్ చేసే అంశాలపై చర్చ జరిగింది. అఖిల్ నీవు పిలుస్తే రావడం లేదు. నీ ప్రవర్తన సరిగా లేదు. ఈ విషయంలో నాకు అసంతృప్తి ఉంది అని సోహైల్ అన్నారు. అయితే సోహైల్ మాటలను అఖిల్ ఒప్పుకోకుండా... నీ పద్దతి కూడా బాగాలేదు అంటూ కామెంట్ చేశాడు. నేను రమ్మంటే నీవు రాకుండా... కథ వేరేగా ఉంటుందని సైగలు చేశావంట అంటూ అఖిల్ సీరియస్ అయ్యాడు.

    సోహైల్‌కు ఏదైనా చెబితే..

    సోహైల్‌కు ఏదైనా చెబితే..

    ఇక సోహైల్ తీరు గురించి అభిజిత్‌తో అఖిల్ చర్చ మొదలుపెట్టాడు. సోహైల్‌కు ఏదైనా చెబితే వినడం లేదు. తనదే కరెక్ట్ అంటున్నాడు. అది సరి కాదు. తను నాకు ఫ్రెండ్ అయినప్పటికి.. సోహైల్ ప్రవర్తనను ఒప్పుకోను అంటూ అఖిల్ చెబితే.. నువ్వు చెప్పేది కరెక్ట్. ఏదైనా మనం చెబితే తను పట్టించుకోడు. దానికి మరోటి సూచిస్తుంటాడు అని అభిజిత్ కూడా అన్నాడు.

    ఎనిమిది వారాలు గడిచిపోయాయి

    ఎనిమిది వారాలు గడిచిపోయాయి

    ఇంట్లోకి వచ్చి ఎనిమిది వారాలు గడచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరి పరిస్థితి అర్ధం అవుతుంది అని అఖిల్ అంటే.. ఇది నాకు ఎప్పుడో అర్ధమైంది. అందుకే నేను క్లారిటీతో ఉన్నాను. సోహైల్ నాకు ఫ్రెండే అయినప్పటికి.. చాలా సార్లు నేను ఆయన తీరును వ్యతిరేకించాను. ముఖంపైనే చెప్పడానికి వెనుకాడను అని అఖిల్ అంటే.. అలానే ఉండాలి అంటూ అభిజిత్ అన్నాడు.

    ప్రతీది ఆలోచించాల్సిన సమయం ఇది

    ప్రతీది ఆలోచించాల్సిన సమయం ఇది

    ఇక మెహబూబ్‌తో సోహైల్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతీ విషయాన్ని క్యాలికులేట్ చేస్తాను. దానిపైనే డిస్కషన్ పెడుతాను. ఇంట్లో జరిగే ప్రతి విషయం, ప్రతీ వ్యక్తి గురించి ఆలోచించాలి. ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు అని సోహైల్ అంటే... నేను అదే విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నాను. కానీ నీవే అలా ఆలోచించవద్దు. ఇంట్లో ఏదైనా జరిగితే కోపం వస్తుంది అని మెహబూబ్ సమాధానం ఇచ్చారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Episode 13 PROMO Review | తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్, హిందీ బిగ్‌బాసా?
    ఎవరూ చూపించనంతగా నా గేమ్ చూపిస్తా..

    ఎవరూ చూపించనంతగా నా గేమ్ చూపిస్తా..

    బిగ్‌బాస్ ఇంటికి వచ్చింది గేమ్ ఆడటానికే వచ్చామనే విషయం గుర్తుంచో అంటూ సోహైల్‌కు మెహబూబ్ సమాధానం ఇచ్చాడు. అయితే.. నేను చూపించాలంటే గేమ్ సరిగ్గా చూపిస్తాను. ఎంత జోవియల్‌గా ఉంటానో.. అంతే సీరియస్‌గా ఉంటాను. ఇంట్లో నేను ఎంటో చూపించాలంటే.. ఎవరూ కూడా చూపించలేడు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి పోయింది అంటూ సోహైల్ కామెంట్ చేశాడు.

    English summary
    Bigg Boss has considered Ariana Glory request while BB day care Task. He sent a monkey doll to ariana as wild card entry. Ariana felt very happy for Bigg Boss's gift. Apart from, Abhijeet, Akhil has began friendly task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X