ఏందే అంటూ అరియానాపై దురుసుగా సోహైల్.. నాగ్ హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోకుండా
బిగ్‌బాస్‌లో సుజాత వేసిన బిగ్‌బాంబు భారీగా రచ్చకు దారి తీసినట్టు కనిపిస్తున్నది. బిగ్‌బాంబు కారణంగా కెప్టెన్ సోహైల్ ఇంట్లోని వంట పాత్రలను వారంపాటు శుభ్రం చేయాల్సి ఉంటుంది. వంట పాత్రలు కడగడం అనే విషయం ఇంట్లో పెద్ద గొడవకు దారి తీసింది. సోహైల్‌తో అరియానా గ్లోరి, అమ్మా రాజశేఖర్, కుమార్ సాయి మధ్య జరిగిన గొడవ ఎలా ఉందంటే..

సోహైల్ పద్దతి మార్చుకో.. నాగ్ వార్నింగ్
గతవారాంతం ఎపిసోడ్‌లోనే సోహైల్ ప్రవర్తనపై హోస్ట్ నాగార్జున క్లాస్ పీకారు. ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడే భాష చాలా ముఖ్యం. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలాంటి భాష మాట్లాడాలో ముందే చెప్పి ఉంటారు. వాటన్నిటిని ఇంటి సభ్యులు పాటించాలి అని సోహైల్‌ను ఉద్దేశించి నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే కొరడా శిక్షనే ఉంటుంది అని నాగ్ స్పష్టం చేశాడు.

దురుసుగా సోహైల్ కామెంట్
ఇంటిలో ఇప్పటి వరకు ఎవరు వంట పాత్రలను క్లీన్ చేసినా ప్రాబ్లెం రాలేదు. కానీ నీవు మొదలుపెట్టిన తర్వాత శుభ్రంగా ఉండటం లేదు అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు. దానికి సమాధానమిస్తూ.. అయితే రోజు నీవే వంట పాత్రలు శుభ్రం చేయి. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడంటూ దురుసుగా సోహైల్ కామెంట్ చేస్తూ కనిపించాడు. దాంతో నేను కడిగేస్తానని మాస్టర్ జవాబిచ్చాడు.

పెద్ద పొగరు చూపిస్తే కుదరదు
ఆ తర్వాత సోహైల్‌కు అరియానా ఏదో చెప్పబోయింది. అందుకు వినకుండా ముఖంపై ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో అరియానా గట్టిగా క్లాస్ పీకింది. ఇదే అతి. నిన్న చెప్పింది కూడా ఇదే. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరేందో అంటూ అరియానా అనగానే.. ఏందే అంటూ సోహైల్ సహనం కోల్పోయారు. పక్కనే మెహబూబ్ హద్దు మీరుతున్నాడని గ్రహించి మందలించగానే సోహైల్ తలపట్టుకొన్నాడు.

పొగరుగా బిహేవ్ చేయకు.. అరియానా వార్నింగ్
సోహైల్ ప్రవర్తనతో మండిపడుతూ.. నేను మాట్లాడుతుంటే పొగరుగా బిహేవ్ చేస్తున్నావేంటి. నీకు నచ్చకపోతే ముఖంపై రిజెక్ట్ చేస్తావా అంటూ గట్టిగా అరియానా మందలించింది. దాంతో అరియానాపై కోపంగా చూసుకొంటూ వెళ్లిపోయాడు. అరియానా హెచ్చరించడాన్ని సోహైల్ జీర్ణించుకోలేకపోయాడనేది స్పష్టంగా కనిపించింది. తన ఆగ్రహాన్ని అణిచి పెట్టుకోవడానికి రకరకాల హావభావాలను ప్రదర్శించాడు.
Recommended Video

కుమార్ సాయి వేలు దించు అంటూ సోహైల్
ఆ తర్వాత సోహైల్‌కు కుమార్ సాయి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కెప్టెన్ అంటే గర్జించి ఏదో చేయడం కాదు. మనమంతా ఒక కేటగిరినే. అర్ధమవుతుందా? లేదు ఎవడికి ఇవ్వను అంటూ కుదరదు అంటూ కుమార్ సాయి చేయి చూపిస్తూ మాట్లాడుతుండగా.. సోహైల్ రెచ్చిపోయి.. వేలు దించు అంటూ కామెంట్ చేశాడు. దానికి సమాధానంగా ఎంత దించాలి. పాయింట్ మేరకు వేలు దించానని కుమార్ సాయి అనడం కనిపించింది.


Click it and Unblock the Notifications











